
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ కొనుగోలు చేసే విషయంలో ఆర్సెలర్ మిట్టల్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) పచ్చజెండా ఊపింది. 2017 నుంచి ఎస్సార్ స్టీల్ కొనుగోలు కోసం ఆర్సెలర్ మిట్టల్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. పెద్ద ఎత్తున రుణాలను తీర్చలేక దివాలా పరిష్కార ప్రక్రియకు కిందకు వెళ్లిన ఎస్సార్ స్టీల్‌ను రూ.42,000 కోట్లకు కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ ఆర్సెలర్ మిట్టల్ బిడ్ సమర్పించింది. దీనికి రుణదాతల కమిటీ సైతం ఆమోదం తెలిపింది.
కొనుగోలు తర్వాత రూ.8,000 కోట్ల నిధులను ఈక్విటీ రూపంలో ఇచ్చేందుకు కూడా ఆర్సెలర్ మిట్టల్ అంగీకరించింది. అయితే, ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లయిన రుయాలు మధ్యలో జోక్యం చేసుకుని ఆర్సెలర్ మిట్టల్ బిడ్ కంటే తాము ఎక్కువే చెల్లిస్తామంటూ ముందుకు రావడం, ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడంతో అడ్డంకి ఏర్పడింది. అయితే, ఎట్టకేలకు ఆర్సెలర్ మిట్టల్ బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment