బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం | Sepp Blatter and Michel Platini banned for eight years by Fifa | Sakshi
Sakshi News home page

బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం

Published Tue, Dec 22 2015 2:11 AM | Last Updated on Fri, Jun 15 2018 4:33 PM

బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం - Sakshi

బ్లాటర్, ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం

ఫిఫా ఎథిక్స్ కమిటీ సంచలన నిర్ణయం
జ్యూరిచ్: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైకేల్ ప్లాటినిలపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తూ ఫిఫా ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో వీరిద్దరు ఫుట్‌బాల్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన రాదని ఆదేశించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. అలాగే బ్లాటర్‌పై 50 వేల డాలర్లు, ప్లాటినిపై 80 వేల స్విస్ ఫ్రాంక్స్ జరిమానాగా విధించారు. ఫిఫా అధ్యక్ష పదవిపై కన్నేసిన ప్లాటిని ఆశలు అడుగంటినట్టే.

2011లో ప్లాటినికి 2 మిలియన్ల డాలర్లను బ్లాటర్ చెల్లించడం ఈ వివాదానికి మూల కారణం.   అయితే ఫిఫాకు కన్సల్టెంట్‌గా ఉన్నందుకే ప్లాటినికి ఈ మొత్తం చెల్లించానని బ్లాటర్ వాదించినప్పటికీ ఎథిక్స్ కమిటీ ఆయన వాదనలతో విభేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement