న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. అందుకోసం ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. రామ మందిరం అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే పేర్లలో మొదటి వరుసలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో అయోధ్యలో రామమందిరం కట్టాలన్న డిమాండ్‌తో 1990లో అద్వానీ చేపట్టిన రథయాత్ర బీజేపీని మరింత ఎత్తున నిలబెట్టాయి.
అయితే రామమందిర భూమి పూజ కార్యక్రమానికి బీజేపీ అగ్ర నాయకులు ఎల్‌కే అద్వానీ, ఎమ్‌ఎమ్ జోషిలకు ఆహ్వానం అందకపోగా.. మాజీ కేంద్రమంత్రి ఉమాభారతి, మాజీ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌లకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ వివాదంలో ఈ ఇద్దరు నేతలు సీబీఐ విచారణను సైతం ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు వివాదంలో వీరంతా కోర్టు ముందు కూడా హాజరయ్యారు. అటువంటి అగ్రశ్రేణి నాయకులకు ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. ఇప్పటివరకు రూపొందించిన షెడ్యూల్‌లోకానీ, వేదికపై కూర్చొనే ఆహ్వానితుల జాబితాలో కానీ వారి పేర్లు ఎక్కడా కనిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment