జ్యూరిచ్: ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్, యూఈ ఎఫ్‌ఏ అధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై నిషేధం ఎనిమిదేళ్ల నుంచి ఆరేళ్లకు తగ్గింది. బుధవారం ఫిఫా అప్పీల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2011లో 2 మిలియన్ డాలర్లను ప్లాటినికి చెల్లించేం దుకు బ్లాటర్ అంగీకరించడం ఈ వివాదానికి కారణం. ఫిఫా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని భావించిన ప్లాటినికి ఈ నిషేధంతో దారులు మూసుకుపోయినట్టే.
శుక్రవారం ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. నిషేధాలను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్)కు వెళతామని ఇరువురు తెలిపారు. అలాగే అధ్యక్ష ఓటింగ్‌కు పారదర్శక బూత్‌లను ఏర్పాటు చేయాలన్న అభ్యర్థి ప్రిన్స్ అలీ విజ్ఞప్తిని సీఏఎస్ తోసిపుచ్చింది.
ఆరేళ్లకు తగ్గిన బ్లాటర్, ప్లాటిని నిషేధం
Published Fri, Feb 26 2016 12:10 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM
Advertisement