సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడమేనని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం(జులై 25) ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కేంద్ర బడ్జెట్‌పై ఢిల్లీలో దీక్ష చేద్దాం.. అమరణ దీక్షలు చేద్దామనడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆలోచనను స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ సర్కారు పదేళ్లుగా తెలంగాణ సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో 35శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి.
ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో కోరాయి. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దేశ భవిష్యత్తుకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు పొందుపరిచాం. ఈ బడ్జెట్ పట్ల అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నారు’అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment