న్యూఢిల్లీ, సాక్షి: ఎన్డీయే పక్ష నేతగా మరోసారి నరేంద్ర మోదీనే ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం సుమారు గంటన్నరపాటు సాగిన భాగస్వామ్య పక్ష నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు.
బీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ సారథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటునకు తీర్మానం చేశారు కూటమి పార్టీల నేతలంతా. ఆపై మోదీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్, శివసేన షిండే వర్గం, ఇతర నేతలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్డీయే సమావేశంలో తీర్మానం
- మోదీ నాయకత్వంలోనే ఎన్నికల్లో పోరాటం చేశాము
- ఎన్డీయే ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ సాధించింది
- మరోసారి ఆయన సారథ్యంలోనే ముందుకు సాగాలని నిర్ణయించాం
- మోదీనే మేం నాయకుడిగా ఎన్నుకుంటున్నాం
- పేదలు, మహిళలు , యువత, రైతుల కోసం ఎన్డీయే పనిచేస్తుంది
ఎన్డీయే పార్టీ నేతలంతా ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంది. అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రపతి ముర్మును కలుస్తారని తెలుస్తోంది. శనివారం సాయంత్రం ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి(హ్యాట్రిక్) ప్రమాణం చేయనున్నారు.
पीएम @narendramodi के आवास पर एक घंटे चली #NDA की बैठक पूरी हुई pic.twitter.com/fkxmYSVW5Y
— Pramila Dixit (@pramiladixit) June 5, 2024
లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. అభినందనలు తెలుపుకోవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై కూటమి పార్టీలు చర్చించాయి. ఇందుకోసం ఆయా పార్టీల అగ్రనేతలు బుధవారం మధ్యాహ్నానికే ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ తరఫున అగ్రనేతలు అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత నితిన్ గడ్కరీ ఈ భేటీకి హాజరయ్యారు. అలాగే.. కూటమి పార్టీల తరఫున జేడీయూ నుంచి నితీశ్ కుమార్, తెలుగు దేశం పార్టీ నుంచి చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 292 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. బీజేపీ(240), టీడీపీ(16), జేడీయూ(12), ఏక్‌నాథ్ షిండే శివసేన(7), ఎల్జేపీ(5), జనసేన(2), ఏజీపీ(1), హిందుస్తానీ ఆవామీ మోర్చా(1), అప్నాదళ్(1), ఎన్సీపీ అజిత్ పవార్(1) ఇతరులు(2) ఉన్నాయి. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీయే సమావేశానికి ఆ పార్టీల నేతలంతా హారయ్యారు.
ఇదీ చదవండి: ఫలితాలపై మనస్తాపం.. రాజీనామాకు సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment