వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యనాదం
Published Sat, Oct 19 2013 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుండగా గుంటూరులో ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో రిక్షాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి రిక్షా తొక్కి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ షౌకత్, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాంరసూల్, మహ్మద్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. లాడ్జిసెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హిందూ కళాశాల కూడలిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు పార్టీ నేతలంతా రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు.
చిలకలూరిపేటలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో రిలే నిరాహారదీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలోని రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని హైదరపేట గ్రామానికి చెందిన పార్టీ నా యకులు దీక్షల్లో పాల్గొన్నారు. రేపల్లెలో పార్టీ నాయకులు మోపిదేవి హరనాధ్‌బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
నరసరావుపేటలో..
నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ ఎస్.ఎ.హనీఫ్, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు కె.శంకరయాదవ్, పిల్లి ఓబుల్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీసెల్ కన్వీనర్లు వేముల శివ, కందుల ఎజ్రా, కుంజనందా, పట్టణ ఉపాధ్యక్షులు మండా లక్ష్మణరావు, జి.అచ్యుతరావు, సానికొమ్ము కోటిరెడ్డి, పట్టణ కార్యదర్శులు బిల్డర్ మద్దిరెడ్డి నరసింహారెడ్డి, మల్లెల లింగయ్య, మారూరి రమ ణారెడ్డి, చల్లా నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు ఎస్.సుజాతాపాల్, రొంపిచర్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గెలి ్లసుబ్బారెడ్డి, లింగంగుంట్ల ఉపసర్పంచ్ పొన్నపాటి విజయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement