కాంగ్రెస్ వృద్ధనేత, కార్మిక, దళితవర్గాల ఆశాజ్యోతి అయిన జి.వెం కటస్వామి మృతి అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ఇటు పీడిత వర్గాలకు తీరని లోటు. పెద్దపల్లి నుండి నాలుగుసార్లు, సిద్ధిపేట నుంచి మూడు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ఆయా ప్రాంతాల ప్రజానీకంతో ఎన్నటికీ, ఎప్పటికీ విడదీయలేని అనుబంధాన్ని పెంపొందించుకున్న వెంకటస్వామి దళితులు సైతం రాజకీయరంగంలో ఎదగవచ్చునని నిరూపించిన ధీశాలి. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో 72 వేల మంది నిరుపేదలకు గుడిసెలు వేయించడమే కాకుండా, సింగరేణి కార్మికులకు శాశ్వత పింఛన్‌ను మంజూరు చేయడంతోపాటు, సింగ రేణి సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు రూ.663 కోట్ల మారటోరియం ఇప్పించి వారిని ఆదుకున్నారు.
తాను తలపెట్టిన దానికోసం ఎంతటి సాహసా నికైనా వెనుకంజ వేయని కాకా నాటి సీఎం వైఎస్‌తో సైతం వాదులాడి ప్రాణహిత ప్రాజెక్టును తెలంగాణ ప్రజానీకానికి లభించేటట్లు చేసిన పోరాటయోధుడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు పొత్తు కుదు ర్చడంలోను, అరవై ఏళ్ల తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడం లోను ఎనలేని పాత్రను పోషించిన ఈ కాంగ్రెస్ కురువృద్ధుడి అలుపెరు గని పోరాట పటిమను, వ్యక్తిత్వాన్ని నేటి తరం నేతలు ఒక స్ఫూర్తిగా, ఒక విలువైన పాఠంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- బుగ్గన మధుసూదనరెడ్డి బేతంచర్ల
దళిత ఆశాజ్యోతి కాకా!
Published Fri, Jan 2 2015 3:06 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM
Advertisement