Shahid Siddiqui
-
అందుకే రాజీనామా చేశాను.. ఆర్ఎల్డీ కీలక నేత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జయంత్ చౌధరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు 'షాహిద్ సిద్ధిఖి' పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అయన పదవికి రాజీనామా చేశారు. సిద్ధిఖి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్న సమయంలో చూస్తూ మౌనంగా ఉండలేను. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరికి పంపినట్లు వెల్లడించారు. జయంత్ చౌదరిని ఉద్దేశించి.. మేము 6 సంవత్సరాలు కలిసి పని చేసాము, ఒకరినొకరు గౌరవించుకున్నాము. నేను.. నిన్ను సహోద్యోగి కంటే కూడా తమ్ముడిగానే భావించాను. ముఖ్యమైన సమస్యలను సోదరభావంతో పరిష్కరించుకున్నాము. మీ దివంగత తాత, భారత రత్న చరణ్ సింగ్, మీ దివంగత తండ్రి అజిత్ సింగ్ అందరూ కూడా పార్టీ విలువల కోసం నిలబడ్డారు అని షాహిద్ సిద్ధిఖి అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. గరిష్టంగా 80 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో, ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ వంటి వాటిని కలుపుకొని బీజేపీ బలమైన కూటమికి నాయకత్వం వహిస్తోంది. Respected Jayantji, We have worked together for 6 long years and have respect for each other. I, for one, look upon you more as a younger brother than a colleague. We have stood shoulder to shoulder on significant issues and at creating an atmosphere of brotherhood and respect… — shahid siddiqui (@shahid_siddiqui) April 1, 2024 -
'దేశానికి హాని చేయాలనుకుంటోంది'
న్యూఢిల్లీ: గోమాంసం నిషేధంతో భారతదేశానికి, సమాజానికి బీజేపీ హానీ చేయాలనుకుంటుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. త్వరలో బక్రీద్ రానున్న నేపథ్యంలో ఇలాగే నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే జైనుల పవిత్ర దినం సందర్భంగా మాంసంపై మహారాష్ట్రలో మాంసం నిషేధించడంపట్ల పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అటు జమ్మూకాశ్మీర్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాల నిషేధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'త్వరలో బక్రీద్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మాంసంపై నిషేధం విధించి ఒకరిని సంతృప్తి పరచడానికి ఇది సరైన సమయం.. సరైనది కూడా కాదు. ఇది వరకే బీజేపీ తాము మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యలకు దిగడం లేదని చెప్పింది. కానీ జైనులు కూడా మైనారిటీలే కదా. అయినా, ఎవరేం తినాలో తినకూడదో అనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చించుకుంటూ ఒక హాస్య వాతావరణం సృష్టించాం' అని ఆయన అన్నారు. -
మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి
కాన్పూర్: దేశంలో నరేంద్ర మోడీ గాలి ఏమీ లేదని, కేవలం ఉన్నది బీజేపీ గాలి మాత్రమేనని వ్యాఖ్యానించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఒక రోజు వ్యవధిలోని మాటామార్చారు. ఈ వివాదం మరింత రాజుకోకముందే జోషి తన గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అంతటితో ఆగకుండా మోడీ ఒక సమర్ధనాయకుడిగా అభివర్ణించి తన విధేయతను చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే మోడీ వంటి సమర్ధనాయకుడు అవసరమని జోషి తెలిపారు. నిన్న చోటు చేసుకున్న వివాదాలకు తెరదించిన జోషి మీడియాతో మాట్లాడుతూ... 'మోడీకి నాకు ఎటువంటి విభేదాలు లేవని, ఆయన మా పార్టీ గర్వంచదగ్గ నాయుకుడు' అని కొనియాడారు. ప్రజలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే అది మోడీతోనే సాధ్యమన్నారు. బీజేపీ-నరేంద్ర మోడీ వేర్వేరు కాదని, పార్టీతో ముడిపడిన వ్యక్తే మోడీ అని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు స్పష్టం చేయడంతో మురళీ మనోహర్ జోషి వెనక్కి తగ్గకతప్పలేదు. -
బీజేపీ, మోడీ ఒకటే: రాజ్‌నాథ్
ఢిల్లీ: దేశంలో నరేంద్ర మోడీ గాలి లేదని, ప్రస్తుతం వీస్తున్నదల్లా బీజేపీ గాలి మాత్రమే అని బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అగ్రనేతలు స్పందించారు. నరేంద్ర మోడీ దేశంలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడని... బీజేపీ, మోడీ ఒకటేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంలో పార్టీ ఎన్నికల ప్రచారం జరుగుతోందని అరుణ్ జైట్లీ తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఇక మోడీ ప్రభావంపై వివాదం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభవాన్ని అడ్డుకునేందుకు పార్టీలో కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. మోడీ అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.