రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి
Published Fri, Jan 3 2014 3:36 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
పొన్నూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధ్రుతం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పొన్నూరు పట్టణం ఐలాండ్ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్య శంఖారావం బహిరంగ సభ నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ సీఈసీ సభ్యులు రావి వెంకటరమణ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ సీమాంధ్రలో కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్య పెడుతున్నారని సమైక్య ఉద్యమాన్ని నీరు గారుస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియను ఆపాలని అన్ని రాజకీయపార్టీ నాయకుల మద్దతు కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని ముఖ్యనేతలను కలిశారని గుర్తు చేశారు. జగనన్న ఆశయ సాధనలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తనపై ఎలాంటి కేసులు లేకుండా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్చుకోలేని చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్నారు. గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర విడిపోతే తెలంగాణాలోనైన కొన్ని సీట్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పాటుపడుతున్న జననేత జగన్‌మోహన్‌రెడ్డికి సీమాంధ్ర ప్రాంత ప్రజలు రాజకీయాలకు అతీతంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాజన్న మృతితో రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మరో సమన్వయకర్త షౌకత్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సాగు,తాగు నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. జననేతకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ విభాగం కన్వీనర్ దేవళ్ల రేవతి, గులాం రసూల్, మండల కన్వీనర్లు పఠాన్‌బాబుఖాన్, డక్కుమళ్ల రవి, యర్రంశెట్టి రామకృష్ణ, నాయకులు బొనిగల రాజారావు, గేరా సుబ్బయ్య, మొల్లా కరీమ్,షేక్ షఫాయితుల్ల, వాహిదుల్లా, గడ్డం వెంకట్రావు, పల్లెపాటి కోటేశ్వరారవు, అల్లాభక్షు, గైరుబోయిన వేణుగోపాల్, నెలటూరి రఘుబాబు, కర్లపూడి రమేష్, దొప్పలపూడి రాజా, మండ్రు అనిత పాల్గొన్నారు.
Advertisement
Advertisement