ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ | discussion on pranahita - chevella in assembly | Sakshi
Sakshi News home page

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

Published Sun, Mar 15 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

 సాక్షి, హైదరాబాద్: శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్‌ను పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదికపై అందరి సమక్షంలో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులపై అందరితో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతామన్నారు. శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు  నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సమ్మతి,  తదితర వివరాలు తెలపాలంటూ ఎమ్మెల్సీ బి.వెంకటరావు వేసిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement