
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ -19 కల్లోలంతో సంక్షోభంలో పడి ఇబ్బందుల పాలవుతున్న కంపెనీలు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెద్ద మొత్తంలో దివాలా చర్యలకు గురికాకుండా ఆరు నెలల వరకు కంపెనీలకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టింది. వచ్చే 6 నెలల పాటు కంపెనీలకు దివాలా నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర కేబినెట్ అనుమతించింది. కోవిడ్-19 కారణంగా ఈ సమయంలో దివాలాకు సంబంధించి కొత్త డీఫాల్ట్ కేసులను నమోదు చేయదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన సూచనల ఆధారంగా 2016 ఇన్సాల్వెన్సీ అండ్ దివాళా కోడ్(ఐబీసీ)కి సవరణ చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం రావాల్సి ఉంది. కొత్త సెక్షన్ 10ఏకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే 7, 9, 10 సెక్షన్లను తాత్కాలికంగా పక్కన పెట్టనున్నారు. అయితే సవరణ నిబంధనను సంవత్సరానికి మించి పొడిగించలేమని పేర్కొంది.
కరోనా వైరస్ కష్టాలు,లాక్‌డౌన్ నష్టాలు వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితిలోఇది సరైన నిర్ణయమని నిపుణులు అభినందించారు. ఇది దేశంలోని వ్యాపార వర్గాలకు మరింత స్థిరత్వాన్నిస్తుందని అభిప్రాపయడ్డారు. మార్చి చివరిలో మొదటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది ఒక ఆచరణాత్మక చర్య. లాక్ డౌన్ ఎత్తివేత , ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన సమయంలో, ఐబీసీని 6 నెలలు నిలిపివేయడం ఆర్థిక బలాన్ని స్తుందని డెలాయిట్ ఆర్థిక సలహా అధ్యక్షుడు ఉదయ్ భన్సాలీ అన్నారు. ఒక సంస్థకు అవసరమైన ఫైనాన్సింగ్, రుణాల గురించి తిరిగి చర్చలు జరపడాని్ఇ, బ్యాంకుల నుండి ఇతర ఉపశమనాలను పొందటానికి అవకాశం లభిస్తుందన్నారు. కాగా ప్రస్తుత పరిస్థితి ఏప్రిల్ 30 దాటినట్లయితే, ఐబీసీ 2016 లోని సెక్షన్ 7, 9 , 10 లను ఆరు నెలల కాలానికి సస్పెండ్ చేయడాన్ని ప్రభుత్వం పరిశీలించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మార్చి 24 న చెప్పిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment