మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో జిల్లాల్లో అధునాతనమైన ధోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం హర్షణీయమని తెలంగాణ రాష్ట్ర రజక జేఏసీ ఫౌండర్ చైర్మన్ పంజగారి ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రజకుల పట్ల అభిమానంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణలోని 10 జిల్లాల రజకులు రుణపడి ఉన్నామని తెలిపారు. ధోబీ ఘాట్లకు ఉచిత కరంట్, వాటి నిర్మాణానికి స్థలాన్ని అందించాలన్నారు. అదే విధంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు.