condemned
-
తాడిపత్రి ఘటనలకు పోలీసులు బాధ్యత వహించాలి- YSRCP నేతలు
-
ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్ బొమ్మై
సరిహద్దు విషయమై మహారాష్ట్ర తీసుకున్న తాజా చర్యపై కర్ణాట ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సీరియస్ అయ్యారు. మహారాష్ట్ర నాయకులు ఆమోదించిన తీర్మానానికి ఎలాంటి అర్థం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని రెచ్చగొట్టి, విభజిస్తామని బెదిరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. 1956లో తీసుకువచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థికరణ చట్టాన్నిఆమోదించి దశాబ్దాలు గడిచాయన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని బొమ్మై అన్నారు. అలాంటి తీర్మానాన్ని ఆమోదించి మహారాష్ట్ర రాజకీయ జిమ్మిక్కులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. మేము మా నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెగేసి చెప్పారు. అలాగే కర్ణాటకలో ఒక్క అంగుళం కుడా మహారాష్ట్రకు వెళ్లదని కరాఖండీగా చెప్పారు. అయినా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడూ అలాంటి తీర్మానాన్ని ఎలా ఆమోదించారని గట్టిగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా కర్ణాటక కూడా మహారాష్ట్ర వివాదంపై ఇటీవలే తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో బొమ్మై తమ తీర్మానానికి చాలా భిన్నంగా ఉందంటూ మహారాష్ట్రపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కన్నడ ప్రజలు, కన్నడం మాట్లాడే కమ్యూనిటీల ప్రయోజనాలను కాపాడతాం అని నొక్కి చెప్పారు. ఆ తీర్మానంలో మా కర్ణాటకలోని భూమిని లాక్కుంటామని చెబుతున్నారని, కానీ తాము సుప్రీ కోర్టుని విశ్వసిస్తున్నాం కాబట్టి తమ భూమీని కచ్చితంగా కోల్పోమని బొమ్మై ధీమాగా చెప్పారు. (చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం) -
రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులకు అనేక రకాలుగా మేలు చేస్తుంటే ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విషప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ మండిపడ్డారు. రైతులకు అవసరమైన అన్నిరకాల సేవలను సత్వరమే అందించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన రైతుభరోసా కేంద్రాలతో లక్షలాది మంది రైతులు లబ్ధిపొందుతున్నారని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఈనాడు’లో ‘రైతుకు భరోసా ఏది’.. శీర్షికతో ప్రచురించిన వార్తను తీవ్రంగా తప్పుబట్టారు. చదవండి: Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా పలు దేశాలు రాష్ట్రంలోని ఆర్బీకేలను మోడల్‌గా తీసుకుని అమలుచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించడానికి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటుచేసి వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి నాణ్యమైన ఉత్పాదకాలు అందించడంతో పాటు రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని వాటి ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ♦ఆర్బీకేల ద్వారా 42.22 లక్షల మంది రైతులకు రూ.157.97 కోట్ల విలువైన 23.74 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను, 18.28 లక్షల మంది రైతులకు రూ.744.25 కోట్ల విలువైన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశాం. ♦1.5 లక్షల మంది రైతులకు రూ.14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను కూడా అందించాం. ♦ఎరువుల లోడింగ్, అన్లోడింగ్, రవాణా ఖర్చుల కోసం ఒక్కో బస్తాకు రూ.20 ఆదా అవుతోంది. ఆ లెక్కన గడిచిన రెండేళ్లలో పంపిణీ చేసిన 6.69 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా ద్వారా రైతులకు రూ.27 కోట్లు ఆదా అయింది. ♦ఆర్బీకేల్లో 6,321 మంది వ్యవసాయ, 2,356 ఉద్యాన, 378 మంది పట్టు, 4 వేల మందికి పైగా పశు సంవర్థక, 756 మంది మత్స్య సహాయకులు పనిచేస్తుండగా, మిగిలిన పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా చర్యలు చేపట్టాం. ♦9,277 మంది బ్యాంకు సహాయకులను ఆర్బీకేలకు అనుసంధానం చేసి గ్రామస్థాయిలోనే ఎక్కడికక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ♦ఆర్బీకేల ద్వారా 1.59 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను 18.18 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. ♦4.75 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీచేసి రూ.3,595 కోట్ల రుణాలను పంపిణీ చేశాం. ♦34,550 మంది రైతులతో కమ్యూనిటీ హైరింగ్ గ్రూపులను ఏర్పాటుచేసి రూ.240.67 కోట్ల సబ్సిడీతో యంత్ర పరికరాలు అందించాం. ..ఇలాంటివెన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నా ‘ఈనాడు’ పత్రిక వాటిని పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచురించడం తగదని హరికిరణ్ హితవు పలికారు. -
ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ఆర్ సీపీలోనే ఉంటాను : బాలినేని
-
బీబీసీ బ్యాన్: చైనాపై యూకే, యూఎస్ ఫైర్
బీజింగ్: మీడియా మార్గదర్శకాలను తీవ్రంగా ఉల్లంఘించిన ఆరోపణలపై ప్రముఖ మీడియా సంస్థ బీబీసీపై చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో బీబీసీ వరల్డ్ న్యూస్ ప్రసారాలను నిషేధం విధిస్తున్నట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చైనా టీవీ అండ్ రేడియో రెగ్యులేటరీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్ వర్క్(సీజీటీఎన్) ప్రసారాలను బ్రిటీష్ మీడియా రెగ్యులేటరీ సంస్థ ఆఫ్కామ్ ఇటీవలే నిలిపివేసిన అనంతరం తాజా పరిణామం చోటుచేసుకుంది. సీజీటీఎన్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు పొందిందని రెగ్యులేటరీ ఆరోపించిన సంగతి తెలిసిందే. బీబీసీ తమ విదేశీ మీడియా నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, చైనాపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని చైనా ఆరోపించింది. తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలపై 'తప్పుడు రిపోర్టింగ్' చేస్తోందని మండిపడింది. వీగర్ ముస్లింలు, కరోనావైరస్ విషయంలో బీబీసీ కథనాలను చైనా ప్రభుత్వం తప్పుబట్టింది. వార్తలు నిజాయితీగా, నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలి తప్ప, చైనా జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే చైనా స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ రేడియో అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఆర్టిఎ) బీబీసీని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు చైనా నిర్ణయంపై బీబీసీ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ బీబీసీ అనీ, ఎలాంటి పక్షపాతం లేకుండా తమ మీడియా వార్తలను ప్రసారం చేస్తుందని బీబీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. అటు యూకే విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకించారు. "మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొన్నారు. చైనాలో బీబీసీ నిషేధాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. చైనాలో మీడియా అణిచివేతకు గురవుతోందని అమెరికా హోంశాఖ వ్యాఖ్యానించింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి బయట ఫ్రీ మీడియాను వాడుకుంటున్న చైనా తమ దేశంలో ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. BBC statement in response to Chinese ban of BBC World News pic.twitter.com/RpLwvW4OzO — BBC News Press Team (@BBCNewsPR) February 11, 2021 -
అర్నాబ్ అరెస్టు; స్పందించిన కేంద్రమంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పందించారు. ఇది ‘‘పత్రికా స్వేచ్ఛపై దాడి" గా అభివర్ణించారు. ఈ ఘటన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ మహారాష్ట్ర పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన మీడియా పట్ల ఈ వైఖరి సరైంది కాదంటూ ట్వీట్ చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) కాగా డిజైనర్ ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణలతో నమోదైన కేసును సాక్ష్యాలు లేవంటూ పోలీసులు దర్యాప్తును నిలిపివేశారు. అయితే రెండేళ్లనాటి కేసును తిరిగి ప్రారంభించాలన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి నేపథ్యంలో అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజ్, సాయుధులైన పోలీసులతో అర్నాబ్‌ను నిర్బంధించారని రిపబ్లిక్ టీవీ ఆరోపించింది. ఎడిటర్స్ గిల్డ్ ఖండన మరోవైపు అర్నాబ్ అరెస్ట్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఆకస్మిక అరెస్టును ఖండించింది. అర్నాబ్ గోస్వామి అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యామంటూ విచారం వ్యక్తం చేసింది. గోస్వామిని న్యాయపరంగా విచారణ జరగాలని, మీడియా విమర్శనాత్మక రిపోర్టింగ్‌పై అధికార దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సూచించింది. We condemn the attack on press freedom in #Maharashtra. This is not the way to treat the Press. This reminds us of the emergency days when the press was treated like this.@PIB_India @DDNewslive @republic — Prakash Javadekar (@PrakashJavdekar) November 4, 2020 -
'ధోనికి మీరిచ్చే విలువ ఇదేనా'
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్లో బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే గెలిచే మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా ధోని, కేదార్ జాదవ్ ఆటతీరుపై ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం క్రికెటర్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేసుకొని అసభ్యకరవ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఎంఎస్ ధోని కూతురు జీవాపై నీచమైన వ్యాఖ్యలు చేయడం పట్ల జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ కూడా అయింది. తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా.. మ్యాచ్ ఓడిపోతే దానికి ఆటగాళ్ల కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించి దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిచిన ధోని లాంటి ఆటగాడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (చదవండి : ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’) 'ఇది మనమందరం పరిష్కరించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది కేవలం క్రీడకు సంబంధించిందో లేక వ్యక్తిగత విషయమో కాదు.. దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్న విషయం. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు.. అవతలి వ్యక్తికి అది చదివినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాడు. ఆటగాడిని విమర్శించడం వరకు ఓకే కానీ.. కుటుంబసభ్యులను ముడిపెడుతూ వ్యక్తిగత దూషణలు దిగడం తగదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుంది.. పిల్లలు ఉంటారు. నాకు కొడుకు, కూతురు ఉన్నారు.. నా వృత్తి రిత్యా కొంతమంది మహిళలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆటలో ఎంఎస్ ధోని ప్రదర్శన గురించి ఎన్ని కామెంట్స్ రాసినా పట్టించుకోరు.. ఎందుకంటే అది ఆట.. అందులోనూ ప్రతీ ఆటగాడికి గడ్డుకాలం నడుస్తుంది. దీన్ని సాకుగా తీసుకొని కుటుంబసభ్యుల వరకు వెళ్తే ఎవరు ఊరుకోరు. మేము మనుషులమే.. మాకు మనుసులుంటాయి. ఎదుటివారి గురించి హాస్యాస్పదంగా చెప్పినంత వరకు మంచిగానే ఉంటుంది.. కానీ హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో మీ వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంటర్టైన్మెంట్ జోనర్ వరకు ఉపయోగించండి తప్పులేదు.. ఉదా : ఆటగాళ్లు సరిగా ఆడడం లేదని ట్రోల్ చేయడం.. వారి ఆటతీరుపై ఫన్నీ మీమ్స్ పెట్టడం లాంటివి ఓకే. (చదవండి : జీవా ధోనికి భద్రత పెంపు) కానీ ఇదే సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మరీ పిచ్చిరాతలు రాసున్నారు. అభిమానం పేరుతో హద్దుమీరి ప్రవర్తిస్తూ అసభ్యపరుషజాలం ఉపయోగిస్తున్నారు. కరోనా కాలంలో ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి.ఈరోజు ధోని, సచిన్ లాంటి వ్యక్తుల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం సిగ్గుగా ఉంది. టీమిండియాలో క్రికెట్ బతికున్నంత కాలం వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎప్పటికి వాళ్లు దిగ్గజాలుగాను కనబడుతారు. అలాంటి వ్యక్తులు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు. కానీ ఇదంతా ఒక నాన్సెన్స్.. ఒక భారతీయుడిగా ఇలాంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ' విరుచుకుపడ్డాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా టీమిండియా తరపున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. -
విద్యార్థులే లక్ష్యంగా దాడులా...?
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ఆదివారం రాత్రి ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ట్విట్టర్లో స్పందిస్తూ దాడిని ముక్తకంఠంతో ఖండించారు. ‘వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు... కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాల్సిందే’. –గౌతమ్ గంభీర్ ‘జేఎన్‌యూలో ఆదివారం జరిగిన ఘటన దారుణమైనది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడిచేయడం మన దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది’. –ఇర్ఫాన్ పఠాన్ ‘యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింది. ఇది సిగ్గుచేటు. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలి’. – రోహన్ బోపన్న ‘ఇంత జరిగాక కూడా మౌనమేంటి? విద్యార్థుల్ని ఎలా చావబాధారో చూశాం. దుండగుల్ని ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు. పట్టుకొని శిక్షించాల్సిందే’. –గుత్తా జ్వాల -
జవదేకర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి గంటా
-
ప్రమాదంలో మీడియా స్వేచ్ఛ
పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూవచ్చాయి. ఇవాళ, ప్రెస్పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్టణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రపంచ స్వేచ్ఛా సూచిక (రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్, 2017)లో భారత్ స్థాయి 3 స్థానాలు పతనమై 136కి దిగ జారింది. దక్షిణాసియాలోనే అత్యంత స్వేచ్ఛాయుత మైన దిగా భారత్ మీడియాను పరిగ ణిస్తుంటాం. కానీ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలను చూస్తే మన మీడియా పాక్షికంగానే స్వేచ్ఛను కలిగి ఉన్నట్లు భావించాలి. గత ఏడాది దేశంలో 11 మంది జర్నలిస్టులు హత్యకు గురికాగా, 46 దాడులు జరిగాయి. పోలీసు స్టేషన్లలో విలేకరులపై 27 కేసులు నమోద య్యాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో వార్తలను నివేదించిన సందర్భాల్లో జర్నలిస్టులకు ఎదురైన చిక్కులు మాత్రమే. 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య ఘటన, పత్రికా స్వేచ్ఛ గురించి డబ్బా వాయిం చేవారిని తమ పగటి కలలనుంచి బయటపడేసింది. ఇలాంటి ఘటనలు దేశంలో సాధారణమైపోయాయి. గౌరీ లంకేష్ హత్య జరిగిన 2 రోజుల తర్వాత బిహార్ లోని అర్వాల్ జిల్లాలో రాష్ట్రీయ సహారా విలేకరి పంకజ్ మిశ్రాను బైక్‌మీద వచ్చిన ఇద్దరు హంతకులు కాల్చి చంపారు. గత దశాబ్ద కాలంలో జర్నలిస్టులను హత్య చేసినవారు ఏ శిక్షా లేకుండా తప్పించుకున్న వారి శాతం నూటికి నూరు శాతం పెరిగింది. 2016 గ్లోబల్ ఇంప్యు నిటీ ఇండెక్స్ (జర్నలిస్టుల సంరక్షణ కమిటీ) ప్రకారం భారత్ 13వ స్థానంలో ఉండటం హేయం. పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదం, బెదిరింపులు అనేవి జర్నలిజం ప్రారంభ కాలం నుంచే మొదలవుతూ వచ్చాయి. 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలోనే బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కన్నింగ్ గ్యాగింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ముద్రణా సంస్థల ఏర్పాటు, అవి ఏం ముద్రిస్తున్నాయి, సంబంధిత లైసెన్సులు వంటి వాటిని ప్రభుత్వమే ఈ చట్టం ప్రాతిపదికన క్రమబద్ధీక రిస్తూ వచ్చింది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా దేన్ని ప్రచురించినా ప్రభుత్వ ఉల్లంఘనగా పరిగణించారు. 1876–77 ధాతుకరువు గురించి స్థానిక పత్రికలు వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన ప్పుడు ప్రెస్ యాక్ట్ 1878ని తీసుకొచ్చి అమర్ బజార్ పత్రికతో సహా 35 స్థానిక పత్రికలపై చర్యలు తీసుకున్నారు. వలసప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకుగాను బాల గంగాధరతిలక్నే రెండుసార్లు జైల్లో పెట్టారు. ఇవాళ, ప్రెస్పై అలాంటి దాడులు చిన్న చిన్న పట్ట ణాల్లో కూడా సర్వసాధారణమై పోయాయి. ప్రాంతీయ పత్రికలు లేదా చానల్స్‌లో ఫ్రీలాన్స్ ప్రాతిపదికన పని చేస్తున్న విలేకరులే చాలావరకు బాధితులుగా మిగులు తున్నారు. స్టూడియోలో లేక పత్రికాఫీసులలో పనిచేసే వారి కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులే దాడుల పాలవుతున్నారు. ఒడిశాలో జీడిమామిడి ప్రాసెసింగ్ ప్లాంటులో బాలకార్మికులపై వార్త రాసి పంపిన తరుణ్ ఆచార్యను 2014లో కత్తుల్తో పొడిచారు. పంజాబ్ ఎన్ని కల నేపథ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా జర్నలిస్టు దేవిందర్ పాల్‌పై మద్యం బాటిల్స్‌తో దాడి చేశారు. ఇక అదే సంవత్సరం మార్చి 14న ఒక పాత్రి కేయురాలిపై సామూహిక అత్యాచారం జరిపారు. చట్టపరమైన రక్షణ పరిమితం కావడంతో పత్రికా స్వేచ్ఛ గణనీయస్థాయిలో ఆంక్షలకు గురవుతోంది. ఆన్ లైన్ దాడులు, లీగల్ నోటీసులు, సెక్షన్ 124 (ఎ) కింద జైలుకు పంపే ప్రమాదం వంటివాటితో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతోంది. తమపై వ్యాఖ్యలు చేస్తున్న విలేకరులపై రాజకీయనేతలు, సెలబ్రిటీలు పరువు నష్టం కేసులు పెట్టడం సహజమైపోయింది. 1991–96 మధ్యలో జయలలిత ప్రభుత్వం ఒక్క తమి ళనాడులోనే 120 పరువు నష్టం కేసులు పెట్టింది. ఒక అనుకరణ ప్రదర్శనలో జయలలిత దుస్తులు ధరించి వచ్చినందుకు టెలివిజన్ యాంకర్ సైరస్ బరూచాపై కేసు పెట్టారు. చిన్న, మధ్యతరహా మీడియా సంస్థలు జర్నలిస్టులపై కేసులను పట్టించుకోక పోవడంతో కాసింత రక్షణ కూడా కోల్పోతున్నారు. క్రిమినల్ స్వభావం ఉన్న పరువునష్టం కేసులను రద్దు చేయడంపై జర్నలిస్టులు పోరాడాలి. అప్పుడే స్థానిక, ప్రాంతీయ పత్రికల విలేకరులు పరువునష్టం కేసుల భయం లేకుండా విధులు నిర్వర్తించే వీలుంది. సైద్ధాంతికంగా పత్రికా స్వేచ్ఛ అనేది అవధులు లేని పరిపూర్ణ భావన. కానీ ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థ పత్రికాస్వేచ్ఛపై గణనీయంగా ఆంక్షలు విధిస్తోంది. అధి కారిక రహస్యాల చట్టం దేశ రక్షణకు చెందిన వ్యవహా రాలపై వార్తలు రాయడాన్ని కూడా నిషేధిస్తోంది. పార్ల మెంట్ కనీసంగానైనా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసు కొచ్చి దేశద్రోహ చట్టాన్ని వారిపై ప్రయోగించ కూడా కట్టడి చేయడం అత్యవసరం. ఇతర దేశాల్లో పాత్రికేయు లకు రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో మార్పులు చేస్తు న్నారు. జర్నలిస్టులు మొదట పంపిన వార్తా కథనాల్లో ఏవైనా అతిశయోక్తులు ఉంటే వాటిని తొలగించుకోవడా నికి, మార్పులు చేయడానికి కూడా కొన్ని దేశాల్లో అవ కాశమిస్తూ వారిని చట్టం కోరల నుంచి బయటవేసేలా చట్టాలు చేస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నందున, కీల కాంశాలపై నాణ్యమైన, పరిణామాత్మకమైన కథనాలకు అవకాశాలు రానురాను హరించుకుపోతున్నాయి. బార్ కౌన్సిల్ లాగే భారత పత్రికా మండలి కూడా జర్నలిస్టుల స్థాయిని పెంచేందుకు, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. జర్నలిస్టుల్లో అనైతిక, వృత్తి వ్యతిరేక ప్రవర్తనను అదుపు చేసే చర్యలు చేప ట్టాలి. అదేసమయంలో అన్ని రకాల మీడియాలకు మరింత రక్షణ కల్పించకపోతే, ప్రజాస్వామ్యం బల హీనపడే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం భవిష్యత్తు కోసం జర్నలిస్టుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడకూడ దన్నదే కీలకం. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు వరుణ్ గాంధీ fvg001@gmail.com -
ఆ హత్యను తీవ్రంగా ఖండించిన భారత్
న్యూఢిల్లీ: టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. కర్లోవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని.. ఇలాంటి హింసాయుత, ఉగ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎమ్ఈఏ ప్రకటనలో పేర్కొంది. టర్కీలోని అంకారాలో ఓ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్పై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు సోమవారం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఆండ్రీ అక్కడిక్కడే మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తి ‘అలెప్పో’, ‘రివేంజ్(ప్రతీకారం)’ అని అరిచిన దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. ఈ ఘటనపై రష్యా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. -
రాష్ట్రంలో నిరంకుశపాలన
డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి నర్సాపూర్: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆమె ఫోన్లో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. పోలీసులు లాఠీ చార్జీలో గాయపడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం తమ పార్టీ రాష్ట్ర నాయకులు వెళ్లగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిరంకుశంగా వ్యవహరించారన్నారు. తాను ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్తుండగా తనను హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో అరెస్టుచేసి మచ్చబొల్లారం పోలీస్స్టేన్కు తరలించారన్నారు. గాయపడిన రైతు కుటుంబాలను అధికార పార్టీ నాయకులు పరామర్శించడం లేదని, తాము పరామర్శిస్తామంటే అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తమను ఎన్నిసార్లు అరెస్టు చేసినా మల్లన్నసాగర్ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అల్వాల్ వద్ద తనతో పాటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం వదిలిపెట్టారన్నారు. -
థూ.. అని ఉమ్మేశారు!
-
థూ.. అని ఉమ్మేశారు!
చెన్నై: అధికారం ఇచ్చినా సరే, లేకుంటే పీఎం పదవైనా ఓకే అంటూ వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా మీడియాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. డీఎండీకే పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయకాంత్‌ను మీడియా పలకరించింది. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాతే అయ్యగారు తన ప్రతాపం చూపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా అని విజయకాంత్‌ను ఓ విలేకరి ప్రశ్నించగా ...అందుకు ఆయన సావధానంగానే జవాబిచ్చారు. అంతేకాకుండా అన్నాడీఎంకే మళ్లీ అధికారాన్ని చేపట్టడం సాధ్యం కాదని ఆయన తేల్చిపారేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ విజయకాంత్ అకస్మాత్తుగా విలేకరులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు భయం.. మీరు జర్నలిస్టులా అంటూ థూ.. అని వారిపై ఉమ్మి వేశారు. ఈ ఘటనను పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయకాంత్ వైఖరిని జర్నలిస్టు సంఘాలు తప్పుబట్టాయి. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలి
-
వీహెచ్ పై దాడిని ఖండించిన శైలజానాథ్
తిరమలలో దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న రాజ్యసభ సభ్యుడు వీ.హన్మంతరావు కారుపై సమైక్యవాదుల దాడిని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శనివారం హైదరాబాద్‌లో ఖండించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే నాయకులని ఆయన స్ఫష్టం చేశారు. సీమాంధ్రలో పార్టీలకతీతంగా ఉద్యమం జరుగుతుందన్నారు. అయితే ఆ ఉద్యమాన్ని బలోపేతం చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో నూతన పార్టీ ఏర్పాటు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు న్యూఢిల్లీల్లోని అధిష్టానానికి విధేయులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారి ఇలా ఉంటారని శైలజానాథ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.