'ఆ అక్కసుతోనే పోస్టులు ఇవ్వడం లేదేమో'
Published Fri, Mar 24 2017 6:37 PM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
హైదరాబాద్‌సిటీ: వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల సంగారెడ్డి లో ఉందనే అక్కసుతోనే విద్యార్థులకు పోస్ట్ లు ఇవ్వడం లేదేమోనని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్‌పీ ఆఫీసులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కళాశాలను భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీశ్ రావు సిద్ధిపేటకి తీసుకుపోయినా ఫర్వాలేదు. కానీ విద్యార్థులకు న్యాయం జరిగితే చాలన్నారు.
ప్రతి సంవత్సరం 280 మంది చొప్పున వ్యవసాయ కళాశాలలో పాస్ అవుతున్నారని, ఇప్పుడు వాళ్లకి ఉద్యోగాలు రావడం లేదన్నారు. హరీష్ రావు , పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసినా ఎలాంటి న్యాయం జరగలేదని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడేమో మంత్రి పోచారం నావల్ల కాదు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నే కలవండని విద్యార్థులకు చెబుతున్నాడని చెప్పారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడు ఇస్తుందన్నారు. రేపు(శనివారం) ముంబా హైవేపై వందల మంది విద్యార్థులతో కలిసి రోడ్డు నిర్బంధం చేస్తామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
Advertisement
Advertisement