సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో లాబీ యింగ్ వ్యవస్థ బంద్ కావాలని, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కష్టపడే కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు లేదని, కష్టపడుతున్న వారికి ఢిల్లీలో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కష్టపడేవారిని రాహుల్ దగ్గరికి వెళ్లకుండా ఓ కోటరీ అడ్డుకుంటోందని ఆరోపించారు. సీఎల్పీ నేత ఎంపికలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోరాడి ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఆయన పార్టీ మారడాన్ని తాను తప్పుపట్టబోనన్నారు. పార్టీలో మార్పు రాకపోతే ప్రతి బలహీనుడు టీఆర్‌ఎస్‌కు ఆకర్షితులవుతారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment