proceedings
-
ఇల్లు కట్టుకోవాలా..? ఇదిగో ఈజీగా పర్మిషన్!
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతి వర్గాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకున్నా.. నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలన్నా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నుంచి అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. భవన నిర్మాణాలకే కాకుండా నిర్మాణం పూర్తయిన ఇళ్లు, అపార్ట్మెంట్లలో నివాసానికి సైతం హెచ్ఎండీఏ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.అన్ని రకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉంటే దరఖాస్తుదారులు ప్రత్యేకంగా హెచ్ఎండీఏ అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకొని నిర్ణీత వ్యవధిలో ప్రొసీడింగ్స్ పొందవచ్చు. కొత్తగా అపార్ట్మెంట్ కానీ, బిల్డింగ్లు కానీ నిర్మించేందుకు చాలామంది సకాలంలో సరైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం వల్లనే ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ల్లో.. పెట్ పార్క్అన్ని విధాలుగా నిర్మాణ యోగ్యత ఉన్నట్లు తేలితే వారం, పది రోజుల్లోనే ప్రొసీడింగ్స్ లభిస్తాయని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘కొద్ది రోజులుగా హెచ్ఎండీఏ ఫైళ్లకు కదలిక వచ్చింది. లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు ఇచ్చే అనుమతుల్లో వేగం పెరిగింది. సమస్యలు ఉన్న స్థలాల్లో మాత్రమే ప్రతిష్టంభన నెలకొంటోందని’ అన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే అన్ని డాక్యుమెంట్లను సరి చూసుకోవాలని చెప్పారు.మీ స్థలం జాడ తెలుసుకోండి.. » హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3,350కి పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి సమీపంలో ఉండే నిర్మాణ స్థలాలు బఫర్ జోన్లలో ఉన్నా, ఎఫ్టీఎస్ పరిధిలో ఉన్నా అనుమతులు లభించవు. ఇందుకోసం హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల మ్యాపులను పరిశీలించి నిర్ధారణ చేసుకొనే అవకాశం ఉంది.» టీజీబీపాస్లో దరఖాస్తు చేసుకొనే సమయంలోనే రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం కొత్తగా హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తనిఖీలు చేసి ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాతే హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగం దరఖాస్తులను స్వీకరించే విధంగా మార్పు చేశారు.» ఇప్పుడు ఈ అనుమతుల ప్రక్రియ రెండు అంచెలుగా మారింది. మొదట నీటి పారుదల, రెవెన్యూ అధికారులు పరిశీలించి నివేదికలు ఇచ్చిన అనంతరం ప్లానింగ్ అధికారి పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడ ఏమైనా సందేహాలు ఉంటే సదరు ఫైల్‌ను వెనక్కి పంపించే అవకాశం ఉంది. అన్నీ క్లీయర్‌గా ఉంటే ప్లానింగ్ డైరెక్టర్ పరిశీలిస్తారు. అనంతరం హెచ్ఎండీఏ కమిషనర్ ఆమోదంతో నిర్మాణానికి అనుమతి పత్రాలు (ప్రొసీడింగ్స్) లభిస్తాయి.డాక్యుమెంట్లు ఇవీ..» సాధారణంగా నిర్మాణ సంస్థలు సొంతంగా కానీ లేదా కన్సల్టెంట్ సంస్థల ద్వారా కానీ టీజీబీపాస్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నాయి. సొంత ఇళ్లు నిర్మించుకొనే మధ్యతరగతి వర్గాలు సైతం ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటారు. అన్ని అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్లు స్వయంగా తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసినప్పటికీ అవసరమైన డాక్యుమెంట్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.» భూమి డాక్యుమెంట్లు, లింక్‌డాక్యుమెంట్లు, పాస్‌బుక్, టైటిల్ డీడ్, ఎమ్మార్వో ప్రొసీడింగ్స్, భూమికి సంబంధించిన పహణీలు, కాస్రాపహణీ, రెవెన్యూ స్కెచ్, 13 ఏళ్ల ఈసీ పత్రాలను అప్లోడ్ చేయాలి.» మార్కెట్ వాల్యూ, నాలా చార్జీలు, ఎన్ఓసీలు, సైట్ ఫొటోలు, జియో కోఆర్టినేట్స్, సైట్ సర్వే బౌండరీలు తదితర పత్రాలన్నీ ఉంటే సకాలంలో అనుమతులు పొందవచ్చు.» భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. ఇందుకోసం భూమి స్వభావాన్ని ధ్రువీకరించే సర్టిఫికెట్, నీటి నాణ్యత ధ్రువీకరణ, డిజైన్లు, ఫైర్, పర్యావరణ తదితర సంస్థల అనుమతులు, బిల్డింగ్ రిస్క్ ఇన్సూరెన్స్ వంటివి ఉండాలి. -
జైప్రకాశ్ అసోసియేట్స్‌పై దివాలా చర్యలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జేపీ గ్రూప్‌లో కీలకమైన జేఏఎల్ ప్రధానంగా నిర్మాణం, హాస్పిటాలిటీ తదితర వ్యాపారాలు సాగిస్తోంది. కంపెనీ 2037 కల్లా మొత్తం రూ. 29,805 కోట్ల రుణాలను (వడ్డీతో కలిపి) కట్టాల్సి ఉండగా ఇందులో రూ. 4,616 కోట్లు 2024 ఏప్రిల్ 30 నాటికి చెల్లించాల్సి ఉంది. దీన్ని చెల్లించడంలో సంస్థ విఫలమైంది. ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వల్ల లిక్విడిటీ కొరత ఏర్పడటమే డిఫాల్ట్ కావడానికి కారణమంటూ జేఏఎల్ వినిపించిన వాదనలను తోసిపుచ్చిన ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలిచ్చింది. -
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్‌లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్‌లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 330 ఎకరాల భూమిని చూపినా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించాలని, రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరారు. శనివారం శాసనమండలిలో ‘గిరిజన సంక్షేమం–పోడు భూములకు పట్టాల పంపిణీ’పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిచ్చారు. పోడు భూముల వివాదాల్లో తలెత్తిన కేసులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎత్తివేసేందుకు అటవీశాఖ, డీజీపీలతో కూడిన కమిటీ కసరత్తు ప్రారంభించిందని చెప్పారు. 2023–24 లో 15 వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం ‘గిరివికాసం’కింద రూ.150 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా నిర్మించే నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని, 500 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ వసతి కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ల హయాంలోనే పోడుభూములకు పట్టాలు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. -
‘ప్రత్యక్ష ప్రసారాలతో కోర్టు ఇళ్లలోకి.. జనం మనసుల్లోకి వెళ్లింది’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల నివాసాల్లో, వారి మనసుల్లో స్థానం సంపాదించుకుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కోరుతూ దాఖలైన కేసులపై వాదనలను వరసగా ఎనిమిదో రోజు ఆలకించిన సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘కోర్టు ప్రత్యక్ష ప్రసారాలపై జనంలో చర్చ నడుస్తోంది. లైవ్ స్ట్రీమింగ్ అనేది సరైన దిశలో ముందడుగు. అయితే ఇంగ్లిష్‌లో సాగే వాదనలను గ్రామాల్లోని చాలా మంది జనం అర్థంచేసుకోలేకపోతున్నారు’ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది కోర్టులో వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ ‘ నిజమే. లైవ్ స్ట్రీమింగ్‌తో సుప్రీంకోర్టు సాధారణ ప్రజల ఇళ్లలోకి, మనసుల్లోకి చేరింది. ఇదొక నిరంతర ప్రక్రియ. జనం మాట్లాడే భాషల్లో వాదనలు అందుబాటులో ఉండేలా సాంకేతికతను వాడేందుకు మావైపు నుంచీ ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. 2018లో కోర్టు కార్యకలాపాల ప్రత్యక్షప్రసారానికి సూత్రప్రాయంగా అనుమతించిన సుప్రీంకోర్టు.. 2022 నుంచి ప్రసారం మొదలుపెట్టింది. 2023 ఫిబ్రవరి నుంచి ప్రత్యక్ష ప్రసారాలకు కృత్రిమ మేధ సాయంతో ఇతర భాషల్లో ట్రాన్స్‌స్క్రిప్ట్ (రాసిన లేదా ముద్రించిన కాపీలు) అయ్యేలా చూస్తోంది. చదవండి: బొగ్గుపై సుంకం స్కామ్‌లో ఈడీ దూకుడు -
‘లిక్కర్’ కేసులో తీవ్ర చర్యలొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో తనపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణ పారదర్శకతపై అనుమానాలు వస్తున్నాయని.. నిందితులు/సాక్షులపై థర్డ్ డిగ్రీ చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. అధికారులు చట్ట విరుద్ధంగా తన ఫోన్‌ను సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. కేంద్రంలోని అధికార పార్టీ కుట్రతో కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. అందువల్ల ఈ నెల 11 నాటి విచారణకు సంబంధించిన తదుపరి చర్యలపై, 16న జరగాల్సిన విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వందన సెహగల్ బుధవారం కవిత తరఫున అభ్యర్థనలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విన్నవించారు. ఈ తరహా కేసుల్లో గతంలో కోర్టులు ఇచ్చి న తీర్పులను పిటిషన్లో ప్రస్తావించారు. కవిత పిటిషన్‌లోని అంశాలివీ.. ‘‘పిటిషనర్ తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఉన్నత విద్యావంతురాలు, మహిళా ఎమ్మెల్సీ. గతంలో లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నప్పుడు పార్లమెంటులో పలు కమిటీల్లో పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఈడీ ఉద్దేశ పూర్వకంగా ఇండోస్పిరిట్స్ తదితరుల కేసులో ఆమెను విచారిస్తోంది. 2022 ఆగస్టు 17న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు లేదు. కొందరు వ్యక్తుల నిర్దిష్ట వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఈ కేసులో ఇంప్లీడ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో పిటిషనర్ పేరును కావాలనే ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు ఈడీ దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్లో పిటిషనర్ వ్యక్తిగత వివరాలు పొందుపరిచింది. అలా చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిటిషనర్‌పై కేంద్రంలోని అధికారపార్టీ కుట్రలో భాగంగా ఈడీ పనిచేస్తోంది. న్యాయస్థానం జోక్యంతోనే పిటిషనర్‌పై రాజకీయ కుట్ర ఆగుతుంది. విచారణకు సహకరించినా కూడా.. సీబీఐ 2022 డిసెంబర్ 2న పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. అదే నెల 11న పిటిషనర్ నివాసంలో సుమారు ఏడు గంటలపాటు విచారించింది. అయితే ఈ ఏడాది మార్చి 10న జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తామని పిటిషనర్ మార్చి 2న ప్రకటించారు. కానీ దీక్షకు ఒకరోజు ముందు (9న) విచారణకు హాజరుకావాలంటూ 7న ఈడీ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ విజ్ఞప్తి చేయడంతో 11న విచారణ చేపట్టి.. మళ్లీ 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చి ంది. ఇంటి వద్ద విచారించాలని కోరినా అనుమతించలేదు. చట్ట విరుద్ధంగా ఫోన్ సీజ్.. ఈ నెల 7న ఈడీ మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 50(2), 50(3) ప్రకారం సమన్లు ఇచ్చింది. అంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలి. కానీ ఫోన్ ఇవ్వాలని అందులో పేర్కొనలేదు. విచారణకు హాజరయ్యాక ఫోన్ ఇవ్వాలని అధికారులు కోరగా.. పిటిషనర్ ఫోన్ తెప్పించి అందజేశారు. కానీ ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా ఫోన్‌ను సీజ్ చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగినా వివరణ ఇవ్వలేదు. పైగా ఫోన్‌ను పిటిషనరే స్వయంగా అందజేశారని ఈడీ పేర్కొంది. ఇక పిటిషనర్‌ను నివాసంలో విచారించాలని కోరినా ఈడీ తిరస్కరించిన నేపథ్యంలో అరెస్టు చేస్తారన్న భావన వ్యక్తమైంది. అలా జరగలేదు. కానీ రాత్రి సుమారు 8.30 గంటలకు వరకూ విచారణ కొనసాగింది. ఆ స్టేట్మెంట్లలో విశ్వసనీయత కనిపించట్లేదు పిటిషనర్‌పై ఎలాంటి కేసు లేదు. కొందరు ఇచ్చి న స్టేట్మెంట్ల ఆధారంగా ఈడీ విచారిస్తోంది. కానీ తన స్టేట్మెంట్ను ఉపసంహరించుకుంటున్నానని అరుణ్ పిళ్లై కోర్టులో పిటిషన్ వేయడాన్ని చూస్తే.. ఆ స్టేట్మెంట్లు బలవంతంగా సేకరించినట్లు స్పష్టమవుతోంది. ఈడీ చెప్తున్న స్టేట్మెంట్లపై విశ్వసనీయత కనిపించడం లేదు. ఈడీ ఆఫీసులో విచారణ పిటిషనర్‌కు హానికరం! ఈడీ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ వంటి తీవ్ర చర్యలకు పాల్పడుతోందని శరత్‌చంద్రారెడ్డి విచారణ సమయంలో గాయపడిన చందన్‌రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. పిటిషనర్, ఇతర నిందితులకు ఎదురైన పరిణామాలు చూస్తుంటే శారీరకంగా, మానసికంగా ఈడీ బాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ కార్యాలయంలో విచారించడం పిటిషనర్‌కు హానికరమే. పిటిషనర్ తన నివాసంలో విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. పూర్తి పారదర్శకత కోసం పిటిషనర్‌ను న్యాయవాది సమక్షంలో విచారించాలి’’అని పిటిషన్లో పేర్కొన్నారు. అత్యవసర విచారణకు నో.. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కవిత తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు బుధవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ అత్యవసర విచారణకు నిరాకరించిన సీజేఐ.. ఈ నెల 24న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
జిల్లా కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్
సాక్షి, పెద్దపల్లి: కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ఉంటే న్యాయవ్యవస్థ మరింత చేరువగా పనిచేయగలుగుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలోని కోర్టుల్లో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సహా 14 మంది హైకోర్టు జడ్జీలతో కలసి సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజే మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రక్షించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనకు తెలుగు భాషపై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రసంగం విన్నానని గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత గురించి వివరించారని పేర్కొన్నారు. బాంబే హైకోర్టులో మరాఠీలో కోర్టు ప్రొసీడింగ్స్ అందిస్తే అదనపు ఫలితాలు వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరుడికి, వెనుకబడిన వర్గాలకు సమాంతర న్యాయసేవలు అందాలని తెలిపారు. కోర్టులో న్యాయవాదులు, జడీ్జలు మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, కలెక్టర్ సంగీత, రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం
-
సుప్రీంకోర్టు లో వాదనలు ప్రత్యక్ష ప్రసారం
-
కలెక్టర్ ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎంఎస్ నాయకర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్‌కు చెందిన 4.41 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం నిమిత్తం కేటాయించేందుకు కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ 4.41 ఎకరాల భూమిలో చేపట్టే నిర్మాణాలు ఈ వ్యాజ్యంలో తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేటాయింపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించి వాటిని కొట్టేయాలని కోరుతూ జనసేన పార్టీ కార్యకర్త బాతుల గణేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. రెవెన్యూ రికార్డుల్లో ఆ 4.41 ఎకరాల భూమి బండి బాటగా ఉందని చెప్పారు. అలాంటి భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపారు. ఆ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా చెట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, అందువల్ల ఇందులో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుత దశలో నిర్మాణాలను నిలువరిస్తూ ఎలాంటిæ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమన్న ధర్మాసనం, ఆ భూమిలో చేపట్టే నిర్మాణాలు తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. అది ప్రభుత్వ భూమి అని తేలితే ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని పేర్కొంది. -
జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సమావేశాలను జూమ్‌లో, విద్యార్థులకు చదువులు ఆన్లైన్లో..ఇలా ప్రతీది ఆన్లైన్ బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు జరుపుతుండగా...జర్నలిస్టుల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను సీజేఐ జస్టీస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. యాప్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీం కోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్‌ని విడుదలు చేస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ అన్నారు. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల ఈ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. ( చదవండి: కోవిడ్ మరణాల్లో మరో రికార్డు ) Breaking: Supreme Court to launch app that will provide links for virtual hearings to media persons#SupremeCourt #VirtualHearings #media https://t.co/xoFpobyCOo pic.twitter.com/I2CKKneZto — Bar & Bench (@barandbench) May 13, 2021 -
ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ప్రభుత్వం కోరినట్లు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై గత శుక్రవారం వాదనలు విన్న జస్టిస్ సోమయాజులు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంలో చాలా లోతుగా విచారణ జరపాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ ఎన్నికలను పూర్తి చేయలేదు. తర్వాత 2019లో రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలవగా.. అందులో ధర్మాసనం పలు ఆదేశాలిచ్చింది. పర్యవసానంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ కోవిడ్‌వల్ల వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు అడ్డుకోగలదా? అలా అడ్డుకోవడం ధర్మాసనమిచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడం కాదా? అన్నది పరిశీలించాలి. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందా? లేక కేవలం వాయిదా పడిందా? అన్నదీ పరిశీలించాలి. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైవుంటే.. ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వవచ్చా? అన్నదీ పరిశీలించాలి. ఫిబ్రవరిలో ఎన్నికలకు ఎస్ఈసీ ఇటీవల జారీచేసిన ప్రొసీడింగ్స్ హేతుబద్ధమైన అంశాల ఆధారంగా జారీచేసింది కాదని ఏజీ చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని సంప్రదించాకనే నిర్ణయించామని ఎస్ఈసీ న్యాయవాది అంటున్నారు. కాబట్టి ఈ దశలో ఎస్ఈసీ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనా? కావా? అన్నదానిని ఈ కోర్టు తేల్చజాలదు. ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని నిర్ణయిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను ఎన్నికల కమిషనర్ ఈ కోర్టుకు తప్పక వివరించాలి. పైన చెప్పిన అంశాలన్నింటినీ తేల్చేందుకు ఎస్ఈసీ నుంచి పూర్తిస్థాయి కౌంటర్ అవసరం. తుది ఉత్తర్వులిచ్చేముందు ఈ మొత్తం వ్యవహారంలో లేవనెత్తిన పలు అంశాల వాస్తవికతపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కారణాలరీత్యా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోరినట్టుగా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమన్నారు. -
రహస్యంగా మాల్యా అప్పగింత ప్రక్రియ : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: పరారీలో ఉన్న మాజీ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను భారత్‌కు తీసుకొచ్చేందుకు అప్పగించే ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఈ అంశంలో తాజా పరిస్థితి గురించి తెలియదని.. ఇందులో తాము ఒక పక్షంగా లేమని స్పష్టం చేసింది. అప్పగించే విషయంలో రహస్యంగా కొనసాగుతున్న ప్రక్రియలు ఏంటనేవి తమకు తెలియజేయాలని మాల్యా తరఫు న్యాయవాది అంకుర్సైగల్ను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్‌భూషణ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఆదేశించింది. మాల్యా న్యాయవాది సైతం ఈప్రక్రియలపై తనకు అవగాహన లేదని చెప్పారు. అప్పగింతకు వ్యతిరేకంగా చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించిన విషయమే తనకు తెలుసన్నారు. దీంతో మాల్యా అప్పగింత ప్రక్రియ ముగియనున్న నవంబర్ 2 నాటికి ఈ వివరాలు తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదిలీ చేయగా.. దీన్ని నేరంగా కోర్టు గతంలో ప్రకటించింది. దీన్ని సమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ అక్టోబర్ 5న తమ ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు లోగడ ఆదేశాలు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరఫున తీసుకున్న రూ.9,000 కోట్ల రుణ ఎగవేతకు సంబంధించి మాల్యా కోర్టు కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో తలదాచుకున్నారు. -
అంబానీపై దివాలా చర్యలు : సుప్రీంకు ఎస్బీఐ
సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ దాదాపు రూ. 1,200 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పును అమల్లోకి తెస్తే తనకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని ఎస్బిఐ తన పిటిషన్లో పేర్కొంది. (అనిల్ అంబానీపై దివాలా చర్యల నిలుపుదల) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఎస్బీఐ వాదించింది. సుమారు 1707 కోట్లు ప్రజాధనం బ్యాంకుకు రుణపడి ఉన్న అంబానీకి వ్యతిరేకంగా దివాలా తీర్పును నిలిపివేయడాన్ని సమర్థించలేమని తెలిపింది. ఆగస్టు 27 న జస్టిస్ విపిన్ సంఘీ, రజ్నీష్లతో కూడిన త్రిసభ్య ధర్మానసం మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తమ వాదనలు తెలియజేయాలని ఇన్సా ల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదావేసింది. -
కోవిడ్ -19 : కంపెనీలకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ -19 కల్లోలంతో సంక్షోభంలో పడి ఇబ్బందుల పాలవుతున్న కంపెనీలు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెద్ద మొత్తంలో దివాలా చర్యలకు గురికాకుండా ఆరు నెలల వరకు కంపెనీలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టింది. వచ్చే 6 నెలల పాటు కంపెనీలకు దివాలా నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర కేబినెట్ అనుమతించింది. కోవిడ్-19 కారణంగా ఈ సమయంలో దివాలాకు సంబంధించి కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన సూచనల ఆధారంగా 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాళా కోడ్(ఐబీసీ)కి సవరణ చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంది. కొత్త సెక్షన్ 10ఏకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే 7, 9, 10 సెక్షన్లను తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారు. అయితే సవరణ నిబంధనను సంవత్సరానికి మించి పొడిగించలేమని పేర్కొంది. కరోనా వైరస్ కష్టాలు,లాక్డౌన్ నష్టాలు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితిలోఇది సరైన నిర్ణయమని నిపుణులు అభినందించారు. ఇది దేశంలోని వ్యాపార వర్గాలకు మరింత స్థిరత్వాన్నిస్తుందని అభిప్రాపయడ్డారు. మార్చి చివరిలో మొదటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది ఒక ఆచరణాత్మక చర్య. లాక్ డౌన్ ఎత్తివేత , ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన సమయంలో, ఐబీసీని 6 నెలలు నిలిపివేయడం ఆర్థిక బలాన్ని స్తుందని డెలాయిట్ ఆర్థిక సలహా అధ్యక్షుడు ఉదయ్ భన్సాలీ అన్నారు. ఒక సంస్థకు అవసరమైన ఫైనాన్సింగ్, రుణాల గురించి తిరిగి చర్చలు జరపడాని్ఇ, బ్యాంకుల నుండి ఇతర ఉపశమనాలను పొందటానికి అవకాశం లభిస్తుందన్నారు. కాగా ప్రస్తుత పరిస్థితి ఏప్రిల్ 30 దాటినట్లయితే, ఐబీసీ 2016 లోని సెక్షన్ 7, 9 , 10 లను ఆరు నెలల కాలానికి సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మార్చి 24 న చెప్పిన సంగతి విదితమే. -
తప్పుడు కేసుకూ శిక్ష ఉండాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : ఏ చట్టం కిందనైనా, ఎవరినైనా తప్పుడు కేసు బనాయించి విచారిస్తే అందుకు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలి. ఇది మానవ హక్కులు, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలోని 14వ అధికరణలోని ఆరో సెక్షన్ తెలియజేస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆమోదించగా, భారత దేశమే ఇంకా ఆమోదించలేదు. రాజ్యం అంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించి నట్లయితే అందుకు కచ్చితంగా పరిహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం భారతీయుడికి జీవించే హక్కును, స్వేచ్ఛ హక్కును ప్రసాదిస్తున్న కారణంగా ఇంతవరకు ఈ అంతర్జాతీయ చట్టాన్ని ఆమోదించలేదు. కానీ దేశంలో ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించినట్లయితే రాజ్యం తిరిగి ఇచ్చే ప్రసక్తి ఎలా ఉంటుంది? ఉండదుకనుక భారతీయ పౌరులు తప్పుడు కేసులకు బలవుతున్నారు. అందుకని బాధితులకు నష్టపరిహారం ఇచ్చి వారికి పునరావాసం కల్పించే అవకాశం ఉండాలని భారత లా కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా తీసుకరావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 277వ నివేదికలో సిఫార్సు చేసింది. అమాయకులపై తప్పుడు కేసులను బనాయించిన అధికారులను ప్రాసిక్యూట్ చేసే చట్టం కూడా ఉండాలని లా కమిషన్ సూచించింది. ఇస్రో సైంటిస్ట్‌పై కేరళ పోలీసులు గూఢచర్యం కింద తప్పుడు కేసును బనాయించి సుదీర్ఘకాలం విచారించడం, ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేడం, బాధిత సైంటిస్ట్ నష్టపరిహారం కోసం కోర్టుకెక్కడం, ఆయనకు 25లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం తదతిర పరిణామాల నేపథ్యంలో లా కమిషన్ సిఫార్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. -
5,054
∙ గుర్తించిన జిల్లా యంత్రాంగం ∙ రేపు లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత ∙ అనర్హుల్లో ఎక్కువమంది వితంతువులే రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఒంటరి మహిళల లెక్క తేలింది. 5,054 మంది అర్హులను గుర్తించారు. ఏ ఆధారమూ లేని వీరి ఎదురుచూపులకు రెండు రోజుల్లో మోక్షం లభించనుంది. జీవనభృతి కోసం గుర్తించిన ఈ లబ్ధిదారులకు ఆదివారం ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. గత నెల 8 నుంచి 25 తేదీ వరకు ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో నాలుగు వేల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు తొలుత అంచ నా వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,017 దరఖాస్తులు అందాయి. వీటిని గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు రెండు దశల్లో అధికారులు పరిశీలన చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి పూర్వపరాలు ఆరా తీసి పరిశీలన జరిపారు. ఆ తర్వాత దశలో అన్ని దరఖాస్తుల్లో 10 శాతం రాండమ్‌గా మరోసారి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల మేరకు ఉన్న 5,054 మంది అర్హులను జీవనభృతికి ఎంపిక చేశారు. రెండు రోజుల కిందటే ఈ జాబితా ఖరారైంది. కలెక్టర్ రఘునందన్ రావు కూడా జాబితాకు ఆమోదముద్ర వేశారు. అనర్హుల్లో చాలామంది వితంతువులే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఏదో ఒక పెన్షన్ పొందుతున్న వాళ్లూ దరఖాస్తుదారుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇటువంటి వాటిని తిరస్కరించామని వివరిస్తున్నారు. అర్హత సాధించిన వారిలోనూ 80 శాతం విడాకులు తీసుకున్న లబ్ధిదారులే ఉన్నారని సమాచారం. మిగిలిన వారు అవివాహితులై తల్లిదండ్రులపై ఆధారపడిన వారేనని తెలిసింది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా.. గుర్తించిన లబ్ధిదారులకు ఆదివారం ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేయనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ నియోజవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ద్వారా ప్రొసీడింగ్స్‌ని లబ్ధిదారులకు అప్పగిస్తారు. మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఆ తంతు జరగనుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి రూ. వెయ్యి చొప్పున మొత్తం రూ. 2వేలు జమ చేస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకు ద్వారా డబ్బులు అందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా అందజేస్తారు. వీరికి వారంలోగా భృతి అందే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అప్పటికప్పుడే వారి వేలిముద్రలు తీసుకుని డబ్బులు అందజేస్తారని పేర్కొంటున్నారు. మొత్తం లబ్ధిదారులు : 5,054 గ్రామీణ ప్రాంతాల్లో : 3,300 జీహెచ్ఎంసీ పరిధి : 1,352 షాద్‌నగర్ మున్సిపాలిటీ : 78 మీర్‌పేట మున్సిపాలిటీ : 56 జిల్లెలగూడ మున్సిపాలిటీ : 37 జల్పల్లి మున్సిపాలిటీ : 62 బడంగ్‌పేట నగర పంచాయతీ : 79 ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ : 26 పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీ : 64 -
వక్ఫ్‌బోర్డ్ ప్రొసీడింగ్స్ నిలిపివేత...
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని వక్ఫ్ సంస్థ దర్గా–ఈ–ఐదరూసియాకు ముత్తవల్లీ ఉండగానే, అతని స్థానంలో మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్ సీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును ఉమ్మడి హైకోర్టు నిలిపేసింది. ముత్తవల్లీ ఉండగా, మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసే న్యాయపరిధి వక్ఫ్‌బోర్డుకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషశాయి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్ వక్ఫ్‌బోర్డ్ సీఈవోపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయగా, అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. హబీబ్‌ను నియంత్రించడంతో పాటు దర్గా–ఈ–ఐదరూసియాకు మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ వక్ఫ్‌బోర్డ్ సీఈవో గత నెల 23న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హబీబ్ హైకోరు ్టను ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యాజ్యంపై జస్టిస్ ఎ.వి.శేషశాయి విచారణ జరిపారు. వాదనలు విన్న ధర్మాసనం వక్ఫ్‌బోర్డ్ ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. -
అసలైన ఏపీ ఒలింపిక్ సంఘం మాదే
హైకోర్టులో జె.సి.పవన్‌రెడ్డి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని అసలైన సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ సంఘం ప్రధాన కార్యదర్శి జె.సి.పవన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గల్లా జయదేవ్‌కు అనుకూలంగా ఐఓఏ గతనెల 7న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ని లిపేయాలని ఆయన వ్యాజ్యంలో కోర్టు ను కోరారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని, ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ ఒలిపింక్ సంఘాన్ని హైజాక్ చేసేందుకు గల్లా జయదేవ్ కుట్రపన్నారని పవన్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట
* అనుబంధ గుర్తింపు వ్యవహారంలో వెసులుబాటు * అప్పీళ్లకు 20వ తేదీ వరకు అవకాశం * జూలై 6 నుంచి కౌన్సెలింగ్..జూలై 31 కల్లా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కావాలి * ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి..ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అనుబంధ గుర్తింపు ప్రక్రియ విషయంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ), హైదరాబాద్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది. 2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపిన జేఎన్టీయూ, వాటిని సవరించుకునేందుకు రెండు రోజుల గడువునిస్తూ ఈ నెల 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌పై అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేసుకునే వెలుసుబాటును హైకోర్టు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీకల్లా అప్పీళ్లు దాఖలు చేసుకోవాలని ఇంజనీరింగ్ కాలేజీలను ఆదేశించిన హైకోర్టు, ఆ అప్పీళ్లను ఈ నెల 28కల్లా పరిష్కరించాలని జేఎన్టీయూహెచ్ అప్పీలేట్ అథారిటీకి స్పష్టం చేసింది. అప్పీళ్లను విచారించే సమయంలో 9వ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో లేవనెత్తిన లోపాల వరకే పరిమితం కావాలని అప్పీలేట్ అథారిటీకి తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు సవరించింది. మొదటి కౌన్సెలింగ్‌ను జూలై 6న, రెండో కౌన్సెలింగ్ 13న, మూడో కౌన్సెలింగ్‌ను జూలై 20న నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై 31 కల్లా పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే కాలేజీల తనిఖీలు ఆపి, ఇప్పటి వరకు జరిపిన తనిఖీల ఆధారంగా తయారు చేసిన నివేదికలను, నిజనిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదికలను వెబ్సైట్లో ఉంచాలని జేఎన్టీయూని ఆదేశించింది. ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను జేఎన్టీయూహెచ్ ఎత్తిచూపింది. ఈ లోపాలను వెంటనే సవరించుకోవాలని, సవరించుకున్న విషయాన్ని తమకు తెలియచేస్తే మరోసారి తనిఖీలు నిర్వహిస్తామంటూ ఈ నెల 9న జేఎన్టీయూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. లోపాల సవరణకు రెండు రోజుల గడువునిచ్చింది. ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయడంతో పాటు, తమ కాలేజీలను ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మరికొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.