తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్..
హైకోర్టులో జె.సి.పవన్‌రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని అసలైన సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి కుమారుడు, ఆంధ్రప్రదేశ్ సంఘం ప్రధాన కార్యదర్శి జె.సి.పవన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గల్లా జయదేవ్‌కు అనుకూలంగా ఐఓఏ గతనెల 7న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ని లిపేయాలని ఆయన వ్యాజ్యంలో కోర్టు ను కోరారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని, ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆంధ్రప్రదేశ్ ఒలిపింక్ సంఘాన్ని హైజాక్ చేసేందుకు గల్లా జయదేవ్ కుట్రపన్నారని పవన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.