Pranahita Project
-
మళ్లీ మహోగ్ర గోదారి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువన మహారాష్ట్రలో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పోటెత్తి ప్రవహిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, కిన్నెరసాని తదితర ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గత రెండు రోజులుగా గోదావరిలో వరద భీకరరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో గోదావరి పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లు ఎత్తేసి 10.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ వరదకు ఉప నదులు, వాగులు వంకల నుంచి వచ్చిన వరద తోడై సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజీలోకి 12.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీ దిగువన సీతమ్మసాగర్‌లోకి 14,93,531 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆ మేరకు కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు 54.60 అడుగులతో ఉన్న గోదావరి తర్వాత స్వల్పంగా తగ్గింది. సాయంత్రం 54.50 అడుగులతో 15,02,258 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మంగళవారం జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కొనసాగుతున్న కృష్ణమ్మ పరవళ్లు గద్వాల రూరల్/దోమలపెంట(అచ్చంపేట)/ నాగార్జున సాగర్: కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు జూరాలకు 2.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా ఉండగా, 44 గేట్లు ఎత్తి 2,14,135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సంకేçశుల నుంచి 52,832 క్యూసెక్కులు వస్తుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు మొత్తం 2,96,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో పది గేట్లను పది మీటర్ల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,75,700 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 63,914 క్యూసెక్కులు మొత్తం 3,39,614 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద ఉధృతి నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆరు గేట్లు ఐదు అడుగులు, 18 గేట్లు పది అడుగులు ఎత్తి దిగువకు 2,98,596 క్యుసెక్కులు వదులుతున్నారు. మంగళవారం వరకు 26 గేట్ల ద్వారా నీరు విడుదలవగా.. బుధవారం రెండు గేట్లు మూసివేసి 24 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. -
నీట మునిగిన పంటలు
వేమనపల్లి: ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహితకు సహజ సిద్ధంగా వచ్చే వరద దిగువన ఉన్న గోదావరిలోకి వెళ్లకుండా మేడిగడ్డ వద్ద రిజర్వాయర్ అడ్డుగా ఉండటంతో వరద ఆదివారం రాత్రికి రాత్రే లోతట్టు పంటలను ముంచెత్తింది. దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. నదీతీరం వెంట ఉన్న వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని వేల ఎకరాల్లో పత్తి పంటలు నీటిపాలయ్యాయి. వేమనపల్లి శివారులో 240 ఎకరాలు, గొర్లపల్లిలో 110 ఎకరాలు, కేతన్‌పల్లిలో 140, కల్మలపేట శివారులో 120, ముల్కలపేట 80, రాచర్ల 110, ఒడ్డుగూడెం 60, సుంపుటం 85, జాజులపేట 70, ముక్కిడిగూడం 92, కళ్లంపల్లి 60 ఎకరాలు మునిగినట్లు అధికారులు తెలిపారు. స్తంభించిన రాకపోకలు ప్రాణహిత వరద పోటెత్తడంతో లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మత్తడివాగు వరకు వరద నీరు పోటెత్తుతుండటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కళ్లెంపల్లి బొందచేను ఒర్రె, చింత ఒర్రె వంతెనలపై నుంచి వరద వెళ్తోంది. దీంతో పలు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ముల్కలపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న ఆర్అండ్బీ రోడ్డు వంతెనలపై నుంచి వరద పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. -
ప్రాణహితనా.. వార్ధానా?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా పక్కన పెట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని ఏ నదిపై నిర్మించాలన్న తర్జన భర్జన మొదలైంది. వెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా, కొత్తగా కేవలం వార్ధా నదిపై వీర్దండ వద్ద నిర్మించాలన్న ప్రతిపాదనపైనా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు ప్రతిపాదనల్లో ఏది పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మేలు చేస్తుందో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఇప్పుడైనా తేలుతుందా.. వెయిన్‌గంగ, వార్ధా నదులు కలిసిన అనంతరం ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని 2004లో నిర్ణయించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బ్యారేజీలో రీడిజైన్ తర్వాత జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తం 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొందించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ.639 కోట్లతో అంచనా వేశారు. వన్యప్రాణి సంరక్షణ కారణంగా ప్రాణహిత నదిపైనే ఒకటిన్నర కిలోమీటర్ ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చడంతో అంచనా వ్యయం రూ.1,918.70 కోట్లకు చేరింది. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్ర లోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాల ముంపు, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. బ్యారేజీ నిర్మాణం గత ఐదేళ్లుగా జరగకపోవడంతో ప్రస్తుత లెక్కల ప్రకారం అంచనా వ్యయం రూ.1,918.70 కోట్ల నుంచి రూ.2,600 కోట్లకు చేరుతోంది. పునరాలోచనలో ప్రభుత్వం... బ్యారేజీ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. వార్ధాపై నిర్మాణంతో కేవలం కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 28 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ.700 కోట్లు దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయని లెక్క గట్టాయి. ఈ ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్షించిన సీఎం గత ప్రతిపాదనలతో పాటు కొత్త ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వార్ధా వద్ద నీటి లభ్యత ఉన్నా అది తక్కువ సమయంలోనే భారీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న బ్యారేజీ సామర్థ్యం 1.5 టీఎంసీలే కావడంతో అంత తక్కువ సమయంలో నిర్ణీత 20 టీఎంసీలు మళ్లించడం సాధ్యమా? అన్న అనుమానాన్ని సమీక్ష సందర్భంగా ఇంజనీర్లు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో నీటి లభ్యత, లభ్యత కాలం, మళ్లింపు అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు పెద్దవాగులో సైతం 16 నుంచి 18 టీఎంసీల మేర లభ్యత ఉన్న దృష్ట్యా, ఆ నీటిని కాళేశ్వరంలో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు ఎలా తరలించాలన్న దానిపైనా పరిశీలన చేయాలని సూచించారు. -
ప్రాణహిత పోయి వార్ధా వచ్చె!
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించతలపెట్టిన తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం మారనుంది. మెయిన్‌గంగ, వార్ధా నదుల సంగమం అనంతరం ఏర్పడే ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించగా ప్రస్తుతం దాన్ని కేవలం వార్ధా నది మీదకు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సర్వే చేసే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించింది. వ్యయ అంచనా తగ్గుతుండటం, ముంపు తగ్గే అవకాశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నా దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న విషయమై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. మొదటి నుంచీ తడబాటే... ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని గతంలో నిర్ణయించగా కొత్తగా చేసిన నిర్ణయం మేరకు జిల్లాలో మరో 1.44 లక్షల ఎకరాలను కలిపి మొత్తంగా 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీ సామర్ధ్యంతో బ్యారేజీ నిర్మించి 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మొదట రూ. 639 కోట్లతో అంచనా వేశారు. అనంతరం వన్యప్రాణి సమస్యల కారణంగా ప్రాణహిత ఎగువకు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చి రూ. 1,918.70 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాణహిత నదిపై 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజీ నిర్మాణానికి 107 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, స్పిల్‌వే నిర్మాణమే 3 కిలోమీటర్లు ఉంటుందని లెక్కగట్టారు. ఈ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509 ఎకరాలు ముంపు ఉండగా ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇక తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది. దీంతో పర్యావరణ అటవీ అనుమతులతోపాటు వన్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరయ్యాయి. అయితే తమ ప్రాంతంలోని ముంపు ప్రాంతాలపై మహారాష్ట్ర అంగీకరించకపోవడంతో ఇన్నాళ్లూ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. అయితే అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. కానీ పరిహారం చెల్లింపు విషయంలో అటవీశాఖ చేస్తున్న జాప్యంతో ముందడుగు పడట్లేదు. దీంతో బ్యారేజీ నిర్మాణం నాలుగేళ్లుగా మొదలుకాలేదు. బ్యారేజీ స్థలం మార్పు యోచన... బ్యారేజీ నిర్మాణంలో జాప్యంపై ఇటీవల సమీక్షించిన ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని లెక్కగట్టింది. దీని ప్రకారం 2007–08లో వేసిన అంచనా రూ. 1,918.70 కోట్లుకాగా ప్రస్తుత అంచనా రూ. 2,600 కోట్లకు చేరింది. వ్యయం భారీగా పెరుగుతుండటంతో పునరాలోచించిన ప్రభుత్వం బ్యారేజీని కేవలం వార్ధా నది వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీంతో కేవలం ఒక కిలోమీటర్ మేరకే బ్యారేజీ నిర్మాణం అవసరమవుతుండగా ఇందుకు 36 గేట్లు సరిపోనున్నాయి. ముంపు ప్రాంతం 400 ఎకరాలకు మించదని, వ్యయం సైతం రూ. 650 కోట్లను దాటదని నీటిపారుదల వర్గాలు అంచనా వేశాయి. వార్ధా నదిలో 60 టీఎంసీల నీటి లభ్యత ఉండగా ఇందులో 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు సరిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహితను కాదని వార్ధాపై నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే తమ్మిడిహెట్టి నిర్మాణమే పదేళ్లుగా మూలనపడగా తాజాగా వార్ధాపై నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారన్నదానిపై అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మార్పు ఆలోచనలపై కాంగ్రెస్ కన్నెర్ర..! తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంత మార్పు యోచనపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ అధికార టీఆర్ఎస్ గతంలో తమపై విమర్శలు చేసిందని, మరి నాలుగేళ్ల పాలనలో అక్కడ బ్యారేజీ నిర్మాణానికి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీస్తోంది. బ్యారేజీ నిర్మాణంపై కొత్త ప్రతిపాదన తేవడం ప్రజలను మభ్యపెట్టడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్యారేజీ ప్రాంతాన్ని మారిస్తే కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలతో కలసి భారీ ఉద్యమ కార్యాచరణకు దిగాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. అవసరమైతే రంగారెడ్డి జిల్లా నేతలను కలుపుకొని రెండు జిల్లాల్లో ఉద్యమాలు చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రాణహిత మహోగ్రం!
సాక్షి, హైదరాబాద్/భూపాలపల్లి/కాళేశ్వరం: ఎగువ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది ఉగ్రరూపం దాలుస్తోంది. పరీవాహకంలోని వాగులు, వంకల నుంచి భారీ నీరు వచ్చి చేరడంతో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇదే సమయంలో గోదావరి పరీవాహకంలోనూ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు నదులు కలిసే కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రానికి ఏకంగా 2.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదయ్యాయి. శనివారం 84 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా ఒక్క రోజులోనే ఏకంగా 1.72 లక్షల మేర పెరిగాయి. ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు ఎస్సారెస్పీలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 3,542 క్యూసెక్కుల మేర ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటి నిల్వ 90.31 టీఎంసీలకు గానూ 11.80 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో ఎస్సారెస్పీకి కొత్తగా 5.64 టీఎంసీల మేర నీరు వచ్చింది. అత్యధికంగా కడెం ప్రాజెక్టులోకి 18,718 క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. ప్రాజెక్టు వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 7 టీఎంసీలకు నీరు చేరుకుంది. దీంతో ఒక గేటును ఐదు అడుగుల మేర ఎత్తి 6,259 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మధ్యాహ్నానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో గేటు దించేశారు. ఎల్లంపల్లిలోకి 3,314 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నిల్వలు 20.18 టీఎంసీలకు 6.30 టీఎంసీలకు చేరుకున్నాయి. ఆల్మట్టికి రోజుకు 5 టీఎంసీలు కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి రోజుకు 5 టీఎంసీల చొప్పున 53,383 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రాజెక్టు మట్టం ఆదివారం సాయంత్రానికి 47.91 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్లో మొత్తంగా ప్రాజెక్టులోకి 24 టీఎంసీల నీరు చేరింది. ఇంకో 60 టీఎంసీల నీరు చేరితే అక్కడి నుంచి దిగువ నారాయణపూర్‌కు, అక్కడి నుంచి జూరాలకు ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తుంగభద్రలోకి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 7,661 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టు నిల్వలు 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 42.34 టీఎంసీలకు చేరింది. నారాయణపూర్‌కు ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోయాయి. జూరాలలో 9.66 టీఎంసీలకు గానూ 5.77, నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 133.37 టీఎంసీలు, శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 29 టీఎంసీల నిల్వలున్నాయి. పెరిగిన గోదావరి ఉధృతి మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగింది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ఆదివారం సాయంత్రం 7.01 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అంతర్రాష్ట వంతెనను తాకుతూ నీరు పరుగుపెడుతొంది. కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లోని గ్రామాల వెంట జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఐలాపురం, ఎలిశెట్టిపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూపాలపల్లి ఏరియాలోని గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఉపరితల గనుల్లో డంపర్లు, డోజర్లు, షావల్స్, బెంజ్ లారీలు వెళ్లే పరిస్థితి లేదు. సుమారు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పూర్తిగా నిలిచిన ‘మేడిగడ్డ’పనులు ప్రాణహిత ఉధృతి పెరిగిన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద జరుగుతున్న బ్యారేజీ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల ఎత్తుతో జరుగుతుండగా ప్రస్తుతం అక్కడ 93.68 మీటర్ల ఎత్తుతో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ పంప్ హౌస్ ప్రాంతంలో ఏకంగా 99.20 మీటర్ల ఎత్తుతో ప్రవాహ ఉధృతి ఉంది. అప్రమత్తంగా ఉండండి కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదల ప్రమాదం పొంచి ఉందని.. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రాజెక్టు ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరిరామ్ ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి, సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు ప్రతి విషయాన్ని చేరవేయాలని సూచించారు. ఆదివారం ఈ మేరకు వారి సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. వరదలకు సంబంధించిన రిపోర్డులను గంట గంటకు తెలియజేయాలని ఈఎన్సీలు చెప్పినట్లు ఇంజనీర్లు పేర్కొన్నారు. – కాళేశ్వరం ఇంజనీర్లకు ఈఎన్సీల సమాచారం -
'ప్రాణహితను పాత డిజైన్లోనే కొనసాగించాలి'
హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను పాత డిజైన్లోనే కొనసాగించాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వంశీచంద్ రెడ్డి పాల్గొనగా... టీడీపీ తరపున ఎల్. రమణ, సీపీఐ పార్టీ నుంచి చాడ వెంకటరెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రంతో పాటు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 'ప్రాజెక్టుల ప్రణాళికా సమయంలో అవినీతి ప్రారంభమౌతుంది. ప్రాజెక్టుల నిర్మాణం పై జేఏసీ ఏర్పాటు అవసరం. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుదాం' : జస్టిస్ చంద్రకుమార్ 'ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజినీర్లతో చర్చించి నాలెడ్జ్ అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరముంది. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తుకు మంచిదికాదు' : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ 'అసెంబ్లీలో టీఆర్ఎస్ వాదన తొండి వాదన. ప్రాణహితకు 1800 ఎకరాల ముంపు ప్రాంతంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. శాసన సభలో ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రతిపక్షం విఫలం. ప్రాజెక్టుల రీడిజైన్‌పై ప్రజల్లోకి వెళ్తాం' : తమ్మినేని వీరభద్రం -
రైతులు మునగకుండా చూడాలి
తెలంగాణలో ప్రజలకు నిరాశే వామపక్ష నేతలు చాడ, తమ్మినేని బెల్లంపల్లి: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తే మహారాష్ట్ర భూమి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాడ, తమ్మినేనిలు మాట్లాడుతూ భూమి ముంపునకు గురికాకుండా ప్రాజెక్టు నిర్మి ంచడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో రైతులు మునగకుండా చూడాలన్నారు. ముంపు భూమి రైతులతో ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. ముంపునకు గురయ్యే భూములను అక్కడి రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఆయా శాఖలను తన వద్దే ఉంచుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం ఆచరణలో ఇంత వరకు ఆయా వర్గాల అభివృద్ధికి చేపట్టిన చర్యలు ఏమీ లేవన్నారు. సెక్రెటేరియట్‌ను మరో చోట నిర్మిస్తామని, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతిని నిర్మిస్తామని ప్రకట నలు చేసి ప్రజావ్యతిరేకతను చవిచూశారన్నా రు. తెలంగాణ ఏర్పడి ఏడాదికాలం గడిచిపోయినా ఇంత వరకు జల విధానాన్ని ప్రకటిం చలేదన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలను ప్రారంభించి ప్రభుత్వం బొందలగడ్డలుగా మారుస్తోందన్నారు. -
‘ప్రాణహిత’ను కాళేశ్వరానికి తరలించొద్దు
- వివిధ సంఘాల నేతల డిమాండ్ - అదే జరిగితే రాష్ట్రానికి తీరని నష్టమని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ‘ప్రాణహిత-చేవెళ్ల’ పథకం బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించొద్దని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క చుక్క నీరు దక్కకపోగా.. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి, తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదికకు చెందిన కేవీ ప్రతాప్, ఉమామహేశ్వర్రావు, సామాజిక స్పందన వేదిక నేత కె.నారాయణ, తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్ధన్, స్వార్ధభారతి చైర్మన్ వై.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. తక్కువ నీటి సామర్థ్యం, ముంపు, పర్యావరణం, అధిక విద్యుత్ అవసరాల దృష్ట్యా కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏడేళ్ల కిందట అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారని.. ఇప్పుడు ఆదిలాబాద్‌లోని గిరిజనులకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ మార్పులకు పూనుకున్నదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్ర అభ్యంతరం చెబుతోందన్నది అసంబద్ధ వాదన అని, కాళేశ్వరం వద్ద కట్టినా అవతలి ఒడ్డు కూడా ఆ రాష్ట్ర పరిధిలోనిదేనని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక మతలబేమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా బ్యారేజీ నిర్మాణాన్ని కాళేశ్వరానికి తరలించాలన్న యోచనను మానుకోవాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని 5 లక్షల ఎకరాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. -
సర్వే తర్వాతే రీడిజైన్
ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరమే ఓ అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర సర్వే జరిగితేనే ప్రతిపాదిత కాళేశ్వరం దిగువన నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలు స్పష్టమవుతాయని అంచనా వేస్తోంది. గోదావరిలో హైడ్రాలజీ లెక్కలను పునఃపరిశీలన చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతోందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు రీ డిజైన్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ ప్రాంతం నుంచి నీటిని మళ్లించే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పరిగణనలోకి తీసుకొని ఎల్లంపల్లి వరకు ఇప్పటికే రూ.4 వేల కోట్లతో కెనాల్ల తవ్వకం పూర్తి చేశారు. ప్రస్తుతం డిజైన్‌ను మార్చి కాళేశ్వరం వరకు నీటిని తరలించాలంటే కొత్తగా కెనాల్ తవ్వాలి. అదే జరిగితే ఇప్పటికే పనులు చేసిన కెనాల్ల ఖర్చు వృథా కానుండగా, కొత్త కెనాల్ల కోసం మరింత వ్యయం చేయాల్సి ఉంటుంది. సమగ్ర సర్వే జరిగితే పాత కాల్వలను యధావిధిగా వాడుకోవచ్చా, లేక కొత్త కాల్వల నిర్మాణం అవసరమైతే దానికి అయ్యే వ్యయం ఎంత అన్నది తేలుతుంది. దీంతో త్వరలోనే వ్యాప్కోస్ ప్రతినిధులతో మరోమారు భేటీ అయి ఓ స్పష్టతకు రావాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
దళిత ఆశాజ్యోతి కాకా!
కాంగ్రెస్ వృద్ధనేత, కార్మిక, దళితవర్గాల ఆశాజ్యోతి అయిన జి.వెం కటస్వామి మృతి అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ఇటు పీడిత వర్గాలకు తీరని లోటు. పెద్దపల్లి నుండి నాలుగుసార్లు, సిద్ధిపేట నుంచి మూడు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ఆయా ప్రాంతాల ప్రజానీకంతో ఎన్నటికీ, ఎప్పటికీ విడదీయలేని అనుబంధాన్ని పెంపొందించుకున్న వెంకటస్వామి దళితులు సైతం రాజకీయరంగంలో ఎదగవచ్చునని నిరూపించిన ధీశాలి. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో 72 వేల మంది నిరుపేదలకు గుడిసెలు వేయించడమే కాకుండా, సింగరేణి కార్మికులకు శాశ్వత పింఛన్‌ను మంజూరు చేయడంతోపాటు, సింగ రేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు రూ.663 కోట్ల మారటోరియం ఇప్పించి వారిని ఆదుకున్నారు. తాను తలపెట్టిన దానికోసం ఎంతటి సాహసా నికైనా వెనుకంజ వేయని కాకా నాటి సీఎం వైఎస్‌తో సైతం వాదులాడి ప్రాణహిత ప్రాజెక్టును తెలంగాణ ప్రజానీకానికి లభించేటట్లు చేసిన పోరాటయోధుడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్కు పొత్తు కుదు ర్చడంలోను, అరవై ఏళ్ల తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడం లోను ఎనలేని పాత్రను పోషించిన ఈ కాంగ్రెస్ కురువృద్ధుడి అలుపెరు గని పోరాట పటిమను, వ్యక్తిత్వాన్ని నేటి తరం నేతలు ఒక స్ఫూర్తిగా, ఒక విలువైన పాఠంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. - బుగ్గన మధుసూదనరెడ్డి బేతంచర్ల