సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ సీపీ | YSRCP is active in united movement | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమంలో వైఎస్సార్ సీపీ

Published Sat, Oct 12 2013 3:50 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

YSRCP is active in united movement

గుంటూరు, న్యూస్‌లైన్ :  సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం కూడా ఆందోళనలను కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు సమైక్యాంధ్ర కోసం నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పార్టీ అధినేత వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. గుంటూరు నగరంలో పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వాహనాలు తుడిచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 
 
తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ నసీర్, షౌకత్‌లతోపాటు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. అప్పిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని గౌడయూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేకపూజలు చేశారు.  రిలే నిరాహార దీక్షలో సుగాలికాలనీ యువకులు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు పదోరోజుకు చేరుకున్నాయి. రజక సంఘం ఆధ్వర్యంలో నాయకులు దీక్ష లో కూర్చున్నారు. వీరికి రాష్ట్ర మైనారిటీసెల్ ఉపాధ్యక్షుడు షేక్ జిలానీ, సేవాదళ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు మెట్టు వెంకటప్పారెడ్డి, కాకుమాను మండల పార్టీ కన్వీనర్ నల్లమోతు శివరామకృష్ణ తదితరులు సంఘీభావం తెలిపారు. 
 
జగన్‌మోహన్‌రెడ్డి కోలుకోవాలంటూ బాపట్లలో యూత్‌నాయకుడు కూనపురెడ్డి అవినాష్‌నాయుడు ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరి గాయి. రిలే నిరాహార దీక్షలు 10వరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగ సంఘాల వల్లే సమైక్యాంధ్ర ఉద్యమం బలపడిందని నరసరావుపేటలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి తెలి పారు. తెనాలిలో రిలేనిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకున్నాయి. దీక్షను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గుదిబండి చినవెంకటరెడ్డి, జిల్లా రైతువిభాగం కన్వీనర్ మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. జగన్ ఆరోగ్యం బాగుండాలంటూ మసీదులో ప్రార్థనలు, అమృతలూరులో ముస్లిలు ప్రార్థనలు చేశారు.వినుకొండలో సమన్వయకర్త డాక్టర్ నన్నపనేని సుధ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement