- డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
నర్సాపూర్: రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆమె ఫోన్లో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. పోలీసులు లాఠీ చార్జీలో గాయపడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం తమ పార్టీ రాష్ట్ర నాయకులు వెళ్లగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి నిరంకుశంగా వ్యవహరించారన్నారు.
తాను ఏటిగడ్డ కిష్టాపూర్ వెళ్తుండగా తనను హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో అరెస్టుచేసి మచ్చబొల్లారం పోలీస్‌స్టేన్కు తరలించారన్నారు. గాయపడిన రైతు కుటుంబాలను అధికార పార్టీ నాయకులు పరామర్శించడం లేదని, తాము పరామర్శిస్తామంటే అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం తమను ఎన్నిసార్లు అరెస్టు చేసినా మల్లన్నసాగర్ రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. అల్వాల్ వద్ద తనతో పాటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం వదిలిపెట్టారన్నారు.