
విభజనపై కేంద్రానిది నిరంకుశ ధోరణి : గాదె
హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి బుధవారమిక్కడ అన్నారు. ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో 'రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితులకు..పరిష్కార మార్గాలపై చర్చ' అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజనకు ఒక పద్ధతి పాటించటం లేదన్నారు. విభజనపై కేంద్ర నిర్ణయం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. విభజన బిల్లు.. అసెంబ్లీ తీర్మానానికి రావాలని గాదె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లు రవి, వినోద్, రాజయ్య, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.