CLP office
-
మా ఇద్దరిదీ ఒకటే సిలబస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న సమయంలో అక్కడకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వచ్చారు. అనుకోకుండా తారసపడ్డ ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. వీరిద్దరూ చేతులు కలపడంతో మీడియా ప్రతినిధులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలకు ఫోజులి వ్వాలని కోరడంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సీఎల్పీ కార్యాలయం లోపల ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని కొద్దిసేపు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘జగ్గన్నదీ... నాదీ ఒక్కటే సిలబస్. మీడియా వాళ్లకే ఇది అర్థం కావడం లేదు. జెమిని సినిమాలో హీరో, విలన్ పాత్రల్లాంటివే మా పాత్రలు కూడా. మేమిద్దరం ఒకటే.’అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకేపార్టీ నేతలు కలిసినా హల్చల్ అ య్యే పరిస్థితి అని విలేకరులు వ్యాఖ్యానించారు. దీం తో రేవంత్ స్పందిస్తూ ఇది మీడియా చేసిన పనేనన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ..తామింకా విడాకు లు తీసుకోలేదని, విడాకులు తీసుకున్న తర్వాత కలి స్తే తప్పని, ఇప్పుడేం ఉంటుందని సరదాగా అన్నా రు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన గురించి మాట్లాడుకున్నామని చెప్పినా అంతర్గతంగా పలు రాజకీయ అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇద్దరు నేతలూ నోరు విప్పలేదు. -
యాదాద్రిపై కారు బొమ్మా?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి దేవాలయ స్థంభాలపై సీఎం కేసీఆర్ ఫొటో, కారు గుర్తు ఉండటంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేక రాజరికమా అని ప్రశ్నించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చరిత్రను చూపించడం కోసం యాదాద్రిపై కారు బొమ్మను, కేసీఆర్ ఫొటోను చిత్రీకరించారని తెలుస్తోందని, అసలు వీళ్ల చరిత్ర ఏమిటని భట్టి ప్రశ్నించారు. దేవాలయాల్లో ఫొటోలను చెక్కడమే పెద్ద తప్పని విమర్శించారు. దేవాలయం అంటే ఒక పుణ్యక్షేత్రమని, అక్కడికి లక్షలాది మంది వస్తారని పేర్కొన్నారు. అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వెళ్తారని, అటువంటి ప్రదేశాల్లో రాజకీయాలకు తావు లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ ఫోటోలు చెక్కించాలి అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వారివి, భూమి కోసం పోరాటం చేసిన రైతులవి చెక్కించాలని డిమాండ్ చేశారు. అంతేగాక భూమిపై హక్కులు కల్పించిన బూర్గుల రామకృష్ణారావు, భూ సంస్కరణలు తీసుకు వచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, దేశానికి రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటోలను చెక్కించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కేవలం బోర్డులపై రాష్ట్రం పేరు మాత్రమే మారిందని, కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక ప్రజల పరిస్థితులు మెరుగవకపోగా.. మరింత అధ్వానంగా తయారవుతున్నాయని విమర్శించారు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించి, సంబంధిత శాఖలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి శాఖ మంత్రి పర్యటనలు, సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మంత్రులు కేసీఆర్ కుటుంబానికి తాబేదారుల్లా వ్యవహరించవద్దని ఎద్దేవా చేశారు. (చదవండి: యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?) -
కాంగ్రెస్‌లో లాబీయింగ్ బంద్ కావాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో లాబీ యింగ్ వ్యవస్థ బంద్ కావాలని, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు లేదని, కష్టపడుతున్న వారికి ఢిల్లీలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడేవారిని రాహుల్ దగ్గరికి వెళ్లకుండా ఓ కోటరీ అడ్డుకుంటోందని ఆరోపించారు. సీఎల్పీ నేత ఎంపికలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోరాడి ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఆయన పార్టీ మారడాన్ని తాను తప్పుపట్టబోనన్నారు. పార్టీలో మార్పు రాకపోతే ప్రతి బలహీనుడు టీఆర్ఎస్కు ఆకర్షితులవుతారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. -
'ఆ అక్కసుతోనే పోస్టులు ఇవ్వడం లేదేమో'
హైదరాబాద్‌సిటీ: వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డి లో ఉందనే అక్కసుతోనే విద్యార్థులకు పోస్ట్ లు ఇవ్వడం లేదేమోనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కళాశాలను భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీశ్ రావు సిద్ధిపేటకి తీసుకుపోయినా ఫర్వాలేదు. కానీ విద్యార్థులకు న్యాయం జరిగితే చాలన్నారు. ప్రతి సంవత్సరం 280 మంది చొప్పున వ్యవసాయ కళాశాలలో పాస్ అవుతున్నారని, ఇప్పుడు వాళ్లకి ఉద్యోగాలు రావడం లేదన్నారు. హరీష్ రావు , పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసినా ఎలాంటి న్యాయం జరగలేదని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడేమో మంత్రి పోచారం నావల్ల కాదు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నే కలవండని విద్యార్థులకు చెబుతున్నాడని చెప్పారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడు ఇస్తుందన్నారు. రేపు(శనివారం) ముంబా హైవేపై వందల మంది విద్యార్థులతో కలిసి రోడ్డు నిర్బంధం చేస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. -
అధ్యయనం తర్వాతే రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ చేయడానికంటే ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హితవు పలికారు. గోదావరి నదిపై ఎక్కువగా బ్యారేజీలను నిర్మించాలన్నారు. దీనివల్ల ముంపు, ఖర్చు కూడా తక్కువ అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో ముంపు సమస్య కూడా ఉండదని చెప్పారు. రిటైర్డు చీఫ్ ఇంజనీరు హనుమంతరావు, నీటి పారుదలరంగ నిపుణుల సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని సూచించారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలసి సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలకు నికర జలాలు లేవంటున్నా నిర్మించాలని తలపెడుతున్నారని, వీటికి వేల కోట్లు ఖర్చుచేసినా ఫలితాలు రావన్నారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని జానారెడ్డి కోరారు. రైతుల పొలాల్లో కందకాలు తవ్వడం ద్వారా నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలను పెంచుకోవడం వంటివి చేయాలని సూచించారు. దీనిపై పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. రాజకీయాలను కలుషితం చేసేలా తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై స్పందించబోనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవిధంగా రాజకీయాల్లో వ్యవహరించాలన్నారు. రూ. 5 భోజనం బాగుంది జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ. 5కే భోజనపథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఈ పథకంపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జానారెడ్డి 4 ప్లేట్ల భోజనాన్ని తెప్పించారు. ఆయనతోపాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ భోజనాన్ని రుచి చూశారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. -
నేను చంద్రుడిని.. నా నుంచి ఎండరాదు: కె.జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రుడు చల్లని వెన్నెలను, సూర్యుడు ఎండను ఇస్తారు. చల్లని వెన్నెలను ఇచ్చే చంద్రుడి నుంచి ఎండ వేడిమిని ఆశించలేం, అలాగే సూర్యుడి నుంచి కూడా వెన్నెల రాదు. నేను చంద్రుడి లాంటి వాడిని. నా నుంచి చల్లని వెన్నెల మాత్రమే వస్తుంది. నా పనితీరు ఇంతే. నా నుంచి వేడి రాదు’ అని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎల్పీ నేతగా పనితీరు, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు వంటి వాటిపై మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. మల్లెపూవు నుంచి సువాసన గుబాళించినట్టుగా మరోపూవు నుంచి రాదని, మరోపూవు వాసన ఇవ్వడం మల్లెపూవు వల్ల కూడా కాదన్నారు. తన పనితీరు మార్చుకోవాలని చెబుతున్నవారు, తనలా పనిచేయలేరని జానారెడ్డి వివరించారు. ‘మా పార్టీలో వేడి పుట్టించే రంగయ్యలు ఉన్నారు. మీరేది అడిగితే అది చెప్పడం ఆ రంగయ్యలకు సాధ్యం. నా గురించి ఎవరో రంగయ్య ఏదో అన్నాడని నాకు చెప్పడం, దానిపై నేనేదో మాట్లాడితే ఆ రంగయ్యలకు చెప్పడం, దానికి రంగయ్య ఏదో అనడం ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీకు వార్తలు కావొచ్చు, కానీ అవన్నీ నాకు సాధ్యం కాదు. లేని వేడిని పుట్టించాలనుకుంటున్న మా పార్టీలో రంగయ్యను అడగండి’ అని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి జానారెడ్డి వ్యాఖ్యానించారు. -
ఇదేం రుణమాఫీ?: సీఎల్పీ
75 శాతం అప్పును రైతులపై రుద్దే కుట్ర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రుణమాఫీ మొత్తంలో నాలుగోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం వెనుక పెద్దకుట్ర దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆరోపించింది. మిగిలిన 75 శాతం రుణాలను రైతులపై భారం మోపడమే ప్రభుత్వలక్ష్యంగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పి.కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ భారాన్ని తగ్గించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటినుంచీ పిల్లిమొగ్గలు వేస్తోందని, రూ. 19 వేల కోట్ల రుణాలను 17 వేల కోట్ల రూపాయలకు కుదించడమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన మొత్తానికి ప్రభుత్వమే బ్యాంకులకు పూచీకత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కిరణ్ సాధించిందేమీ లేదు: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా, 49 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. -
సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీకి గాదె దూరం
-
సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీకి గాదె దూరం
హైదరాబాద్ : విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న సీమాంధ్ర ప్రాంత మంత్రులు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రాంతం మంత్రులు కొందరు సానుకూలంగా స్పందించారు. సీఎల్పీలో గురువారం జరిగిన ప్రత్యేక భేటీలో తెలంగాణ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డితో సీమాంధ్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నేత గాదె వెంకటరెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నారు. సీమాంధ్ర, తెలంగాణ నేతల భేటీ అనంతరం జానారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి.... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశం అయ్యారు. -
కిరణ్, బొత్సకు నెల ముందే తెలుసు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు నెలరోజుల ముందే రాష్ట్ర విభజన నిర్ణయం తెలుసునని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అయినప్పటికీ సీమాంధ్రలో ఉనికిని చాటుకునేందుకు తనకేమీ తెలియదంటూ సీఎం డ్రామాలాడుతున్నారని విమర్శించారు.సీఎల్పీ కార్యాలయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేనారెడ్డిలతో కలిసి పాల్వాయి మీడియాతో మాట్లాడారు. ‘విభజన గురించి నాకు తెలియదని, విభజన వల్ల అనేక సమస్యలు వస్తాయని సీఎం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు. హైకమాండ్ నిర్ణయం వెలువడటానికి నెలరోజుల ముందు నుంచే విభజన సంగతి సీఎంకు తెలుసు. సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలను విశ్వాసంలోకి తీసుకుని విషయం చెప్పారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశానికి పిలిచి, విభజనపై మాట్లాడారు. ఆ తరువాత కూడా మరోసారి వారితో సమావేశమయ్యారు. మాకేమీ తెలియదని ఇప్పుడు చెబితే ఎట్లా?’’అని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. విభజనకు అనుకూలమని, రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు లేఖ ఇచ్చినప్పుడే తెలంగాణపై పెద్ద ఇబ్బంది తొలగిపోయిందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జరిగే చర్చ సందర్భంగా విభజనవల్ల తలెత్తే సమస్యలపై మాట్లాడేందుకు టీడీపీ సహా అన్ని పార్టీలను భాగస్వాములను చేస్తారని చెప్పారు. రాష్ట్ర విభజనపై సోనియాగాంధీ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా విభజన ఆగదన్నారు. రాజధాని ఉన్న రాష్ట్రమెప్పుడూ విభజన కోరుకోలేదంటూ సీమాంధ్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘షిల్లాంగ్ రాజధానిగా ఉన్న అస్సాం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సొంత రాజధానిని ఏర్పాటు చేసుకుంది. అలాగే మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు కూడా విడిపోయాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడితే భవిష్యత్ ప్రణాళికతో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు’ అని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని, గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల వ్యవహారం కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాము హైకమాండ్‌ను కోరామన్నారు. తెలంగాణపై పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందంటూ సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని యాదవరెడ్డి విమర్శించారు. ‘కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్సే. అధికార పార్టీ ఆదేశానుసారమే కేంద్రం నడుస్తుంది. ఈ విషయం తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్న సీఎంను ప్రజలు క్షమించరు’’అని దుయ్యబట్టారు. హైకమాండ్ ప్రతిష్టను దెబ్బతీస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండాలో లేదో తేల్చుకోవాలని ఆమోస్ అన్నారు.