న్యూయార్క్:దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య(ఫిఫా)పై గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించి ఆపై అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయిన సెప్ బ్లాటర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బ్లాటర్ పై అమెరికా మహిళా ఫుట్‌బాల్ జట్టు మాజీ గోల్‌కీపర్ హోప్ సోలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. 2013 జనవరిలో ప్రతిష్ఠాత్మక బాలన్ డిఓర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బ్లాటర్ తన పిరు దులపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ హోప్ సోలో ఆరోపించింది.
తాను వేదికను ఎక్కే సమయంలో బ్లాటర్ ఈ పని చేశాడంటూ పోర్చుగీస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోప్ తెలిపింది. మహిళా ఫుట్ బాలర్లకు అధికారుల నుంచి వేధింపులు సహజమేనని పేర్కొన్న హోప్.. ఇకనైనా మరికొంత మంది ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఆమె ఆరోపణల్ని సెప్ బ్లాటర్ ఖండించారు. అమెరికా జాతీయ జట్టు తరపున 202 మ్యాచ్ ల్లో పాల్గొన్న హోప్.. 153 విజయాల్లో భాగస్వామ్యం అయ్యింది. మరొకవైపు 102షూటౌట్లతో ఒక అంతర్జాతీయ రికార్డును హోప్ సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment