వక్ఫ్‌బోర్డ్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేత... | vakphbord Proceedings stopped by high court | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌బోర్డ్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేత...

Published Wed, Jan 25 2017 3:15 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

వక్ఫ్‌బోర్డ్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేత... - Sakshi

వక్ఫ్‌బోర్డ్‌ ప్రొసీడింగ్స్‌ నిలిపివేత...

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలోని వక్ఫ్‌ సంస్థ దర్గా–ఈ–ఐదరూసియాకు ముత్తవల్లీ ఉండగానే, అతని స్థానంలో మేనేజింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్‌ సీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును ఉమ్మడి హైకోర్టు నిలిపేసింది. ముత్తవల్లీ ఉండగా, మేనేజింగ్‌ కమిటీని ఏర్పాటు చేసే న్యాయపరిధి వక్ఫ్‌బోర్డుకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషశాయి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్‌ వక్ఫ్‌బోర్డ్‌ సీఈవోపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయగా, అది ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.

హబీబ్‌ను నియంత్రించడంతో పాటు దర్గా–ఈ–ఐదరూసియాకు మేనేజింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ వక్ఫ్‌బోర్డ్‌ సీఈవో గత నెల 23న ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ హబీబ్‌ హైకోరు ్టను ఆశ్రయించారు. తాజాగా ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ ఎ.వి.శేషశాయి విచారణ జరిపారు. వాదనలు విన్న ధర్మాసనం వక్ఫ్‌బోర్డ్‌ ప్రొసీడింగ్స్‌ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement