సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న తాజా చర్యపై కర్ణాట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 1956లో తీసుకువచ్చిన రాష్ట్ర పునర్‌వ్యవస్థికరణ చట్టాన్నిఆమోదించి దశాబ్దాలు గడిచాయన్నారు.
రెండు రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని బొమ్మై అన్నారు. అలాంటి తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మేము మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెగేసి చెప్పారు. అలాగే కర్ణాటకలో ఒక్క అంగుళం కుడా మహారాష్ట్రకు వెళ్లదని కరాఖండీగా చెప్పారు. అయినా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడూ అలాంటి తీర్మానాన్ని ఎలా ఆమోదించారని గట్టిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్ణాటక కూడా మహారాష్ట్ర వివాదంపై ఇటీవలే తీర్మానం చేసింది.
ఈ నేపథ్యంలో బొమ్మై తమ తీర్మానానికి చాలా భిన్నంగా ఉందంటూ మహారాష్ట్రపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కన్నడ ప్రజలు, కన్నడం మాట్లాడే కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడతాం అని నొక్కి చెప్పారు. ఆ తీర్మానంలో మా కర్ణాటకలోని భూమిని లాక్కుంటామని చెబుతున్నారని, కానీ తాము సుప్రీ కోర్టుని విశ్వసిస్తున్నాం కాబట్టి తమ భూమీని కచ్చితంగా కోల్పోమని బొమ్మై ధీమాగా చెప్పారు.
(చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం)
Comments
Please login to add a commentAdd a comment