
సాక్షి, తాడేపల్లి : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమను నమ్మించి పార్టీలో చేర్చుకుని.. ఆ తర్వాత గౌరవం లేకుండా చేశారని మండిపడ్డారు. టీడీపీలో చాలా అవమానాలు భరించామని తెలిపారు. చంద్రబాబు నైజం అర్థమైందని.. ఆయనది మోసం చేసే వ్యక్తిత్వం అని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌పై అభిమానంతో వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు చెప్పారు.
గాదె మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. 6 నెలల్లోనే హామీలన్ని పూర్తి చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. అందుకే స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరానని వెల్లడించారు. జీవితాంతం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని చెప్పారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన శిద్దా హనుమంతరావు, ప్రకాశ్‌రావు
టీడీపీ నేతలు శిద్దా హనుమంతరావు, సూర్యప్రకాశ్ రావులు సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం శిద్దా హనుమంతరావు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిలో పాలపంచుకుంటామని అన్నారు. ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. ఇకపై తాము సీఎం జగన్ బాటలో నడుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment