subsidiaries
-
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో మూడు సంస్థల విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో (టీసీపీఎల్) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్ సోల్‌ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్ తెలిపింది. టీసీపీఎల్‌కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్ లాంటివి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్ తదితర కీలక బెవరేజ్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. -
విదేశాల్లో దుకాణం బంద్! ఆస్తులు అమ్మేస్తున్న జొమాటో..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో విదేశాల్లో తమ ఉనికిని క్రమంగా తగ్గించుకుంటోంది. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆస్తులు అమ్మేస్తోంది. జొమాటో వియత్నాం కంపెనీ లిమిటెడ్, పోలాండ్‌కు చెందిన గ్యాస్ట్రోనౌసీ వంటి అనుబంధ సంస్థలను లిక్విడేట్ చేస్తున్నట్లు జొమాటో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వియత్నాం, పోలాండ్లోని తన స్టెప్-డౌన్ అనుబంధ సంస్థల కోసం ఖర్చు తగ్గించే చర్యగా రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు జొమాటో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక కమ్యూనికేషన్లో తెలియజేసింది. గురుగ్రామ్ ఆధారిత ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 2023 మార్చి నుంచి పది అనుబంధ సంస్థలను రద్దు చేసింది. 2023 సంవత్సరంలో జొమాటో చిలీ ఎస్పీఏ, పీటీ జొమాటో మీడియా ఇండోనేషియా (PTZMI), జొమాటో న్యూజిలాండ్ మీడియా ప్రైవేటు లిమిటెడ్, జొమాటో ఆస్ట్రేలియా, జొమాటో మీడియా పోర్చుగల్ యూనిపెస్సోల్ ఎల్డీఏ, జొమాటో ఐర్లాండ్ లిమిటెడ్ – జోర్డాన్, చెక్ రిపబ్లిక్ లంచ్‌టైమ్, జొమాటో స్లొవేకియా వంటి వివిధ సంస్థలకు జొమాటో వీడ్కోలు పలికింది. అలాగే కెనడా, యూఎస్, ఫిలిప్పీన్స్, యూకే, ఖతార్, లెబనాన్, సింగపూర్లలోనూ జొమాటో తన అకార్యకలాపాలను నిలిపివేసింది. ఇలా అనేక దేశాల నుంచి వైదొలిగినప్పటికీ ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈలలో మాత్రం యాక్టివ్గానే ఉంది. 16 ప్రత్యక్ష అనుబంధ సంస్థలు, 12 స్టెప్-డౌన్ అనుబంధ సంస్థలు, జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లింకిట్ కామర్స్, జొమాటో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ఒక అనుబంధ కంపెనీలను జొమాటో తన 2023 వార్షిక నివేదికలో పేర్కొంది. -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
విదేశీ బ్యాంక్ శాఖలకు కొంత స్వేచ్ఛ
ముంబై: భారత బ్యాంకులకు సంబంధించి విదేశీ శాఖలు, సబ్సిడరీలు.. ఇక్కడ అనుమతించని ఆర్థిక సాధనాల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. భారత మార్కెట్లో ప్రత్యేకంగా అనుమతించని సాధనాల్లో లావాదేవీలకు, గిఫ్ట్ సిటీ వంటి భారత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో వీటిని అనుమతించడానికి సంబంధించి ప్రత్యేకా కార్యాచరణ అవసరమని భావించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ అనుమతించని, ఇక్కడ అందుబాటులో లేని ఆర్థిక సాధనాల్లో భారత బ్యాంకుల విదేశీ శాఖలు, సబ్సిడరీలు లావాదేవీలు చేపట్టొచ్చని తన తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. అలాగే, గిఫ్ట్ సిటీ (గుజరాత్)లో బ్యాంకు శాఖలకు సైతం ఇదే వర్తిస్తుందని తెలిపింది. -
ప్రైవేటీకరణకు ఎయిరిండియా అనుబంధ సంస్థలు!
నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను కేంద్రం రూ.18వేల కోట్లకు టాటా గ్రూప్‌కు అమ్మిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్‌కు విక్రయించడానికి ముందే ఎయిరిండియాకు ఎయిరిండియా ఎయిపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిరియిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమబంధ సంస్థలున్నాయి. వాటిని ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడులు, ప్రబుత్వ ఆస్తుల నిర్వహణ చూసే దీపం..ఎయిరండియా అనుంబంధ సంస్థల్ని కొనుగులో చేసే పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతుంది. -
AP: ఇథనాల్ ఉత్పత్తి రెట్టింపు
సాక్షి, అమరావతి: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టింది. కాలుష్య నియంత్రణ, తక్కువ వ్యయంతో ఇంధన వనరులను సముపార్జన లక్ష్యాలుగా ఈ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్దేశం. ఇందుకోసం తొలిసారిగా ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తికి సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా మాత్రమే ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇకపై మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఈ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, ఇథనాల్ ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మరోవైపు.. ఔషధ రంగానికే పరిమితమైన ఇథనాల్‌ను ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా విరివిగా ఉపయోగించాలని నిర్ణయించింది. చెరకు ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం దేశంలో అవసరానికంటే ఎక్కువగా చక్కెర ఉత్పత్తి అవుతుండడంతో ఆశించిన గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో చక్కెర దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. అంతేకాక.. ఫ్యాక్టరీల వారీగా క్రషింగ్‌కు కోటా పెట్టి ఎగుమతులకు ఇన్సెంటివ్‌లు ఇస్తోంది. చక్కెర కంటే చెరకు నుంచి వచ్చే ఉప ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక చెరకు నుంచి వచ్చే మొలాసిస్ ద్వారా ఇ నాల్, ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్), ఆర్ఎస్ (రెక్టిఫైడ్ స్పిరిట్) వంటి ఉత్పత్తులు వస్తాయి. వీటిలో ఇథనాల్‌ను గ్రీన్ ఎనర్జీగా పరిగణిస్తారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పెట్రోల్‌లో 10శాతం ఇథనాల్‌ను కలుపుతున్నారు. 2030 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. ఇథనాల్‌ను ఉత్పత్తిచేసే డిస్టిలరీల సామర్థ్యం పెంచుకునేందుకు.. అలాగే, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి నిమిత్తం కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇందుకోసం ఆర్థికంగా చేయూతనివ్వడమే కాక.. వాటికి వడ్డీ చెల్లింపుపై కనీసం 2–3 ఏళ్ల పాటు మారటోరియం కూడా విధిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి ఎలాగంటే.. ►చెరకును క్రషింగ్ ద్వారా వచ్చిన మొలాసిస్‌ను చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఉండే డిస్టిలరీకి తరలిస్తారు. ►అక్కడ ఒక లీటర్ మొలాసిస్‌కు మూడు లీటర్ల నీరు కలిపి ఫర్మెంటేçషన్ చేస్తారు. అనంతరం డిస్టిలేషన్ యూనిట్‌కు పంపిస్తారు. ►అక్కడ ఆవిరిని కండెన్స్ చేయగా వచ్చే పదార్థమే ఇథనాల్. దీనిని స్టోరేజ్ ట్యాంక్‌కు తరలిస్తారు. ఒక టన్ను చెరకు నుంచి 47 కేజీల మొలాసిస్ వస్తుంది. టన్ను మొలాసిస్ నుంచి 12.5 లీటర్ల ఇథనాల్ వస్తుంది. ►ఇక మొలాసిస్ నుంచి మూడు రకాలుగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా టన్నుకు సీ మొలాసిస్ నుంచి 260 లీటర్లు, బి.మొలాసిస్ నుంచి 320 లీటర్లు, షుగర్ సిరప్ నుంచి 285 లీటర్లు ఇథనాల్‌ను తీస్తారు. ►షుగర్ సిరప్ నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.62.65లు, బి మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌కు లీటర్‌కు రూ.57.61లు, సీ మొలాసిస్ నుంచి వచ్చే ఇథనాల్‌ను లీటర్‌కు రూ.45.69లుగా కేంద్రం ధర నిర్ణయించింది. ►వీటిని పెట్రోల్ ఉత్పత్తి చేసే ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ►ఇలా రాష్టంలో 13.75 లక్షల కిలో లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సామర్థ్యం పెంచేందుకు యత్నిస్తున్నాం కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహంతో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీలో రోజుకు 48వేల లీటర్ల చొప్పున ఏటా 1.58 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీనిని మరింతగా పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం రూ.95 కోట్లు ఖర్చుచేయబోతున్నాం. – ఎ. నాగశేషారెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్, సంకిలి, శ్రీకాకుళం జిల్లా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం రాష్ట్రంలో ఈఐడీతో పాటు సర్వారాయ, ఆంధ్రా, కేసీపీ, ఎస్ఎన్జీ షుగర్స్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. చెరకు నుంచే కాకుండా మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి కోసం డిస్టిలరీల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి యత్నిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. – వడకాని వెంకట్రావు, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ -
Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి,అమరావతి: ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయడంపై రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సకాలంలో అందించేవారు కాదని, కానీ సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించి నిధులు ఇస్తున్నట్లుగానే పరిశ్రమలకు ఇవ్వడం.. పరిశ్రమలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తోందని పేర్కొంటున్నారు. కోవిడ్ కష్టకాలంలో నిధుల ఇబ్బంది ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయడం ద్వారా ఆయా సంస్థలు మూతపడకుండా నిలదొక్కుకోవడమే కాకుండా 12 లక్షల మంది జీవితాలకు భరోసా కల్పించినట్లయిందని చెబుతున్నారు. గతంలో వలే మూడునాలుగేళ్లు బకాయిలు పెట్టకుండా సకాలంలో రాయితీలు అందిస్తుండటంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తాయని, తద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై వివిధ పారిశ్రామిక ప్రతినిధులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే.. నమ్మకం పెంచింది ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడం.. పరిశ్రమలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచింది. కష్టకాలంలో ఎంఎస్ఎంఈలకు రూ.440 కోట్లు విడుదల చేయడం ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇదే సమయంలో స్పిన్నింగ్ మిల్లులకు రూ.684 కోట్లు విడుదల చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడింది. వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా రాష్ట్రంలో వివిధ ఉత్పత్తులకు, సేవలకు, ఆర్థికవ్యవస్థ వృద్ధికి దోహదం చేస్తోంది. సీఎం జగన్‌కు సీఐఐ ఏపీ చాప్టర్ అభినందనలు తెలియజేస్తోంది. – దాట్ల తిరుపతిరాజు, చైర్మన్, సీఐఐ ఏపీ చాప్టర్ చేయూతనందించింది కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చేయూతనందించింది. ప్రోత్సాకాల రూపంలో పరిశ్రమలకు రూ.1,124 కోట్లు ఇవ్వడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలతో పాటు పెద్ద పెట్టుబడిదారుని వరకు రాష్ట్రంపై నమ్మకాన్ని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2020–23 పారిశ్రామిక పాలసీల్లో ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక రాయితీలను ప్రకటించారు. కేంద్రం కూడా ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చే విధంగా మేం చర్యలు తీసుకుంటున్నాం. – సీవీ అచ్యుతరావు, ప్రెసిడెంట్, ఫ్యాప్సీ సకాలంలో ప్రోత్సాహకాలు గతంలో పరిశ్రమలు ప్రోత్సాహకాల కోసం కనీసం మూడు నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలను చెల్లించడమే కాకుండా వరుసగా రెండో ఏడాది కూడా సకాలంలో ప్రోత్సాహకాలను ఇచ్చింది. సంక్షేమ పథకాలకు క్యాలండర్ ప్రకటించినట్లుగానే ప్రోత్సాహకాలకు ముందుగానే తేదీని ప్రకటించడం పరిశ్రమల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచింది. ‘వైఎస్సార్ నవోదయం’ ద్వారా కష్టాల్లో ఉన్న అనేక పరిశ్రమలు నిలబడ్డాయి. – ఏపీకే రెడ్డి, ప్రెసిడెంట్, ఎఫ్‌ఎస్‌ఎంఈ పరిశ్రమలు నిలదొక్కుకున్నాయి గతేడాది లాక్డౌన్లో ఎంఎస్ఎంఈలు సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులున్న సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ పేరుతో ప్రభుత్వం ఆదుకుంది. దేశవ్యాప్తంగా సగటున 30% చిన్న పరిశ్రమలు మూతపడినప్పటికీ ఇక్కడ కష్టకాలాన్ని తట్టుకుని నిలబడటానికి ఇది ఉపయోగపడింది. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలను విడుదల చేయడం నమ్మకాన్ని పెంచింది. ఇలా వెంటవెంటనే ప్రోత్సాహకాలు ఇవ్వడంతో క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న ధైర్యం వచ్చింది. ఈ నిధులు ముడిసరుకు కొనుగోలుకు, జీతాలకు ఉపయోగపడతాయి. – వి.మురళీకృష్ణ, ప్రెసిడెంట్, ఫ్యాప్సియా పారిశ్రామిక హబ్‌గా ఏపీ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం పారిశ్రామికహబ్‌గా తయారుకానుంది. గత ప్రభుత్వం పార్టనర్షిప్ సమ్మిట్ల పేరుతో ప్రచారం చేసిందే కానీ పరిశ్రమలకు సకాలంలో రాయితీలను చెల్లించకపోవడంతో ఈ రంగం పూర్తిగా దివాలా తీసింది. అలాగే పొరుగు రాష్ట్రంలో కూడా 2018 నుంచి ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదు. సుమారు రూ.2,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పాత బకాయిలను కూడా చెల్లించడంతో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. – మామిడి సుదర్శన్, జాతీయ అధ్యక్షుడు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ టెక్స్టైల్ హబ్‌గా ఏపీ కష్టాల్లో ఉన్న ఈ రంగానికి ఈ ప్రోత్సాహకాలు పెద్ద చేయూతనందిస్తాయి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 75 వేలమందిని ప్రత్యక్షంగా సీఎం ఆదుకున్నట్లయింది. అంతేకాదు ఈ రంగానికి కీలకమైన ముడిసరుకు పత్తిని పండించే రైతులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో కొత్త పెట్టుబడులు వచ్చి కొత్తవారికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో స్పిన్నింగ్ నుంచి గార్మెంట్ వరకు రాష్ట్రం టెక్స్టైల్ హబ్‌గా ఎదుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. – దండ ప్రసాద్, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ -
ఆర్‌కామ్ దివాలా ప్రణాళికకు ఆమోదం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్‌కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్‌కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది. -
బ్యాంకుల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) కీలక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్ బీఐలో విలీనం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు ఫుల్ జోష్ లో నడిచాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ లు 20శాతం లాభాలను నమోదుచేశాయి. కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే ఈ ర్యాలీ కొనసాగినట్టు మీడియా రిపోర్టులు నివేదించాయి. ఈ ఆమోదంతో నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్ లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకు ఆస్తులు, అప్పులను ఎస్ బీఐ తనలో విలీనం చేసుకోనుంది. మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ విలీనంతో ఎస్ బీఐ నెట్ వర్క్ లు 41శాతం పెరగనున్నాయి. 23 వేల ఎస్ బీఐ బ్రాంచ్ లు అందుబాటులో ఉండనున్నాయి. వర్క్ ఫోర్స్ కూడా 33శాతం పెరిగి 2,85,500 ఉద్యోగులకు చేరుకోనుంది. మార్కెట్లో షేర్ల జోరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.9 శాతం ఎగబాకి 215.65గా నమోదైంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్ 19.99 శాతం పెరిగి రూ. 478.90వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 19.99 శాతం వృద్ధితో రూ.599.60కు చేరింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ 20 శాతం పెరుగుదలతో రూ.547.90గా నమోదైంది.