బెంగళూరు: నీట్ యూజీ- 2024 పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశంలో దుమారం రేపాయి. అయితే తాజాగా నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో రెండు తీర్మానాలను సోమవారం కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. మరో రెండు తీర్మానాలు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నీట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రాలే సొంతంగా తమ పరీక్షలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు.. కేబినెట్‌లో ఆమోదం పొందిన ఈ తీర్మానాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపట్టనున్నారు. వీటీతోపాటు, గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment