సాక్షి, కాకినాడ : రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు వారిని విడదీయబోతున్న కాంగ్రెస్ కుటిలత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ మడమ తిప్పని పోరాటం సాగిస్తూనే ఉంది. జాతి ఐక్యతే లక్ష్యంగా దీక్షబూని ముందుకు సాగుతూనే ఉంది. రాష్ర్ట విభజన బిల్లును అసెంబ్లీకి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు జిల్లావ్యాప్తంగా మంగళవారం సమైక్యదీక్షలు చేపట్టారు. ఈ నెల 11 వరకు జరిగే దీక్షలకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టగా, పార్టీ కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలు శిబిరాలను ప్రారంభించారు.
రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు, కడియంలలో రిలే నిరాహార దీక్షలను పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర సాధనకు అలుపెరగని పోరు సాగిస్తున్నారని చెప్పారు. అనపర్తి దేవీచౌక్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సమైక్య రిలే నిరాహార దీక్షలను నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రారంభించారు. తొలుత వందలాది మంది పార్టీ శ్రేణులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ యూత్ సభ్యులు తాడి సూరారెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్షాశిబిరం వద్ద సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్, రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం నేతలు సమైక్యాంధ్ర ముసుగులో ఉన్న సమైక్యాంధ్ర ద్రోహులని ధ్వజమెత్తారు. పి.గన్నవరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాలరావు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు ప్రారంభించారు. తుని తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు.
పెద్దాపురంలో పట్టణ కన్వీనర్ పేర్నీడి ఈశ్వరరావు, సామర్లకోటలో పట్టణ కన్వీనర్ గుణ్ణం రాజబ్బాయిల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రత్తిపాడులో దీక్షలను పార్టీ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు, అలమండ చలమయ్య ప్రారంభించారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో దీక్షా శిబిరాన్ని తణుకువాడ పీఏసీఎస్ అధ్యక్షుడు నల్లమిల్లి ఈశ్వరరెడ్డి ప్రారంభించారు. పిఠాపురం రామా టాకీస్ సెంటర్‌లో మాజీ కౌన్సిలర్ బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో రిలేదీక్షలు చేపట్టారు.
క్వారీ సెంటర్‌లో మానవహారం
రాజమండ్రి నగర నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్‌లో వందలాది మంది పార్టీ శ్రేణులతో మానవహారం నిర్వహించి సమైక్యనినాదాలతో హోరెత్తించారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్ని, బీసీ సెల్ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు మార్గాని రామకృష్ణగౌడ్, ఎస్సీ సెల్ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు మాసా రామజోగి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం శివారు రఘుదేవపురంలో, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్యనాదం పాదయాత్రలు నిర్వహించారు. జగ్గిరెడ్డితో పాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధర్ పాల్గొన్నారు.
ఒక్కటే లక్ష్యం.. ‘ఒక్కటి’గా ఉండాలని
Published Wed, Jan 8 2014 6:20 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM
Advertisement
Advertisement