న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్‌బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment