ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్‌లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి.
మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్‌బోర్గ్‌కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్‌సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్‌గోంబా లేఖ రాశారు.
‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది.
మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు.
కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ.
ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే..
Comments
Please login to add a commentAdd a comment