ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది.
యూరోపియన్ పార్లమెంట్ డిమాండ
స్ట్రాస్‌బర్గ్ (ఫ్రాన్స్) : ఫిఫా అధ్యక్ష బాధ్యతల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ సెప్ బ్లాటర్‌ను యూరోపియన్ పార్లమెంట్ (ఈయూ) డిమాండ్ చేసింది. తాత్కాలిక అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి ఫిఫాలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది. ఐదో పర్యాయం ఫిఫా చీఫ్‌గా ఎన్నికైన నాలుగు రోజులకే బ్లాటర్ రాజీనామా చేసినా... నిబంధనల ప్రకారం డిసెంబర్ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఫిఫాలో సంస్కరణలు ఆలస్యమైతే ఫుట్‌బాల్‌కు తీరని నష్టం ఏర్పడుతుందని ఈయూ ఆందోళన వ్యక్తం చేసింది.