రైతులు మునగకుండా చూడాలి
తెలంగాణలో ప్రజలకు నిరాశే
వామపక్ష నేతలు చాడ, తమ్మినేని
బెల్లంపల్లి: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తే మహారాష్ట్ర భూమి ముంపునకు గురవుతుందని ప్రభుత్వం చేస్తున్న వాదనలో వాస్తవం లేదని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తుమ్మిడిహెట్టి వద్దే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో చాడ, తమ్మినేనిలు మాట్లాడుతూ భూమి ముంపునకు గురికాకుండా ప్రాజెక్టు నిర్మి ంచడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో రైతులు మునగకుండా చూడాలన్నారు.
ముంపు భూమి రైతులతో ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. ముంపునకు గురయ్యే భూములను అక్కడి రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఆయా శాఖలను తన వద్దే ఉంచుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం ఆచరణలో ఇంత వరకు ఆయా వర్గాల అభివృద్ధికి చేపట్టిన చర్యలు ఏమీ లేవన్నారు. సెక్రెటేరియట్‌ను మరో చోట నిర్మిస్తామని, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతిని నిర్మిస్తామని ప్రకట నలు చేసి ప్రజావ్యతిరేకతను చవిచూశారన్నా రు. తెలంగాణ ఏర్పడి ఏడాదికాలం గడిచిపోయినా ఇంత వరకు జల విధానాన్ని ప్రకటిం చలేదన్నారు. సింగరేణి ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలను ప్రారంభించి ప్రభుత్వం బొందలగడ్డలుగా మారుస్తోందన్నారు.