బ్రస్సెల్స్ : జమ్మూకశ్మీర్ పరిష్కారానికి భారత్ చూపుతున్న చొరవ అద్భుతమని యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అభిప్రాయ పడింది. శాంతియుత పరిష్కారం దిశగా తాజాగా చర్చల బృందాన్ని భారత్ నియమించడంపై ఈయూ పార్లమెంట్ హర్షం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకుంటున్న చొరవ గురించి ఈయూ పార్లమెంట్ సభ్యుడు పెట్రాస్ ఆస్ట్రెవిషియస్, ఈపీ టుడేకు రాసిన ఆర్టికల్‌లో ప్రత్యేకంగా అభినందించారు. భారత్ కొత్తగా ఏర్పాటు చేసిన చర్చల బృందానికి జమ్మూ కశ్మీర్ ప్రజలు సహకారం అందిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాలపై పెట్రాస్ ఆస్ట్రెవిషియస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ కావాలనే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన అందులో పేర్కొన్నారు. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తానే కశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలైన భారత్, యూరోపియన్ యూనియన్‌లు ప్రపంచ శాంతికి కట్టుబడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment