హైదరాబాద్ : విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రాంతం మంత్రులు కొందరు సానుకూలంగా స్పందించారు. సీఎల్పీలో గురువారం జరిగిన ప్రత్యేక భేటీలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీ అనంతరం జానారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి.... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు.