వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ
Published Sat, Aug 24 2013 3:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా శుక్రవారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యం వహించిన ఈ ర్యాలీని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డప్పుల మోత.. పాటలు, నృత్యాలు.. సమైక్య నినాదాలతో నగరంలోని రోడ్లన్నీ మార్మోగాయి. యువత, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా జై జగన్ నినాదాలు చేస్తూ లాడ్జిసెంటర్ నుంచి నడుచుకుంటూ బస్టాండ్ వద్ద సమరదీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పార్టీ కార్యనిర్వాహకమండలి సభ్యులు రావి వెంకటమరణ, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ చాంద్‌బాషా, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, నగర కన్వీనర్ యరమాల విజయ్‌కిషోర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మర్, పెదకూరపాడు సమన్వయకర్తలు రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ సమన్వయకర్త నన్నపనేని సుధ, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు మందపాటి శేషగిరిరావు, ఈపూరి అనూప్, యూత్ రీజనల్ కోఆర్డినేటర్ వనమా బాలవజ్రబాబు (డైమండ్‌బాబు), ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాంరసూల్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పుటూరి నర్సిరెడ్డి, నూనె ఉమామహేశ్వరరెడ్డి, మెహమూద్, అంగడి శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, జగన్‌కోటి, కోటా పిచ్చిరెడ్డి, దాసరి శ్రీనివాస్, పల్లపు మహేష్, పల్లపు శివ , అనసూయచౌదరి, కంది సంజీవరెడ్డి, ఆలా కిరణ్, విద్యార్థి విభాగం నగర కన్వీనర్ పానుగంటి చైతన్య, ఆలా కిరణ్ , తోట సన్నీ తదితరులు పాల్గొన్నారు. తొలుత లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి సుచరిత పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు.
Advertisement
Advertisement