మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి | No differences between me and Modi, says murli manohar Joshi | Sakshi
Sakshi News home page

మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి

Published Mon, Apr 14 2014 5:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి - Sakshi

మోడీ.. గర్వించదగ్గ నాయకుడు:జోషి

కాన్పూర్: దేశంలో నరేంద్ర మోడీ గాలి ఏమీ లేదని, కేవలం ఉన్నది బీజేపీ గాలి మాత్రమేనని వ్యాఖ్యానించిన బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఒక రోజు వ్యవధిలోని మాటామార్చారు. ఈ వివాదం మరింత రాజుకోకముందే  జోషి తన గత వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.  అంతటితో ఆగకుండా మోడీ ఒక సమర్ధనాయకుడిగా అభివర్ణించి తన విధేయతను చాటుకున్నారు. ప్రస్తుతం ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే మోడీ వంటి సమర్ధనాయకుడు అవసరమని జోషి తెలిపారు.

 

నిన్న చోటు చేసుకున్న వివాదాలకు తెరదించిన జోషి మీడియాతో మాట్లాడుతూ... 'మోడీకి నాకు ఎటువంటి విభేదాలు లేవని,  ఆయన మా పార్టీ గర్వంచదగ్గ నాయుకుడు' అని కొనియాడారు.  ప్రజలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే అది మోడీతోనే సాధ్యమన్నారు.  బీజేపీ-నరేంద్ర మోడీ వేర్వేరు కాదని,  పార్టీతో ముడిపడిన వ్యక్తే మోడీ అని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు స్పష్టం చేయడంతో మురళీ మనోహర్ జోషి వెనక్కి తగ్గకతప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement