![Amit Shah Moves Statutory Resolution On Presidents Rule In Jammu And Kashmir - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/28/amit_shah_.jpg.webp?itok=Df-aCWMH)
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది చివర్లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితిని కేంద్రం పర్యవేక్షిస్తోందని అన్నారు.
జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పారు. కాగా జమ్ము కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ అంతకుముందు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment