బీజేపీ, మోడీ ఒకటే: రాజ్నాథ్
ఢిల్లీ: దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అగ్రనేతలు స్పందించారు. నరేంద్ర మోడీ దేశంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడని... బీజేపీ, మోడీ ఒకటేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అన్నారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అని గుర్తు చేశారు.
మోడీ నాయకత్వంలో పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతోందని అరుణ్ జైట్లీ తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇక మోడీ ప్రభావంపై వివాదం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభవాన్ని అడ్డుకునేందుకు పార్టీలో కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. మోడీ అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.