సమైక్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ ఉద్యమం | The goal of a united movement YSR Congress | Sakshi
Sakshi News home page

సమైక్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ సీపీ ఉద్యమం

Published Sat, Oct 19 2013 3:40 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

The goal of a united movement YSR Congress

శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమం బాట వీడినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పోరుబాట వీడలేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ శ్రేణులు శుక్రవారం కూడా దీక్షలు కొనసాగించారు. అలాగే కొన్ని మండలాల్లో విద్యార్థులు రాష్ట్ర విభజన వద్దంటూ ర్యాలీలు చేశారు.
 
   ఆమదాలవలసలో సమైక్య రాష్ట్ర పరిరక్షణకు తొలినుంచీ పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమైక్య ఉద్యమానికి మరింత ఊపునిస్తూ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. పార్టీ నాయకులు బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహ నరావు, తమ్మినేని సీతారాంల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 17వ రోజుకు చేరాయి. కె.లక్ష్మణరావు,  డి.శ్యామలరావు,ఎస్.శ్రీనివాసరావు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
 
   ఎల్‌ఎన్‌పేట మండలంలో పార్టీ నాయకులు దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్యకర్తలకు ఆ పార్టీ నాయకుడు కలమట వెంకటరమణ సంఘీభావం తెలిపారు. 
 
   రాజాంలో దీక్షలు కొనసాగాయి. శుక్రవారం నాటి దీక్షలో నాగేశ్వరరావు, శంకర్రావు, సాయిరాం, పైడిరాజు, మోహనరావు, ప్రకాష్ తదితరులు కూర్చున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు సంఘీభావం తెలిపారు. 
 
   పాలకొండలో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకి చేరుకున్నాయి. వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన 20 మంది కార్యకర్తలు కూర్చున్నారు. వీరిలో బొత్స ప్రకాశ్‌రావు, బొమ్మాళి శామ్యూల్, బొత్స సుందరరావు తదితరులు ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement