babri case
-
‘ధిక్కారం’ కేసునే మరచిపోవడం దిగ్భ్రాంతికరం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య స్థల వివాదంపై సుప్రీం కోర్టు త్వరలోనే తుది విచారణను ప్రారంభించనున్న నేపథ్యంలో 1992, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రి విధ్వంసానికి సహకరించిన నేతలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ పునరుద్ధరణకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1995లో సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కోర్టు ధిక్కార పిటిషన్ ఒకే ఒక్కసారి అంటే, 1997. మార్చి 26వ తేదీన విచారణకు వచ్చింది. అదే సంవత్సరం వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను కొనసాగిస్తామని నాటి సుప్రీం కోర్టు బెంచీ ప్రకటించింది. ఆ తర్వాత ఈ పిటిషన్ ఎవరికి అంతుచిక్కని విధంగా మరుగున పడిపోయింది. పిటిషన్‌ను దాఖలు చేసిన వారే కాకుండా, ఇందులో నిందితులుగా ఉన్న వారు కూడా ఈ పిటిషన్‌ను మరచిపోయారు. ఈ పిటిషన్లో ఏడుగురు ప్రముఖులు నిందితులుకాగా, నలుగురు ఇప్పటికే మరణించారు. అయోధ్య టైటిల్ కేసుకు సంబంధించిన వందలాది పిటిషన్లపై విచారణల పరంపర కొనసాగడం, పర్యవసానంగా టైటిల్‌పై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఇప్పుడు సుప్రీం కోర్టులో తుది విచారణం ప్రారంభమవడం లాంటి పరిణామాల మధ్య బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించిన కీలకమైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మరచిపోవడం న్యాయవర్గాలకే దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇందులో ఉన్న నిందితులను గుర్తుచేసుకుంటే పిటిషన్ ఎందుకు మరుగున పడిపోయిందో అర్థం చేసుకోవచ్చునుకుంటా! పీవీ నర్సింహారావు, ఎస్బీ చవాన్, ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, విజయ్‌రాజ్ సింధియా, అశోక్ సింఘాల్‌లు ఈ కేసులో నిందితులు. బాబ్రీ మసీదు వద్ద యథాతథా స్థితిని కొనసాగించాలని, మసీదుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వీరు ‘మనస్ఫూర్తిగా, ఉద్దేశపూర్వకంగా’ ఉల్లంఘించారని కేసు దాఖలైంది. అయోధ్య–బాబ్రీ వివదానికి సంబంధించి 1961లో సున్నీవక్ఫ్ బోర్డుతోపాటు తొలి పిటిషన్‌ను దాఖలు చేసిన సహ వాది మొహమ్మద్ హాషిమ్ అన్సారీయే ఈ కోర్టు ధిక్కార పిటిష¯Œ ను దాఖలు చేశారు. నాడు పీవీ నర్సింహారావు ప్రధాన మంత్రిగా, ఎస్బీ చవాన్ హోం మంత్రిగా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయరాజె సింధియా, కళ్యాణ్ సింగ్‌లు బీజేపీ అగ్ర నాయకులు. అశోక్ సింఘాల్ బీజేపీకి మిత్రపక్షమైన విశ్వహిందూ పరిషత్ నాయకులు. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేడు రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. వ్యక్తిగతంగా వీరిని పిటిషన్లో నిందితులుగా పేర్కొనడంతోపాటు కేంద్ర, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా పిటిషనర్ చేర్చారు. ఈ పిటిషన్ మొదటిసారి 1997, మార్చి 26వ తేదీన సుప్రీం కోర్టు జస్టిస్ జీఎన్ రాయ్, జస్టిస్ ఎస్పీ బారుచాలతో కూడిన ద్విసభ్య బెంచీ ముందు విచారణకు వచ్చింది. ఆ ఏడాది కోర్టు వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగిస్తామని బెంచీ ప్రకటించింది. 20 ఏళ్లు గడిచిపోయినా పిటిషన్ అతా, పతా లేదు. పిటిషనర్ అన్సారీ కూడా 2016, జూలై నెలలో మరణించారు. అయోధ్య టైటిల్‌పై ఫిబ్రవరి నెలలో తుది విచారణ జరుగుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని త్రిసభ్య బెంచీ ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషనర్ అన్సారీ తరఫు న్యాయవాది షకీల్ అహ్మద్ సయీద్ ఇటీవల సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆశ్రయించి పిటిషన్ గురించి వాకబు చేశారు. ఆయనకు రిజిస్ట్రీ నుంచి వచ్చిన సమాధానం కూడా దిగ్భ్రాంతికరంగానే ఉంది. తాము పలు విచారణ పిటిషన్లతో దీన్ని కలిపినందున దీనిపై ఎప్పుడో సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పు వెలువరించి ఉంటుందన్న భావనలో ఉన్నామని రిజిస్ట్రీ వర్గాలు తెలిపాయి. పిటిషనర్ తరఫున విచారణ కొనసాగించాలంటే ఆయన చనిపోయిన 90 రోజుల్లోనే మరో పిటిషన్‌ను దాఖలు చేయాలని, లేదంటే తన తదనంతరం కూడా కేసును కొనసాగించాల్సిందిగా పిటిషనర్ తన కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదికి వీలునామా రాసిచ్చినట్లయితే కేసును కొనసాగించవచ్చని రిజిస్ట్రీ వర్గాలు ఆయనకు సూచించాయి. దీంతో షకీల్ అహ్మద్, పిటిషనర్ వీలునామా తనిఖీలో పడ్డారు. చనిపోయిన నిందితులందరిని పిటిషన్ నుంచి తొలగించాలని, మిగతా వారిపై విచారణ కొనసాగించాలని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు చెబుతున్నాయి. ఏడుగురు నిందితుల్లో ప్రస్తుతం అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్‌లు మాత్రమే ఉన్నారు. బతుకున్నవారిలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ లేనందు వల్లనే 20 ఏళ్ల తర్వాతనైనా ఈ పిటిషన్ బయటకు వచ్చిందని ఆరోపిస్తున్న వాళ్లు లేకపోలేదు. కానీ పిటిషన్లో కేంద్రాన్ని, యూపీ ప్రభుత్వాలను కూడా ముద్దాయిలుగా చేర్చారన్న విషయాన్ని మరువరాదు. ఏది ఏమైనా అయోధ్య టైటిల్ కేసులో తీర్పు ఇవ్వడానికి ముందే కోర్టు ధిక్కార పిటిషన్‌పై తీర్పు వెలువడాలని న్యాయవర్గాలు కోరుతున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడితే ఆశించిన ప్రయోజనం ఉండదని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకవేళ అయోధ్య టైటిల్ హిందువులదేనని తీర్పు వస్తే బాబ్రీ మసీదును విధ్వంసం చేయడం సమంజమేనన్న అభిప్రాయం కలుగుతుందన్నది వారి వాదన. ‘న్యాయం ఆలస్యమైతే అసలు న్యాయం జరగనట్లే లెక్క’ అన్న న్యాయసూత్రం ప్రకారమైనా తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువడాల్సి ఉంది. -
‘బాబ్రీ’ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట
లక్నో: 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ(89), మురళీ మనోహర్ జోషీ(83)లతో పాటు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి(58) స్వల్ప ఊరట లభించింది. వీరందరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇక్కడి ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తమను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని వీరు ముగ్గురు ఇంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్కే యాదవ్..వయోభారం దృష్ట్యా అడ్వాణీ, జోషీలు వ్యక్తిగతంగా కోర్టుముందు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపారు. విధుల నిర్వహణ కోసం కేంద్ర మంత్రి ఉమా భారతికి కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
అడ్వాణీపై కుట్ర అభియోగాలు
♦ ‘బాబ్రీ’ విధ్వంసం కేసులో ఎంఎం జోషి, ఉమాభారతిలపై కూడా ♦ అనంతరం వారికి బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు లక్నో: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో మంగళవారం బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీకి ఎదురుదెబ్బతో పాటు, కాస్త ఊరట కూడా లభించింది. అడ్వాణీ తదితరులపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదుకు ఆదేశాలు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. వారికి రూ. 50వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ను సైతం మంజూరు చేసింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి సహా మొత్తం 12 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలను మళ్లీ నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న పలు ఇతర అభియోగాలకు ఇవి అదనం. అలాగే అడ్వాణీ(89), ఎంఎం జోషి(83), ఉమాభారతి(58), బీజేపీ ఎంపీ వినయ్ కటియార్(62), వీహెచ్‌పీ నేత విష్ణు హరి దాల్మియా(89), హిందూత్వవాది సాధ్వి రితంబర(53)లకు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ బెయిలు మంజూరు చేశారు. మంగళవారం అడ్వాణీ, ఉమ సహా నిందితులంతా తమ ముందు హాజరు కావాల్సిందేనని గతంలో కోర్టు ఆదేశించడం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఈ విచారణకు అడ్వాణీ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలంతా హాజరయ్యారు. కోర్టు హాల్లో మూడు గంటల పాటు ఉన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం అడ్వాణీ సహా ఆరుగురు నేతలకు బెయిల్ మంజూరు చేసింది. కుట్ర అభియోగాలను మోపవద్దంటూ నిందితుల తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, కోర్టుకు వెళ్లేముందు అడ్వాణీని యూపీ సీఎం ఆదిత్యనాథ్ వీఐపీ గెస్ట్‌హౌజ్‌లో కలిశారు. మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు గతనెలలో కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అడ్వాణీ సహా బీజేపీ అగ్రనేతలపై కుట్ర కేసులను ట్రయల్ కోర్టు, అలహాబాద్ హైకోర్టులు గతంలో కొట్టివేయగా, వాటిని పునరుద్ధరించాలన్న సీబీఐ వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. అలాగే లక్నోలో సీబీఐ ప్రత్యేక కోర్టులో రోజువారీ విచారణ చేపట్టి రెండేళ్లలో పూర్తి కేసును ముగించాలని ఆదేశించింది. అందులో భాగంగా బీజేపీ నేతలపై కుట్రపూరిత అభియోగాలను నమోదు చేయడంపై లక్నోలోని సీబీఐ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఎవరూ ఆపలేరు: సాక్షి మహరాజ్ బాబ్రీ మసీదు విధ్వంసంలో కుట్ర ఏమీ లేదని, అదిబహిరంగ ఉద్యమంలా జరిగిందని కోర్టుకు హాజరయ్యేముందు ఉమ అన్నారు. ‘ఆ రోజు నేనక్కడే ఉన్నాను. నేనే కాదు లక్షలాది కార్యకర్తలు, రాజకీయ నేతలు అందులో పాలుపంచుకున్నారు’ అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లింలూ అనుకూలంగా ఉన్నారన్నారు. అభియోగాలివీ... నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం, అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి. వీటికి అదనంగా కోర్టు మంగళవారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది పేర్కొన్నారు. -
అడ్వాణీకి షాక్.. 30న కోర్టుకు రావాల్సిందే!
-
అడ్వాణీకి షాక్.. 30న కోర్టుకు రావాల్సిందే!
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీకి చుక్కెదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపునివ్వడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. అడ్వాణీ సహా మరో బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టుకు హాజరు నుంచి ఈ ముగ్గురు నేతలకు మినహాయింపు ఇవ్వలేమని, వారు 30న విచారణకు హాజరుకావాల్సిందేనని ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి ఈ ముగ్గురు నేతలు క్రిమినల్ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై మరిన్ని అభియోగాలను కోర్టు మోపే అవకాశముందని భావిస్తున్నారు. 2001లో సీబీఐ కోర్టు క్రిమినల్ కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. తాజాగా సుప్రీంకోర్టు అడ్వాణీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
హరే రామ సారీ కృష్ణా..!
-
‘అద్వానీపై కుట్రేనేమో’ కతియార్ సంచలనం
న్యూఢిల్లీ: బీజేపీ నేత వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్య చేశారు. బాబ్రీ కేసు విషయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీపై నిజంగానే కుట్ర జరిగి ఉండొచ్చని అన్నారు. ఆయనను రాష్ట్రపతి రేసులో నుంచి తప్పించేందుకు ఇప్పుడు ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రపతి రేసులో లేకుండా చేసేందుకు అద్వానీపై ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేశారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కతియార్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఏమో అతడు(లాలూ ప్రసాద్ యాదవ్) చెప్పినదాంట్లో నిజం ఉండొచ్చేమో. నాకు తెలియదు’ అని అన్నారు. బజరంగ్దళ్ వ్యవస్థాపకుల్లో కతియార్ ఒకరిగా ఉండటమే కాకుండా మంచి సీనియర్ నాయకుడు. ఈయనపై కూడా బాబ్రీ కేసుకు సంబంధించి ఆరోపణలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానీతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
బాబ్రీ విధ్వంసం కేసులో కీలక పరిణామం