murali manohar joshi
-
అద్వానీ ఆశీర్వాదం తీసుకున్న మోదీ
ఢిల్లీ: బీజేపీ అగ్రనేత నరేంద్రమోదీ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కే అద్వానీని కలిశారు. ఎన్డీయే నేతగా ఎన్నికైన నేపథ్యంలో నరేంద్ర మోదీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అద్వానీ ఇంటి నుంచి బీజేపీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక.. ఇద్దరు సీనియర్ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు మోదీ.#WATCH | PM Narendra Modi meets Bharat Ratna and veteran BJP leader LK Advani at the latter's residence in Delhi. pic.twitter.com/fZtIlOj5yw— ANI (@ANI) June 7, 2024 #WATCH | PM Narendra Modi meets veteran BJP leader Murli Manohar Joshi at the latter's residence, in Delhi pic.twitter.com/7yuTbEZB54— ANI (@ANI) June 7, 2024 నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. వీరు ఇరువురు కాసేపు ముచ్చటించారు.#WATCH | PM Narendra Modi meets former President Ram Nath Kovind, in DelhiPM Modi was chosen as the leader of the NDA Parliamentary Party today. pic.twitter.com/8GI6p5lwUX— ANI (@ANI) June 7, 2024 మరోవైపు.. నరేంద్ర మోదీని ఎన్డియే పక్ష నేతగా శుక్రవారం ఏకగ్రీవంగా కూటమి ఎంపీలంతా కలిసి ఎన్నుకున్నారు. ఇక.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని రాష్ట్రపతిని సాయంత్రం 7గంటలకు కలిసి.. ఎంపీల జాబితాను ఎన్డియే కూటమి ఇవ్వనుంది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఎల్లుండి సాంయత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
‘అయోధ్య’ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషి పాత్ర ఏమిటి?
అయోధ్యలోని నూతన రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రామమందిరం గురించి ప్రస్తావించినప్పుడల్లా డాక్టర్ మురళీ మనోహర్ జోషి పేరు గుర్తుకు వస్తుంటుంది. నిజానికి రామాలయ నిర్మాణం వెనుక పెద్ద పోరాటమే జరిగింది. రామాలయ కలను సాకారం చేసుకునే దిశలో కొందరు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. అలాంటి వారిలో ఒకరే డాక్టర్ మురళీ మనోహర్ జోషి. మురళీ మనోహర్ జోషి 1934 జనవరి 5న నైనిటాల్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మన్మోహన్ జోషి. తల్లి పేరు చంద్రావతి జోషి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మురళీ మనోహర్ జోషి 1956లో తర్ల జోషిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నివేదిత, ప్రియంవద అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మురళీ మనోహర్ జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పూర్తి చేశారు. అక్కడే డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. అతని పరిశోధనా పత్రం స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినది. హిందీ భాషలో పరిశోధనా పత్రాన్ని సమర్పించిన మొదటి పరిశోధకుడు మురళి. పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత, జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అదే సమయంలో మురళీ మనోహన్ జోషి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. ఆయన చిన్న వయసులోనే గోసంరక్షణ ఉద్యమం(1953-54), 1955లో యూపీలో జరిగిన కుంభ్ కిసాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1980లో మురళీ మనోహర్ జోషి భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి అధ్యక్షునిగా పనిచేశారు. 1996లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 13 రోజులపాటు కొనసాగినప్పుడు ఆయనకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు, మురళీ మనోహర్ జోషిని కూడా అరెస్టు చేశారు. దీనికిముందు కరసేవ కోసం చేపట్టిన రథయాత్రలో మురళీ మనోహర్ జోషి ప్రసంగించిన తీరు అయోధ్య చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘రామాలయం నిర్మితమవుతుంది. దీనిని ఏ శక్తి ఆపలేదు’ అని అన్నారు. ఆయన పలికిన ఈ మాటలు లక్షలాది కరసేవకులలో ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తియ్యింది. ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మురళీ మనోహర్ జోషి హాజరుకానున్నారు. అయోధ్య రామాలయ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషితో పాటు లాల్ కృష్ణ అద్వానీ, ఉమాభారతి, విశ్వహిందూ పరిషత్ దివంగత నేత అశోక్ సింఘాల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా మురళీ మనోహర్ జోషి 2014లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. -
Ayodhya: అద్వానీకి అందని ఆహ్వానం.. ట్రస్ట్ వివరణ
ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ తరఫున ముగ్గురు సభ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది కూడా. అయితే బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వాళ్లలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరికీ ఆహ్వానాలు వెళ్లకపోవడం ఏంటనే అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు. మరోవైపు రాజకీయంగా బీజేపీపై ఈ విషయంలో విమర్శలు వినిపించాయి. దీంతో రామ టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్పందించారు. Shri Ram Janmabhoomi Mandir first floor - Construction Progress. श्री राम जन्मभूमि मंदिर प्रथम तल - निर्माण की वर्तमान स्थिति pic.twitter.com/Cz9zUS5pLe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 15, 2023 రామ మందిర ప్రారంభోత్సవ విషయం వాళ్లకు తెలియజేశామని.. అయితే వృద్ధాప్యం, వాళ్లకు ఉన్న ఆరోగ్య సమస్యల రిత్యా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక రావొద్దని చెప్పామని అన్నారాయన. అందుకు వాళ్లిద్దరూ, వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు చంపత్ రాయ్ మీడియాకు తెలియజేశారు. అద్వానీ వయసు 96 ఏళ్లుకాగా, జోషి వయసు 90. జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा दिनांक 22 जनवरी 2024 को माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के कर कमलों द्वारा की जाएगी। Hon'ble Prime Minister Shri @narendramodi ji will perform Prana Pratishtha of Shri Vigraha of… pic.twitter.com/AMBUcYjtoS — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 25, 2023 జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. श्री राम जय राम जय जय राम! Shri Ram Jai Ram Jai Jai Ram! pic.twitter.com/SZQlSwZl5X — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023 -
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (92), మురళీ మనోహార్ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్ అహ్మద్ (74), సయ్యద్ అల్కఖ్ అహ్మద్ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం) కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!) ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్ గొగోయ్ తీర్పులో పేర్కొన్నారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. -
వీడని విధ్వంసం : బాబ్రీ కేసుకు డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ : హిందూవులు చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ వైపు అడుగులు పడుతున్న వేళ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును కూడా వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా గత ఏడాది ఇచ్చిన ఆగస్ట్ 31 వరకు గడువు ముగిస్తున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి సమ్మతించిన న్యాయస్థానం విచారణ గడువును మరో నెలపాటు పొడిగించింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92), అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్లకు కొంత ఊరట లభించింది. (బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు అడ్వాణీ) కరసేవకులను రెచ్చగొట్టి కుట్రపూరితంగానే మసీదును కూల్చివేశారని (కుట్ర) ఆరోపణలు వీరు ఎదుర్కొంటున్నారు. దాదాపు 29 ఏళ్ల నుంచి కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంత మంది వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఉత్వర్వులతో విచారణ మరికొంత వేగంగా ముందుకు సాగనుంది. మరోవైపు 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. సీబీఐ కేసులో బీజేపీ అగ్రనేతలు.. 1992 డిసెంబర్ 6న సాయంత్రం (బాబ్రీ మసీదు కూల్చివేత) స్థానిక పోలీస్ స్టేషన్లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సీబీఐ వీరందరినీ విచారిస్తోంది. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30న తుది తీర్పు వెలువడాల్సి ఉంది. -
భూమిపూజకు అడ్వాణీ, జోషిలకు ఫోన్లో ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం భూమి పూజకు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషిని తప్పనిసరిగా ఆహ్వానిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఇతర నాయకుల తరహాలోనే వారిద్దరికీ ఫోన్ ద్వారా ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నాయి. అడ్వాణీ, జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తితోపాటు ఆరోగ్య కారణాల రీత్యా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహ్వానాల వ్యవహారాన్ని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌కు శనివారం ఆహ్వానాలు అందాయి. భూమి పూజకు తాము కచ్చితంగా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అడ్వాణీ, జోషీ, ఉమా భారతి ప్రధాన నిందితులన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అయోధ్యలో భూమిపూజ మహోత్సవానికి హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీఐపీ అతిథుల జాబితాను 50 మందికి కుదించినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలియజేసింది. భవ్య రామ మందిరం భూమిపూజకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. భూమిపూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరో నలుగురు నాయకులు వేదికను పంచుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ జన్మభూమి న్యాస్ చీఫ్ నృత్యగోపాల్ దాస్తోపాటు మరో ఇద్దరు వేదికపై ఉంటారు. -
అద్వానీ, జోషిలకు అందని ఆహ్వానం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి. అయితే రామమందిర భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు ఎల్కే అద్వానీ, ఎమ్ఎమ్ జోషిలకు ఆహ్వానం అందకపోగా.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు నేతలు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు వివాదంలో వీరంతా కోర్టు ముందు కూడా హాజరయ్యారు. అటువంటి అగ్రశ్రేణి నాయకులకు ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదికపై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్కడా కనిపించలేదు. -
అడ్వాణీ బాటలోనే జోషి!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలుగా బీజేపీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేత లాల్‌క్రిష్ణ అడ్వాణీకి ఎదురైన అనుభవమే సీనియర్ నేత, ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ మనోహర్ జోషికి కూడా ఎదురైంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి ఈసారి పోటీ నుంచి దూరంగా ఉండాలని పార్టీ సూచించింది. సీనియర్లకు టికెట్ ఇవ్వరాదని పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని, కురువృద్ధుడు అడ్వాణీ సహా సీనియర్లందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం జోషి కార్యాలయం కూడా స్పష్టం చేసింది. దీనిపై జోషి కాన్పూర్ ఓటర్లకు వివరణ కూడా ఇచ్చారని తెలిసింది. 85 ఏళ్ల జోషి 2014లో కాన్పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. జోషి పోటీ చేయకూడదన్నది పార్టీ పెద్దల నిర్ణయమని పార్టీ జాతీయ కార్యదర్శి రామ్‌లాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జోషి ఓటర్లకు విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు... రామ్‌లాల్ ద్వారా అందిన సూచన మేరకు నేను కాన్పూర్ నుంచే కాదు మరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లేదు’అని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. జోషి 2009 వారణాసి నుంచి గెలుపొందారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీకోసం ఆయన ఈ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే టికెట్ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ చాలామంది సీనియర్లు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అధిష్టానంపైన విమర్శలకు సాహసించలేదు. అయితే పార్టీ నాయకులు మాత్రం ఇది సమష్టి నిర్ణయమని, సీనియర్లు కొత్తవారికి అవకాశాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దాదాపు 300 మంది అభ్యర్థుల పేర్లు పార్టీ ప్రకటించినప్పటికీ కాన్పూర్ సీటుపై ఏ ప్రకటనా వెలువడలేదు. అయితే అడ్వాణీకి పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన కూతురు, లేదా కుమారుడికి అవకాశమివ్వొచ్చన్న వార్తలు వచ్చాయి. 91 ఏళ్ల అడ్వాణీతో పాటు శాంతకుమార్, బీసీ ఖండూరి, కరియాముండా, కల్రాజ్ మిశ్రా, బిజోయ్ చక్రవర్తి, పలుసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనేక మంది టికెట్ నిరాకరించబడిన జాబితాలో ఉన్నారు. -
‘నన్ను కూడా పోటీ చేయొద్దన్నారు’
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్లకు ఉద్వాసన పలుకుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తునంది. ఇప్పటకే 75 ఏళ్లు పై బడిన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నియమం తీసుకొచ్చి సీనియర్లను పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని బలపర్చడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ముఖ్య నాయుకుల విషయంలోను ఇదే వైఖరి అవలంభిస్తూ విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ కురువృద్ధుడు, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించిన అద్వాణీని ఈ ఎన్నికల్లో పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో సీనియర్ నేత చేరారు. ‘నన్ను పోటీ చేయవద్దని చెప్పారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి. ఈ మేరకు ఆయన ఓటర్లను ఉద్దేశిస్తూ రాశారంటూ ఓ లేఖ కూడా ప్రచారంలో ఉంది. రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తనను కోరిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు.. రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచే కాకుండా.. అసలు ఎక్కడి నుంచి కూడా పోటీ చేయోద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఈరోజు నన్ను కోరారు’ అని లేఖలో ఉంది. అయితే దీనిపై ఆయన సంతకం లేకపోవడం గమనార్హం. అయితే తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్ జోషి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తను పోటీ చేసే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అద్వాణీ విషయంలో కూడా పార్టీ ఇలానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా అద్వాణీ నాయకత్వం వహిస్తోన్న గాంధీ నగర్ సీటును ఈ ఏడాది అమిత్ షాకు కేటాయించారు. అయితే దీని గురించి అద్వాణీకి ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఆయనను సంప్రదించలేదని సమాచారం. ఈ విషయంలో అద్వాణీ తీవ్రంగా కలత చెందారని ఆయన సన్నిహితులు తెలిపారు. -
సీనియర్లకు ‘నమో’ నమః
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గడ్కరీ వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, సీనియర్ నేతలయిన ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. మరి కొందరు సీనియర్ నాయకులు స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద చూస్తే పార్టీ నాయకత్వం సీనియర్ నేతలు పలువురిని పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆర్ఎస్ఎస్ సూచనను బీజేపీ నాయకత్వం పాటించినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీజేపీకి పెద్దదిక్కుగా, ఆ పార్టీకి జాతీయ గుర్తింపు రావడానికి కారకుడిగా పేరొందిన ఆడ్వాణీని కూడా తప్పించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరసగా గెలిచిన ఆడ్వాణీ స్థానంలో అమిత్ షాను బరిలో దింపింది. కావాలనే పక్కన పెడుతున్నారా? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సీనియర్లను పథకం ప్రకారం పక్కన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాజ్‌పేయి హయాంలో అత్యంత గౌరవనీయ స్థానం పొందిన ఆడ్వాణీని మోదీ అసలు పట్టించుకోలేదు. ఎదుట పడినా పలకరించకుండా ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న జశ్వంత్‌సింగ్, యశ్వంత్‌సింగ్, మురళీ మనోహర్ జోషీ, ఆడ్వాణీ, శాంతకుమార్ వంటి సీనియర్లను మోదీ బోర్డు నుంచి తొలగించారు. వారిని మార్గదర్శక్ మండల్ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలో వేశారు. ఇన్నేళ్లలో ఈ కమిటీ ఒక్కసారీ సమావేశం కాలేదు. దీన్నిబట్టి మోదీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్లను పక్కన పెడుతున్నారన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేతల్లో చాలామంది మోదీ పాలనను విమర్శించిన వారే కావడం గమనార్హం. ఇంకొందరు తప్పుకున్నారు.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆడ్వాణీయే చెప్పినట్టు బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోంది. అయితే, నాయకత్వం ఆడ్వాణీని టికెట్ విషయంలో సంప్రదించనే లేదని ఆయన కార్యదర్శి చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషీ, బండారు దత్తాత్రేయకు కూడా ఈసారి టికెట్ లభించలేదు. అలాగే, సుమిత్ర మహాజన్, కరియ ముండా, శాంతకుమార్, బీజీ ఖండూరి వంటి అనుభవజ్ఞులనూ బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. కల్రాజ్ మిశ్రా, భగత్‌సింగ్ కోషియారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. -
అడ్వాణీజీ ఎన్నికల్లో పోటీపై మీరే తేల్చుకోండి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలని బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్కే అడ్వాణీ (91), మురళీ మనోహర్ జోషి (84)లను బీజేపీ కోరింది. 75 ఏళ్లు దాటిన వారికి పదవి దక్కదని చెబుతూనే.. పోటీ చేయాలా వద్దా అనేది వారి ఇష్టమని బీజేపీ పేర్కొన్నట్లు సమాచారం. ‘75 ఏళ్ల వయసు దాటిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదనే నిషేధం విధించాం. కానీ పోటీ చేసే విషయంలో ఎలాంటి నిషేధం లేదు’ అని పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. -
మర్యాద, మన్ననా తెలియదా?’: ఎంపీ చిందులు
-
కోపంతో రిబ్బన్ పీకి పారేసిన బీజేపీ సీనియర్ ఎంపీ
కాన్పూర్ : కలెక్టరేట్లో సౌర విద్యుత్ పలకల వ్యవస్థ ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషీని పిలిచారు. ఏర్పాట్లన్నీ బాగానే చేశారు. రిబ్బన్ కటింగ్ కోసం రిబ్బన్‌ను కూడా సిద్ధం చేశారు. కానీ కటింగ్ చేసేందుకు అవసరమైన కత్తెరను మాత్రం మరచిపోయారు. మందీమార్బలంతో వేదిక వద్దకు వచ్చిన ఎంపీ గారికి రిబ్బన్ కట్ చేద్దామనుకునేసరికి కత్తెర కనిపించలేదు. దాంతో కత్తెర కోసం అధికారులు ఉరుకులు పరుగులు మొదలుబెట్టారు. ఎంపీ గారికి కోపమొచ్చింది. అయినా.. ఓపిగ్గా మూడు నిమిషాలు ఎదురు చూశారు. అయినా, కత్తెర జాడ లేదు. కోపం నషాళానికెక్కింది. ఆగ్రహంగా అక్కడ కర్రకు కట్టిన రిబ్బన్‌ను చేతుల్తో లాగేసి.. ప్రారంభోత్సవం ముగిసిందంటూ ప్రకటించేశారు. వెళ్తూ, వెళ్తూ.. ‘మీరేం నిర్వాహకులు? ఇదేం పద్ధతి? మర్యాద, మన్ననా తెలియదా?’అని అధికారులకు గట్టిగానే తలంటారు. కత్తెరను ఏర్పాటు చేయకపోవడానికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సురేంద్ర సింగ్ అక్కడి అదనపు కలెక్టర్ సతీశ్‌పాల్‌ను ఆదేశించడం కొసమెరుపు. -
రిబ్బన్ కట్టారు..సిజర్ మరిచారు..
-
రిబ్బన్ కట్టారు..సిజర్ మరిచారు..
సాక్షి, కాన్పూర్ : అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచే ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్ కలెక్టరేట్లో సోలార్ లైట్ ప్యానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను కట్ చేసేందుకు సిజర్ లేకపోవడంతో విసుగెత్తిన ఎంపీ, సీనియర్ బీజేపీ నేత డాక్టర్ మురళీ మనోహర్ జోషీ చేత్తోనే చించివేసి మమ అనిపించారు. ఆ తర్వాత మరోసారి రిబ్బన్ కట్టి సిజర్‌ను సిద్దం చేస్తున్న అధికారులను ఎంపీ వారించారు. ప్రారంభోత్సవం అయిపోందని, మరోసారి హడావిడి అవసరం లేదని సదరు అధికారికి క్లాస్ తీసుకున్నారు. అధికారిని ఉద్దేశించి..‘ఈ కార్యక్రమం నిర్వాహకులు మీరేనా..? ప్రారంభోత్సవం నిర్వహించేది ఇలాగేనా..మీ ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.మరోసారి లాంఛనంగా ప్రారంభించాలని కోరగా అవసరం లేదంటూ అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగారు. మొత్తం కార్యక్రమం వీడియోలో రికార్డయింది. -
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. అయోధ్య టైటిల్ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! పీవీ నర్సింహారావు, ఎస్బీ చవాన్, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, విజయ్‌రాజ్ సింధియా, అశోక్ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్ హాషిమ్ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్బీ చవాన్ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్ సింఘాల్ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్ నాయకులు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్ జీఎన్ రాయ్, జస్టిస్ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్ అతా, పతా లేదు. పిటిషనర్ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్ అహ్మద్ సయీద్ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్ అహ్మద్, పిటిషనర్ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. -
‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట
లక్నో: 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ(89), మురళీ మనోహర్ జోషీ(83)లతో పాటు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి(58) స్వల్ప ఊరట లభించింది. వీరందరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తమను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని వీరు ముగ్గురు ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్..వయోభారం దృష్ట్యా అడ్వాణీ, జోషీలు వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. విధుల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి ఉమా భారతికి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
1992 నుంచి 2017 వరకు ఇలా..
1992, డిసెంబర్: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కరసేవకులపై, అలాగే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, మరికొందరిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 1993, అక్టోబర్: అడ్వాణీతో పాటు మరి కొందరు నేతలు ఈ కుట్రలో భాగస్వాములని సీబీఐ కాంపోజిట్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2001, మే 4: అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, బాల్‌థాకరే తదితరులపై కేసు విచారణను అదనపు సీబీఐ కోర్టు కొట్టివేసింది. 2004, నవంబర్ 2: సాంకేతిక కారణాలను చూపి కేసును కొట్టివేయడంపై సీబీఐ హైకోర్టులోని లక్నో బెంచ్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2010, మే 20: సీబీఐ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్‌కు ఎటువంటి యోగ్యత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 2011, ఫిబ్రవరి: హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. 2017, మార్చి 6: బాబ్రీ కుట్ర కేసులో బీజేపీ నేతలపై పునర్విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది. మార్చి 21: అయోధ్య వివాద పరిష్కారానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఏప్రిల్ 6: నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వ్ చేసింది. ఏప్రిల్19: అడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతీలపై నేరపూరిత కుట్రకు సంబంధించి విచారణను సుప్రీం పునరుద్ధరించింది. అంతేకాకుండా కరసేవకులతో పాటు వీఐపీలను వీరితో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. -
బాబ్రీ షాక్
⇔ అడ్వాణీ, జోషి, ఉమాభారతిలకు ఎదురుదెబ్బ ⇔ వారిపై నేరపూరిత కుట్ర అభియోగాల పునరుద్ధరణ ⇔ సీబీఐ పిటిషన్‌కు అనుమతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ⇔ వారు బాబ్రీ కేసులో విచారణ ఎదుర్కోవాలని సుప్రీం తీర్పు ⇔ లక్నోలోని ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణ ⇔ రెండేళ్ల కాలపరిమితితో కేసు విచారణ పూర్తి చేయాలి ⇔ అప్పటివరకూ ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయరాదు ⇔ రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్నందున కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు ⇔ పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనపై విచారణ న్యూఢిల్లీ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1992 నాటి ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. బాబ్రీ కూల్చి వేతకు వీరు కుట్రపన్నారన్న ఆభియోగాలపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితితో జరిగే విచారణను అడ్వాణీ, జోషి, ఉమ ఎదుర్కోవాలంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో ముందున్న అడ్వాణీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను కొట్టేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వారిపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను.. జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం స్వీకరించింది. కేసుపై రోజువారీ విచారణ లక్నోలోని ట్రయల్ కోర్టులో ఈ కేసుపై రోజువారీగా విచారణ జరుగుతుందని, తమ తీర్పు అందిన తర్వాత రెండేళ్ల నిర్ణీత కాలపరిమితిలో కేసు విచారణ ముగించా లని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ‘‘అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించాం. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు సైతం జారీ చేశాం’’అని ధర్మాసనం పేర్కొంది. రాయ్‌బరేలీ, లక్నో ట్రయల్ కోర్టుల్లో వేర్వేరుగా బాబ్రీ కేసుల విచారణ కొనసాగుతోందని, ఇకపై వీటన్నింటినీ కలిపి లక్నోలోని ట్రయ ల్ కోర్టులో ఉమ్మడి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద కేసులో కొత్తగా విచారణను ప్రారంభించడంలేదని స్పష్టం చేసింది. లక్నో ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని విచారణ పూరై్త.. తీర్పు వెలువరించే వరకూ బదిలీ చేయరాదని ఆదేశించింది. సరైన కారణం చూపించకుండా ఏ పార్టీ ఈ కేసు వాయిదా కోరేందుకు అవకాశం లేదని, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంబంధిత కారణాలపై సంతృప్తి చెందితేనే కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది. కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు.. రాజస్తాన్ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్‌సింగ్‌కు రాజ్యాంగ పరమైన రక్షణ ఉన్నందున ఆయనకు మినహాయింపు లభించింది. గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత కల్యాణ్‌సింగ్‌పై సెషన్స్ కోర్టు విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో కల్యాణ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే. 25 ఏళ్లుగా కేసు విచారణ జాప్యం కావడానికి సంబంధించి సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్ సాకు‡్ష్యల నుంచి వాంగ్మూలాల నమోదు కోసం రోజువారీగా కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో ట్రయల్ కోర్టు కేసు విచారణను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఉమ్మడిగా కేసుల విచారణ.. ‘‘క్రైమ్ నంబర్ 198/92(అడ్వాణీ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా)లో విచారణను రాయ్‌బరేలీలోని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి లక్నోలోని అదనపు సెషన్స్ కోర్టు(అయోధ్య వ్యవహారాలు) న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతితో పాటు వినయ్ కతియార్, సాధ్వీ రీతంబర, విష్ణుహరి దాల్మియాలపై రాయ్‌బరేలీ కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అడ్వాణీ, జోషీ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్.. కేసుల బదిలీ, ఉమ్మడి విచారణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే అడ్వాణీ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సతీష్ప్రదాన్, సీఆర్ బన్సల్, ధర్మ్‌దాస్, మహంత్ నృత్యగోపాల్‌దాస్, మహామండలేశ్వర్ జగదీశ్ ముని, ఆర్వీ వేదాంతి, బీఎల్ శర్మ, సతీశ్చంద్రనగర్ తదితరులపై కూడా సెషన్స్ కోర్టు 120బీ కింద అభియోగాలు నమోదు చేస్తుందని స్పష్టం చేసింది. వీవీఐపీలపై కొత్తగా ఎటువంటి అభియోగాలు నమోదు చేయడం లేదని, గతంలో నమోదు చేసిన నేరపూరిత కుట్ర అభియోగాలనే పునరుద్ధరించాలని మాత్రమే తాము కోరుతున్నామని సీబీఐ స్పష్టం చేసింది. రెండు కోర్టుల్లో విచారణ 1992 డిసెంబర్ 6 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రెండు సెట్ల కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. మొదటిదానిలో గుర్తించని కరసేవలకుపై నమోదైన కేసు విచారణ లక్నో కోర్టులో జరుగుతోంది. పలువురు భాజపా నేతల ప్రమేయం ఉన్న కేసు విచారణ రాయ్‌బరేలి కోర్టులో కొనసాగుతోంది. సీబీఐ చార్జిషీట్లో అడ్వాణీతో పాటు 20 మందిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్లు 153ఏ(వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం), 153బీ(జాతీయ సమగ్రతను దెబ్బతీయడం), 505(తప్పడు ప్రకటనలతో పుకార్లను సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం) కింద అభియోగాలు నమోదు చేసింది. 120బీ(నేరపూరిత కుట్ర) కింద కూడా అభియోగాలు నమోదు చేసింది. అయితే దీనిని ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2010 మే 20న అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ హజీ మహబూబ్ అహ్మద్(ప్రస్తుతం జీవించిలేరు), సీబీఐ సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. -
పాతికేళ్ల నీడ
-
సుప్రీంకోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ
-
సుప్రీంకోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానితో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు, రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. బాబ్రీ కేసు 25ఏళ్లు పెండింగ్‌లో ఉండటం న్యాయాన్ని నిరాకరించడమే అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అందుకే రోజువారీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులు చాలామంది మరణించారని, మరికొంతమంది జీవిత చరమాంకంలో ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది. రాయ్‌బరేలి కోర్టు నుంచి విచారణను లక్నో ట్రయిల్ కోర్టు బదిలీకి అనుమతి ఇస్తూ రోజువారి విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు విచారణ పూర్తయ్యేవరకూ జడ్జిలను బదిలీ చేయరాదని సూచించింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో అద్వానీ, జోషీలతో పాటు కేంద్ర మంత్రి ఉమా భారతి, వినయ్ కటియార్, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. అయితే కల్యాణ్ సింగ్‌కు మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కర సేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో సీబీఐ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
రేపు తేలనున్న అద్వానీ భవితవ్యం!
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు విముక్తి లభిస్తుందా లేక నిందితులుగా విచారణ ఎదుర్కొంటారా అన్నది బుధవారం తేలనుంది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేసు విచారణలో వీళ్లను నిందితులుగా ఉంచాలా లేదా అన్న విషయాన్ని రేపు సుప్రీం కోర్టు నిర్ణయించనుంది. ఈ నెల 7న ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో అద్వానీ, జోషీలతో పాటు కేంద్ర మంత్రి ఉమా భారతి, వినయ్ కటియార్, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కరసేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. కాగా సీబీఐ ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
కొత్త రాష్ట్రపతి ఎవరో?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలవడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు కావల్సిన బలం చాలావరకు ఎన్డీయేకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎవరవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఐదేళ్లు జూలై నెలలో ముగుస్తుంది. దాంతో ఈలోపుగానే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తన గురుతుల్యులు, తాను ఈ స్థానానికి చేరుకునేందుకు వేలుపట్టి అడుగులు వేయించిన కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీలలో ఎవరో ఒకరికి రాష్ట్రపతి పదవిని మోదీ కట్టబెడతారా.. లేక వాళ్లిద్దరూ కాకుండా వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. తన తొలి నాళ్లలో ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ సాయంత్రం పూట మురళీ మనోహర్ జోషి చెప్పే పాఠాలను మోదీ వింటుండేవారు. 1992లో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జోషి మూడు రంగుల జెండా ఎగరేసినప్పుడు.. ఆయన పక్కనే మోదీ నిలబడ్డారు. అలాగే, మోదీ సంక్షోభంలో ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని తీవ్రంగా ఇంటా బయటా ఒత్తిడి వచ్చినా, ఎల్కే అద్వానీ మాత్రం మోదీకి గట్టి మద్దతుగా నిలబడి, ఆయనను ఆ పదవిలో కొనసాగేలా చేశారు. దాంతో వీళ్లిద్దరి పట్ల మోదీకి కృతజ్ఞతాభావం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. అంతమాత్రాన వాళ్లలో ఒకరిని రాష్ట్రపతిగాను, మరొకరిని ఉప రాష్ట్రపతిగాను చేస్తారా అంటే.. అనుమానమేనని బీజేపీలో కొందరు నాయకులు అంటున్నారు. మహిళలు, దళితులు, గిరిజనులు లేదా ఆర్ఎస్ఎస్ సీనియర్లు.. వీళ్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఇందుకు తగినట్లుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మోదీ మాత్రం ఈ ఆలోచనలన్నింటికీ భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరుస్తారని కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్ని ఓట్లు కావాలి.. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టొరల్ కాలేజిలో మొత్తం 10,98,882 ఓట్లుంటాయి. అందులో సగం ఓట్లకు పైగా వస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అంటే, 5,49,442 ఓట్లు కావాలన్న మాట. ఉత్తరప్రదేశ్‌లో 321 స్థానాలు, ఉత్తరాఖండ్‌లో 57 స్థానాలతో పాటు మణిపూర్, గోవాలలో సాధించిన విజయాలతో ఎన్డీయే చాలావరకు ఈ సంఖ్యకు దగ్గరగా వచ్చింది. ఇక మరో 25,354 ఓట్లు సంపాదిస్తే చాలు.. రాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమం అయిపోతుంది. శనివారం నాటి ఎన్నికల ఫలితాలకు ముందు ఈ తేడా 79,274గా ఉండేది. ఇప్పుడది గణనీయంగా తగ్గింది. మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో ఎలక్టొరల్ కాలేజి ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఇందులో ఓటుహక్కు ఉండదు. రాష్ట్ర జనాభాను బట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఉదాహరణకు ఎంపీలకు ప్రతి ఓటుకు గరిష్ఠంగా 708 విలువ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. యూపీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కావడంతో కేవలం ఆ రాష్ట్రంలోనే మొత్తం 83,824 ఓట్లుంటాయి. ఇలా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ల వాళ్ల ఓటు విలువను బట్టి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేస్తారు. -
కర్మభూమిలో కురువృద్ధుడికి అవమానం!
పార్లమెంట్ లో రెండు సీట్లతో ప్రారంభమై, మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయిలో భారతీయ జనతా పార్టీని నిలిపిన మూడు స్తంభాల్లో ఒకరు మురళీ మనోహర్ జోషి. మిగతా ఇద్దరు అటల్ బిహారీ వాజపేయి, ఎల్ కే అద్వానీలు. చివరి ఇద్దరి కంటే భిన్నంగా మనోహర్ జోషి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదులుకొని పార్టీ ఉన్నతికి కృషి చేశారు. జోషి పుట్టింది నైనిటాల్ లోనే అయినప్పటికీ అలహాబాద్ యూనివర్సిటీలో ఆయన జీవితం మలుపు తిరిగింది. విద్యార్థిగా ప్రవేశించి, పీహెచ్ డీ పూర్తిచేసి, వర్సిటీలోనే ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. విలక్షణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవైన అలహాబాద్ పేరు చెబితే చాలా మందికి.. నెహ్రూ, ఇందిర, అమితాబ్ బచ్చన్, హరిప్రసాద్ చౌరాసియాలతోపాటు మురళీ మనోహర్ జోషి పేరు కూడా గుర్తుకొస్తుంది. అలాంటి కర్మభూమిలో, సొంత పార్టీ నేతల చేతిలోనే అవమానానికి గురయ్యారు మనోహర్ జోషి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యూహరచన చేసేందుకు బీజేపీ ఆదివారం అలహాబాద్ లో జాతీయ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర సీనియర్ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంతటి కీలక సమావేశానికి కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని పిలవకపోవడంపై అలహాబాద్ లోని ఆయన అనుచరగణం భగ్గుమంటోంది. సమావేశానికి వచ్చే నాయకులకు స్వాగతం తెలుపుతూ యూపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోనూ జోషి ఫొటో ఎక్కడా కనిపించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. అద్వానీ, వాజపేయిల ఫొటోలు కూడా ఏక్కడోగానీ కనబడలేదట. 'జోషి గారు రెండు రోజులుగా అలహాబాద్ లోనే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు రమ్మని ఏఒక్కరూ ఆయనను పిలవలేదు. ఇది జోషిని అవమానించినట్లు కాదా? ఇలాంటి చర్యల ద్వారా ఇప్పుడున్న నాయకులు ఏం చెప్పదలుచుకుంటున్నారు?' అంటూ మీడియా ముందు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు జోషి అనుచరులు. తమ నాయకుడికి జరిగిన అవమానంపై పార్టీ సమావేశాల్లో నిలదీస్తామని అంటున్నారు. అలహాబాద్ నుంచి మూడు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన మనోహర్ జోషి.. 2009లో వారణాసి నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆయన కాన్పూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. సంఘ్ నిర్దేశకత్వంలో మోదీ-షా ద్వయం నడిపిస్తోన్న బీజేపీలో సీనియర్లకు ప్రాధాన్యం ఎప్పుడో తగ్గిపోయిందని, 'కాంగ్రెస్ ముక్త్ భారత్' పిలుపునిచ్చిన పార్టీ 'కాంగ్రెస్ యుక్త్'లా మారిపోయిందని పార్టీ సీనియర్ కార్యకర్త ఒకరు కామెంట్ చేశారు. -
యోగాతో లైంగిక దాడులు తగ్గుతాయి: జోషి
యోగా చేయడంవల్ల దేశంలో లైంగిక దాడులు తగ్గుముఖం పడతాయని బీజేపీ ప్రముఖ నేత మురళీ మనోహర్ జోషి అన్నారు. "సాధారణ వ్యక్తుల జీవితాల్లోకి యోగాను ఆహ్వానించడం వల్ల మనం రోజూ చూస్తున్న లైంగిక దాడులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పనుగానీ కచ్చితంగా తగ్గుతాయని మాత్రం చెప్పగలను. ఎందుకంటే యోగా.. స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది. భావోద్వేగాలు మారిపోతాయి. ఎన్నో పనులు చేయడానికి ఈ ప్రకృతి మనకు ఈ శరీరాన్ని అందించింది.. ఆ పనుల వైపుగా మనిషి సాగిపోతాడు' అని డిళ్లీలో యోగాపై జరిగిన ' ది లైంగర్ వే యోగా ఫర్ ది న్యూ మిలినీయం' అనే అంశంపై జరిగిన సెమినార్లో వ్యాఖ్యానించారు. కాగా ముస్లింలు రోజూ ఐదుసార్లు యోగా చేస్తారని, వారి పవిత్ర దైవం మహ్మద్ గొప్ప యోగి అని కాస్త వివాదమయ్యే వ్యాఖ్యలు కూడా చేశారు. -
అఖిలేష్ తో మనోహర్ జోషి భేటీ
లక్నో: బీజేపీ సీనియర్ నాయకుడు, కాన్పూర్ ఎంపీ మురళీ మనోహర్ జోషి శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను కలిశారు. కాన్పూర్ ను డిఫెన్స్ హబ్ గా తయారుచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సీఎంతో చర్చించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇక్కడ నుంచి రాజ్యసభకు ఎన్నికకావడంతో కాన్పూర్ ను డిఫెన్స్ హబ్ గా తయారు చేయాలని నిర్ణయించినట్టు మనోహర్ జోషి తెలిపారు. కాన్పూర్ ప్రస్తుత ఆదాయం 10 వేల కోట్లు అని చెప్పారు. డిఫెన్స్ హబ్ గా రూపొందితే ఆదాయం 20 వేల నుంచి 25 వేల కోట్లకు పెరిగే అవకాశముందన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కొత్త విధానంతో ఉత్తరప్రదేశ్ కు మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలని సూచించారు. -
గవర్నర్లుగా బీజేపీ సీనియర్ నేతలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మీద దృష్టి కేంద్రీకరించింది. యూపీఏ హయంలో నియమితులైన గవర్నర్లను సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గవర్నర్ల వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వంలో లేని బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర గవర్నర్‌గా మురళీ మనోహర్ జోషీని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ల నియామకం జరగనుంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించింది. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నియమించారనే అపవాదును యూపీఏ ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాటలోనే మోడీ ప్రభుత్వం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నర్ల జాబితాలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. ఆయన స్థానంలో గవర్నర్‌గా బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్‌ను నియమించనున్నట్టు ప్రచారం సాగుతోంది. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను తొలగించే ప్రక్రియను చేపడతారన్న సమాచారంతో ప్రస్తుత గవర్నర్ల పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. -
మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి
కాన్పూర్: దేశంలో నరేంద్ర మోడీ గాలి ఏమీ లేదని, కేవలం ఉన్నది బీజేపీ గాలి మాత్రమేనని వ్యాఖ్యానించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఒక రోజు వ్యవధిలోని మాటామార్చారు. ఈ వివాదం మరింత రాజుకోకముందే జోషి తన గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అంతటితో ఆగకుండా మోడీ ఒక సమర్ధనాయకుడిగా అభివర్ణించి తన విధేయతను చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే మోడీ వంటి సమర్ధనాయకుడు అవసరమని జోషి తెలిపారు. నిన్న చోటు చేసుకున్న వివాదాలకు తెరదించిన జోషి మీడియాతో మాట్లాడుతూ... 'మోడీకి నాకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయన మా పార్టీ గర్వంచదగ్గ నాయుకుడు' అని కొనియాడారు. ప్రజలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే అది మోడీతోనే సాధ్యమన్నారు. బీజేపీ-నరేంద్ర మోడీ వేర్వేరు కాదని, పార్టీతో ముడిపడిన వ్యక్తే మోడీ అని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు స్పష్టం చేయడంతో మురళీ మనోహర్ జోషి వెనక్కి తగ్గకతప్పలేదు. -
బీజేపీ, మోడీ ఒకటే: రాజ్‌నాథ్
ఢిల్లీ: దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అగ్రనేతలు స్పందించారు. నరేంద్ర మోడీ దేశంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడని... బీజేపీ, మోడీ ఒకటేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంలో పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతోందని అరుణ్ జైట్లీ తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇక మోడీ ప్రభావంపై వివాదం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభవాన్ని అడ్డుకునేందుకు పార్టీలో కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. మోడీ అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. -
దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదు: బీజేపీ సీనియర్ నేత జోషి
న్యూఢిల్లీ: సొంత పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని చెప్పారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న జోషి గుజరాత్ నమూనా అభివృద్ధి అన్ని రాష్ట్రాలకూ సరిపడదన్నారు. ఒక రాష్ట్రానికి చెందిన అభివృద్ధి నమూనాను తాను ప్రోత్సహించబోనని, వివిధ రాష్ట్రాల్లోని మంచి అంశాలను తీసుకుని అభివృద్ధి నమూనాను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఒక పార్టీ ప్రతినిధి మాత్రమే అని, ఆయనకు బీజేపీ నేతలతో పాటు దేశమంతా మద్దతును ఇస్తోందని చెప్పారు. నరేంద్ర మోడీ కోసం తన వారణాసి స్థానాన్ని మురళీ మనోహర్ జోషి వదులుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మనోరమా న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జోషి తాజా వ్యాఖ్యలతో బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. -
వారణాసి బరిలో మోడీ
లక్నో నుంచి రాజ్‌నాథ్ కాన్పూర్‌కు ఎం.ఎం. జోషీ మార్పు సిద్ధూ సీటు జైట్లీకి కేటాయింపు 55 మందితో బీజేపీ నాలుగో జాబితా సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 80 లోక్‌సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంలో దోహదపడేందుకు పార్టీ ప్రచార రథసారథి, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని యూపీ నుంచే ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ కంచుకోటల్లో ఒకటైన వారణాసి స్థానాన్ని ఆయనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లక్నో సీటును కేటాయించింది. రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ తదితర 12 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం రాత్రి 11.05 గంటలకు 55 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. వారణాసి, లక్నో సీట్ల కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మోడీ, రాజ్‌నాథ్‌ల పేర్లు ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ మీడియాకు ఈ జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి కాన్పూర్ స్థానాన్ని కేటాయించింది. ఘజియాబాద్ నుంచి ఎంపీగా ఉన్న రాజ్‌నాథ్‌కు లక్నో సీటు ఇచ్చింది. తొలుత లక్నో స్థానాన్ని వదులుకోడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సిట్టింగ్ ఎంపీ లాల్జీ టాండన్ పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ జోక్యంతో సద్దుమణిగారు. ఇక అమృత్సర్ లోక్‌సభ స్థానంపై వివాదం కొనసాగింది. అమృత్సర్ స్థానాన్ని తనకు కేటాయించకుంటే మరేస్థానంలోనూ పోటీచేయబోనని సిట్టింగ్ ఎంపీ, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. కానీ అరుణ్ జైట్లీకి ఆ స్థానాన్ని కేటాయిస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. చివరకు అరుణ్‌జైట్లీకి అమృత్సర్ స్థానం దక్కింది. ఫిలిబిత్ నుంచి మేనకా గాంధీ, సుల్తాన్‌పుర్ నుంచి వరుణ్ గాంధీ, ఝాన్సీ నుంచి ఉమాభారతి పోటీ చేయనున్నారు. బీహార్‌లోని పాట్నా సాహిబ్ నుంచి బాలీవుడ్ నటుడు శతృఘ్నసిన్హా పోటీ చేయనున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించి.. హర్షవర్ధన్ (చాందనీచౌక్), మనోజ్ తివారీ (ఈశాన్య ఢిల్లీ), మహేష్ గిరి (తూర్పు ఢిల్లీ), మినాక్షి లేఖీ (న్యూఢిల్లీ), ఉదిత్‌రాజ్ (నార్త్‌వెస్ట్ ఢిల్లీ), పర్వేశ్ వర్మ (పశ్చిమ ఢిల్లీ), రమేష్ బిధూరి (దక్షిణ ఢిల్లీ) బరిలోకి దిగనున్నారు. కాగా, వివిధ పార్టీలతో పొత్తుల అంశంపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తుకు ముందుకు వెళ్లడానికి బోర్డు సుముఖత తెలిపినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తమిళనాడులో నటుడు విజయ్‌కాంత్ స్థాపించిన డీఎండీకేతో బీజేపీ శనివారం పొత్తు కుదుర్చుకుంది. సుష్మ-జైట్లీ మధ్య వాగ్వాదం! ఎన్నికల కమిటీ సమావేశంలో సుష్మా స్వరాజ్, అరుణ్‌జైట్లీ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. యడ్యూరప్పకు సీటు ఇవ్వడం, బీఎస్ఆర్ కాంగ్రెస్ నేత శ్రీరాములను పార్టీలోకి తీసుకోవడాన్ని సుష్మ తప్పుపట్టారు. తాను వ్యతిరేకించినప్పటికీ వీరిరువురికి పార్టీ టికెట్లు ఇవ్వడంపై సుష్మ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయితే రాజకీయ నాయకుల ఇష్టాయిష్టాలపై అభ్యర్ధుల ఎంపిక జరగదని జైట్లీ వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
నరేంద్ర మోడీ కోసం నా సీటుకు ఎసరా?
రాజ్‌నాథ్‌ను నిలదీసిన మురళీ మనోహర్ జోషీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ బీజేపీలో లుకలుకలు పొడచూపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్‌లు శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను నిలదీశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై అక్కడి సిట్టింగ్ ఎంపీ జోషీ మండిపడ్డారు. మోడీ కోసం తన స్థానానికి ఎసరుపెట్టడం ఏమిటని నిలదీశారు. ఒకవేళ ఈ ప్రచారమంతా ఒట్టిదైతే దానిపై వివరణ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. మరోవైపు పార్టీలోకి కేజేపీ (యడ్యూరప్ప), బీఎస్ఆర్ కాంగ్రెస్ (బి. శ్రీరాములు) విలీనాన్ని బాహాటంగానే వ్యతిరేకించిన సుష్మాస్వరాజ్...అవినీతిపరులను పార్టీలో తిరిగి చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం భేటీ మధ్యలోనే వారు బయటకు వెళ్లిపోయారు. 52 మందితో బీజేపీ రెండో జాబితా లోక్‌సభ ఎన్నికలకు 52 మందితో పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. కర్ణాటక నుంచి 20 మందికి, పశ్చిమ బెంగాల్ నుంచి 17 మంది, ఒడిశా నుంచి ఐదుగురు, అస్సాం నుంచి ఐదుగురు, కేరళ నుంచి ముగ్గురు, త్రిపుర నుంచి ఇద్దరు అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది. వీరిలో 16 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ నుంచి వైదొలగి సొంత పార్టీ (కేజేపీ) పెట్టుకొని తిరిగి ఇటీవల బీజేపీలో చేరిన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు ఈ జాబితాలో చోటు దక్కింది. షిమోగా స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.