ఇస్లామాబాద్: భారత్తో ఉన్న కశ్మీర్ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాలశాఖ మంత్రి సర్తాజ్ అజీజ్ అన్నారు. ఒక శాంతియుత తీర్మానం ద్వారా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చేసిన తీర్మానాల ఆధారంగానే తమ ఆలోచన ఉందని చెప్పారు. కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు పొందేందుకు రాజకీయంగా, నైతికంగా అన్ని రకాలుగా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఏ స్థాయిలోనైనా భారత్తో తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది: పాక్
Published Wed, Sep 30 2015 9:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM
Advertisement
Advertisement