సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్‌బిఐ తన పిటిషన్‌లో పేర్కొంది. (అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల)
కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఎస్‌బీఐ వాదించింది. సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని తెలిపింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్‌నీష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్‌పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్‌బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది.
Comments
Please login to add a commentAdd a comment