‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట | Relief to bjp stalwarts in babri case | Sakshi
Sakshi News home page

‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట

Published Thu, Jun 8 2017 1:38 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట - Sakshi

‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట

లక్నో: 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ(89), మురళీ మనోహర్‌ జోషీ(83)లతో పాటు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి(58) స్వల్ప ఊరట లభించింది. వీరందరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తమను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని వీరు ముగ్గురు ఇంతకుముందు పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన  ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్‌..వయోభారం దృష్ట్యా అడ్వాణీ, జోషీలు వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. విధుల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి ఉమా భారతికి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement