'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా' | how can you hold my collar, asks gade venkata reddy | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా'

Published Fri, Jan 10 2014 12:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా'

'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా'

హైదరాబాద్ : టీఆర్ఎస్  సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా అని.. సీనియర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్‌పైకి దూసుకొచ్చిన టీఆర్‌ఎస్‌ సభ్యులను అడ్డుకున్నందుకు.. గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుకున్నారు.

అనంతరం సభలో మాట్లాడిన గాదె.. టీఆర్‌ఎస్‌ దౌర్జన్యాలకు పాల్పడితే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని  చెప్పారు. టీఆర్‌ఎస్‌తో క్షమాపణ చెప్పించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా సభలో ఇలా వ్యవహరించడం తగదని గాదె మండిపడ్డారు.  తమ సభ్యుల తీరుపై చింతిస్తున్నామని.. ఆ తరువాత టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఈటెల రాజేందర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement