'ఎమ్మెల్యేలు బెదిరించటం మంచి పద్దతి కాదు' | trs mlas try to intimidate us, says Sailajanath | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేలు బెదిరించటం మంచి పద్దతి కాదు'

Published Fri, Jan 10 2014 1:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

trs mlas try to intimidate us, says Sailajanath

హైదరాబాద్ : తమ వద్దకు వచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెదిరించటం మంచి పద్ధతి కాదని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరుగుతుండగా....రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అనడంతో ఆయన దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దూసుకు వచ్చారు.

దాంతో విద్యాసాగర్ రావును గాదె వెంకటరెడ్డి అడ్డుకోగా ఆయన చొక్కా కూడా చిరిగింది. దాంతో సభలో సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్దే అని గాదె అన్నారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇరు ప్రాంతాల సభ్యులు పోటాపోటీ వ్యాఖ్యలతో రెచ్చగొట్టవద్దని సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement