European Parliament
-
Manipur: మతం రంగు పులమొద్దు
ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి. మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్బోర్గ్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్గోంబా లేఖ రాశారు. ‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది. మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు. కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ. ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే.. -
ఇక చాలూ.. ఆమె చర్యతో పార్లమెంట్లో మౌనం
స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్స్): యూరోపియన్ పార్లమెంట్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. స్వీడన్ సభ్యురాలైన అల్ సహ్లానీ ఎవరూ ఊహించని చేష్టలకు దిగారు. ఇరాన్ మహిళలకు సంఘీభావంగా పార్లమెంట్‌లోనే ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో.. తోటి సభ్యులంతా షాక్ తిన్నారు. మహ్సా అమినీ అనే యువతి మృతి నేపథ్యంతో మొదలైన హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృత స్థాయిలో కొనసాగుతున్నాయి అక్కడ. ఈ పోరాటంలో పాల్గొంటున్న ఇరాన్ మహిళలకు సంఘీభావం తెలిపే క్రమంలో తన జుట్టు కత్తిరించుకున్నారు అల్ సహ్లానీ. ఈయూ పార్లమెంట్లో ఇరాన్ ఆందోళనలపై ఆమె ప్రసంగించారు. ‘‘మౌనంగా ఉంది ఇక చాలూ. ఈయూ పౌరులమైన మనం.. ఇరాన్లో సాధారణ పౌరులపై జరుగుతున్న హింసాకాండను ఆపేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. వాళ్లు(ఇరాన్ పౌరులను ఉద్దేశించి) తమ జీవితాలను పణంగా పెట్టి అక్కడ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ఇరాన్‌కు స్వేచ్చ లభించేంత వరకు.. అణచివేతదారుల కంటే మన ఆవేశం ఎక్కువగానే ఉంటుంది. ఇరాన్ మహిళలు.. మీకు స్వేచ్ఛ లభించేంత వరకు మేం మీకు అండగా ఉంటాం. జిన్ జియాన్ ఆజాదీ(వుమెన్, లైఫ్, ఫ్రీడమ్) అంటూ ఆమె వెంట తెచ్చుకున్న కత్తెరతో తన పోనీ టేల్‌ను కత్తిరించుకున్నారామె. Traditionen att klippa av sig håret i protest är tusenårig. Den visar att ilskan är starkare än förtryckarens makt. Irans kvinnor har fått nog. EU borde visa samma mod och ge dem fullt stöd. pic.twitter.com/0FdMB9XoXu — AbirAlsahlani (@AbirAlsahlani) October 4, 2022 ఇరాన్లో పుట్టిన అబిర్ అల్-సహ్లానీ.. స్టాక్‌హోమ్(స్వీడన్) హగెర్స్టన్లో స్థిరపడ్డారు. 2009 జులై నుంచి ఆమె స్వీడన్ సభ్యురాలిగా యూరోపియన్ పార్లమెంట్లో కొనసాగుతున్నారు. ఇక ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను కట్టడి చేసేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వంద మందికి పైగా సాధారణ పౌరులు మరణించారు. మరోవైపు ఇరాన్ మహిళలు, స్కూల్ చిన్నారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వీళ్ల ఆందోళనకు మద్దతుగా ప్రముఖులు సైతం జుట్టు కత్తిరించుకుని సంఘీభావం తెలుపుతున్నారు. -
ఈయూకు టాటా..
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ తన 47 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఈ చారిత్రక సందర్భం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని బ్రిటన్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బ్రెగ్జిట్ శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. బ్రెగ్జిట్ మరో కొత్త శకానికి నాంది అని ఈ సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఆయన ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో.. ‘చీకట్లు తొలగిపోతున్న వేళ ఘనమైన మన జాతి కొత్త పాత్ర ఆవిష్కృతం కానుంది. బ్రస్సెల్స్‌లోని ఈయూ ప్రధాన కార్యాలయం వద్ద బ్రిటన్ జెండాను తీసేస్తున్న అధికారులు ప్రతి ప్రాంత వాసుల కలలు సాకారం కానున్నాయి. బ్రెగ్జిట్ కేవలం న్యాయపరమైన చర్య కాదు. జాతి పరివర్తన, పునరుత్తేజం పొందే క్షణం’అని పేర్కొన్నారు. ‘ఈయూ నుంచి విడిపోవడంతో మన విధానాలను స్వేచ్ఛగా అమలు చేసే అవకాశం వచ్చింది. భారత్ సహా 13 దేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం’అనిఅన్నారు. దేశ చరిత్రలో ఇది గొప్ప ఘటన అని బ్రెగ్జిట్ అనుకూల నేత నిగెల్ ఫరాజ్ వ్యాఖ్యానించారు. సంబరాలు.. నిరసనలు ఈ ప్రత్యేక సందర్భంలో లండన్‌లోని పార్లమెంట్ స్వే్వర్తోపాటు డౌనింగ్ స్ట్రీట్ వద్ద బ్రెగ్జిట్ కౌంట్‌డౌన్ తెలుపుతూ భారీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పబ్బులు, క్లబ్బుల్లో ప్రజలు బ్రెగ్జిట్ విందులు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ‘అన్ని దేశాలకు శాంతి, శ్రేయస్సు, స్నేహం’నినాదంతో కూడిన 50 పెన్స్(అరపౌండ్) నాణేన్ని విడుదల చేసింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన అన్ని సంస్థలపైనా బ్రిటన్ యూనియన్ జాక్ జెండాను తొలగించారు. కాగా, ఈయూలోనే కొనసాగాలంటూ కొన్ని చోట్ల బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు కూడా జరిగాయి. బ్రిటన్‌తోపాటు తమను కూడా ఈయూ నుంచి వేరు చేయడాన్ని నిరసిస్తూ స్కాట్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. మరోసారి బ్రెగ్జిట్‌పై రెఫరెండం పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, బ్రెగ్జిట్తో బ్రిటన్, ఈయూ మధ్య ఒక్కసారిగా ఎలాంటి మార్పులు రావు. ఒప్పందం ప్రకారం.. శనివారం నుంచి ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో బ్రెగ్జిట్ అమలుకానుంది. మిశ్రమ స్పందన బ్రెగ్జిట్‌పై బ్రిటన్ పత్రికల్లో మిశ్రమ స్పందన కనిపించింది. డైలీ ఎక్స్‌ప్రెస్, ది సన్ వంటి పత్రికలు బ్రిటన్ శక్తివంతమవుతుందని వ్యాఖ్యానించగా, ముందున్నది గతులకు బాట అంటూ స్టాండర్డ్ పత్రిక, ది గార్డియన్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈయూను వీడిన బ్రిటన్ అంటూ బీబీసీ ప్రసారం చేసిన కథనంపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. కాగా, బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే సమయంలోనే.. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్సులోని కలైస్ పోర్టు నుంచి బ్రిటన్‌లోని డోవర్‌కు బయలుదేరిన ఓడలో మాత్రం ఎలాంటి సందడి కనిపించలేదు. ఆ ఓడ బయలుదేరిన సమయానికి ఈయూలో 28 సభ్యుదేశాలుండగా బ్రిటన్‌లోకి అడుగిడే సమయానికి ఈయూ 27 దేశాల సమాఖ్యగా మారనుంది. కాగా, కోట్ డెస్ డ్యూన్స్ అనే ఆ ఓడలో ప్రయాణీకుల్లో చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. ఆడ్రే సెంటినెల్లా అనే మహిళ మాత్రం..‘ఇది విచారకరమైన రోజు. ఈ రోజుతో ఒక శకం ముగియనుంది. ఏం జరుగుతుందో తెలియని భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఎన్ని లోటుపాట్లున్నా ఈయూతోనే బ్రిటన్ ముందుకు సాగితే బాగుండేది’అని పేర్కొన్నారు. ఈమె స్విట్జర్లాండ్‌లో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. రేపటి నుంచి ఫెర్రీ క్యాంటిన్లో బ్రిటిష్ ఫిష్, చిప్స్ తినే వారు కనిపించరని ఓడ కెప్టెన్ ఆంటోయిన్ పకెట్ అన్నారు. బ్రెగ్జిట్ కారణంగా బ్రిటన్‌కు, ఈయూకు నిత్యం రాకపోకలు సాగించడం పెద్ద తలనొప్పిగా మారబోతోందని మరో ప్రయాణికుడు అలెస్సో బార్టన్ అన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 27 దేశాల్లో తిరగగలిగే అవకాశాన్ని చాలా మంది కోల్పోనుండటం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దులు చెరిగిపోవాల్సిన సమయంలో పెరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రెగ్జిట్ పరిణామం భవిష్యత్తుకు మంచిది కాదని జర్మనీకి చెందిన మొహమ్మద్ మజోకా తెలిపారు. -
పౌరసత్వ చట్టంపై ఈయూలో ఓటింగ్ వాయిదా
లండన్: మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు సీఏఏపై చర్చ కోరుతూ దాఖలు చేసిన ఐదు తీర్మానాలను కలిపి ఒకటిగా చేసి, బ్రసెల్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని బుధవారం సమావేశాల తుది ఎజెండాలో చేర్చారు. చర్చ అనంతరం గురువారం జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఓటింగ్ మార్చి నెలలో జరిగే సమావేశాల్లో నిర్వహిస్తామని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. సీఏఏపై చర్చను మాత్రం ఇప్పుడు కొనసాగించి, ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేయాలన్న సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. భారత్ వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ వాయిదా పడిందని, ఇది భారత ప్రభుత్వ దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. ఒక రాజ్యాంగబద్ధసంస్థ చేసిన చట్టంపై మరో రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పునివ్వడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ రాశారు. యూరోపియన్ పార్లమెంట్లో పాకిస్తాన్ మిత్రుల వాదనపై భారత మిత్రుల వాదనే నెగ్గిందని భారత ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఏఏ వివక్షాపూరితమని, ఆ చట్టంలోని వివాదాస్పద సవరణలను భారత్ వెనక్కు తీసుకోవాలని గత నెలలో ఐరాస మానవహక్కుల విభాగం ‘యూఎన్‌హెచ్‌సీఆర్’ చేసిన వ్యాఖ్యను ఈయూ పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంది. బెగ్జిట్కు ఆమోదం యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బుధవారం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అమెరికాలో.. సీఏఏ, ఎన్నార్సీలు అమెరికా ప్రతినిధులసభలో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ, ఎన్నార్సీలు మతపరమైన హింసకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విచారణ సందర్భంగా సభకు వివరించారు. అంతర్జాతీయ మానవహక్కుల ఉపసంఘాలూ, గ్లోబల్ హెల్త్ ఉపసంఘాలూ, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్‌సబ్ కమిటీలూ, ఆఫ్రికా విదేశాంగ వ్యవహారాల కమిటీలు ఈ విచారణను చేపట్టాయి. -
దెబ్బ మీద దెబ్బ.. అయినా బుద్ధి రావడం లేదు
బ్రస్సెల్: కశ్మీర్ అంశంలో.. అంతర్జాతీయ సమాజంలో పాక్‌కు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అయినా కూడా పాక్ తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. కశ్మీర్ పునర్వ్యస్థీకరణ అంశంలో తాజాగా పాక్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. యూరోపియన్ పార్లమెంట్ కశ్మీర్ విభజన అంశంలో భారత్‌కు మద్దతివ్వడమే కాక పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని ఆరోపించింది. యూరోపియన్ పార్లమెంటు ప్లీనరీ ప్రత్యేక చర్చ సందర్భంగా బుధవారం పార్లమెంటు సభ్యుల రిస్జార్డ్ జార్నెక్కి, ఫుల్వియో మార్టస్సిల్లో కశ్మీర్ అంశంపై చర్చించారు. పాక్‌పై విమర్శలు చేయడమే కాక భారతదేశానికి పూర్తి మద్దతు ఇచ్చారు. అంతేకాక భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం అని ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశంలో మేం భారత్‌కు మద్దతిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా భారత్, కశ్మీర్ ఉగ్ర దాడులతో నలిగిపోతున్నాయి. ఉగ్రవాదులు ఎక్కడో చంద్రుడి మీద నుంచి రావడం లేదు. పొరుగు దేశం నుంచే వస్తున్నారు. పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో మానవహక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు’ అని ఆరోపించారు. అలానే ‘ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి మేం చెప్పేది ఒక్కటే. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు కృషి చేయండి. లోయలో ఫోన్, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించాలని’ కోరారు. (చదవండి: భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం) -
పాకిస్తాన్.. బుద్ధి మార్చుకో!
బ్రస్సెల్స్ : జమ్మూకశ్మీర్ పరిష్కారానికి భారత్ చూపుతున్న చొరవ అద్భుతమని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అభిప్రాయ పడింది. శాంతియుత పరిష్కారం దిశగా తాజాగా చర్చల బృందాన్ని భారత్ నియమించడంపై ఈయూ పార్లమెంట్ హర్షం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకుంటున్న చొరవ గురించి ఈయూ పార్లమెంట్ సభ్యుడు పెట్రాస్ ఆస్ట్రెవిషియస్, ఈపీ టుడేకు రాసిన ఆర్టికల్‌లో ప్రత్యేకంగా అభినందించారు. భారత్ కొత్తగా ఏర్పాటు చేసిన చర్చల బృందానికి జమ్మూ కశ్మీర్ ప్రజలు సహకారం అందిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై పెట్రాస్ ఆస్ట్రెవిషియస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ కావాలనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన అందులో పేర్కొన్నారు. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తానే కశ్మీర్లో హింసను ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలైన భారత్, యూరోపియన్ యూనియన్లు ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. -
కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ విజ్ఞప్తి..
యూరోపియన్ పార్లమెంటులో ప్రధాని సిప్రస్ ప్రసంగం ♦ సంస్కరణలను అమలు చేస్తామని హామీ... ♦ నేడు సవివర ప్రణాళిక సమర్పించాలి... ♦ యూరోజోన్ దేశాల తాజా డెడ్‌లైన్... ♦ ఆదివారం ఈయూ సదస్సులో నిర్ణయం... స్ట్రాస్‌బర్గ్(ఫ్రాన్స్) : ఆర్థికంగా కుప్పకూలడానికి సిద్ధంగాఉన్న గ్రీస్.. ఈ సంకటం నుంచి తప్పించుకోవడం కోసం కొత్త బెయిలవుట్ కోసం అధికారికంగా యూరప్ నేతలు, రుణదాతలకు బుధవారం విజ్ఞప్తి చేసింది. యూరప్ బెయిలవుట్ ఫండ్ నుంచి తాజాగా మూడేళ్లపాటు ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా రాతపూర్వకంగా కోరింది. ఈ విషయాన్ని యూరోజోన్ అధికార ప్రతినిధి మైఖేల్ రీన్స్ వెల్లడించారు. మరోపక్క, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ యూరోపియన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ... సంస్కరణల అమలుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి తెరదించేందుకు తమ దేశం రుణదాతలతో కొత్త ఒప్పందం కోసం ఎదురుచూస్తోందన్నారు. కొత్తగా సహాయ ప్యాకేజీ అందించేందుకు వీలుగా సవివరమైన, విశ్వసనీయ ప్రణాళికతో పాటు చేపట్టబోయే వ్యయ నియంత్రణ, ఇతరత్రా ఆర్థికపరమైన చర్యలను నేటికల్లా సమర్పించాల్సిందేనని యూరప్ నేతలు డెడ్‌లైన్ విధించారు. ఈ ప్రణాళికపై చర్చించేందుకు ఆదివారం(11న) కేవలం యూరోజోన్ సభ్యులతోనే(19 దేశాలు) కాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్(28 దేశాల) నేతలతో సదస్సు నిర్వహించాలని ఈయూ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ నిర్ణయించారు. మరోపక్క, సిప్రస్ తాజా ప్రతిపాదనలు ఎందుకూపనికిరావని, యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలిగేందుకే ఎక్కువగా అవకాశాలున్నాయని యూరోపియన్ కమిషన్(ఈసీ) ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జుంకర్ వ్యాఖ్యానించడం గమనార్హం. మా దేశాన్ని ప్రయోగశాలగా మార్చారు... గత ఐదేళ్లుగా కొనసాగిన బెయిలవుట్ ప్యాకేజీలతో తమ దేశాన్ని వ్యయ నియంత్రణ (ఆస్టెరిటీ) చర్యలకు ఒక ప్రయోగశాలగా మార్చేశారని సిప్రస్ పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దిగజారేందుకు దారితీసిందన్నారు. కొనసాగుతుతున్న నియంత్రణలు... గ్రీస్‌లో బ్యాంకుల మూత, ఏటీఎం విత్డ్రాయల్స్పై పరిమితి(రోజుకు 60 యూరోలు) కొనసాగుతోంది. దాదాపు ఆదివారం వరకూ బ్యాంకులు తెరిచే అవకాశాల్లేవనేది ప్రభుత్వ వర్గాల సమాచారం. విదేశాలకు డబ్బు పంపుకోవాలన్నా, బిల్లుల చెల్లింపులకు సైతం ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వస్తుండటంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. -
బ్లాటర్... వెంటనే తప్పుకో...
యూరోపియన్ పార్లమెంట్ డిమాండ స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది. తాత్కాలిక అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి ఫిఫాలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఐదో పర్యాయం ఫిఫా చీఫ్‌గా ఎన్నికైన నాలుగు రోజులకే బ్లాటర్ రాజీనామా చేసినా... నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఫిఫాలో సంస్కరణలు ఆలస్యమైతే ఫుట్‌బాల్‌కు తీరని నష్టం ఏర్పడుతుందని ఈయూ ఆందోళన వ్యక్తం చేసింది. -
'మలాలా' దేశ గౌరవానికి ప్రతీక : నవాజ్ షరీఫ్
మలాలా యుసఫ్‌జాయ్ పాకిస్థాన్ దేశ గౌరవానికి ప్రతీక అని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ అభివర్ణించారు. శనివారం ఇస్లామాబాద్‌లో డైలీ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐరోపా పార్లమెంట్ మానవ హక్కుల కోసం కృషి చేసినవారికి అందించే షకరోవా పురస్కారానికి మలాలా ఎంపిక కావడం పట్ల విలేకర్లు అడిగిన ప్రశ్నకు నవాజ్ షరీఫ్‌పై విధంగా స్పందించారు. ఈ సందర్బంగా మలాలాను నవాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. తమ దేశానికి మలాలా ఓ అణిముత్యమని పేర్కొన్నారు. యువతరానికి, రాబోయే తరాలకు స్ఫూర్తి అని తెలిపారు. ఆమెను చూసి దేశం గర్విస్తుందని చెప్పారు. పాక్‌లో బాలికల విద్య కోసం ఆమె చేస్తున్న పోరాటంపై ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుందన్నారు. అయితే ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న మలాలా ఆ దేశాధ్యక్షుడు ఒబామా ఆయన భార్య మిషెల్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా మలాలాను ఒబామా దంపతులు ఘనంగా సత్కరించారు. పాక్‌లో బాలికల విద్య కోసం ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ ఆమె చేస్తున్న పోరాటాన్ని ఒబామా దంపతులు ఈ సందర్భంగా కొనియాడారు. పాక్‌లో చిన్నారి బాలికల విద్య కోసం తాలిబన్లను సైతం ఎదురించింది. ఆ క్రమంలో తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్య చికిత్స కోసం పాక్ ప్రభుత్వం మలాలాను బ్రిటన్‌కు తరలించింది. అక్కడ మలాలా ఆరోగ్యం కుదుటపడింది. మలాలాతోపాటు ఆమె తండ్రి బ్రిటన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.