
సమయం మించిపోలేదు
సమైక్య తీర్మానంపై పీసీసీ చీఫ్ బొత్స
ఆ 30 మంది వెళ్లిపోతేనే పార్టీకి మేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా తీర్మానం చేసేందుకు సమయం మించిపోలేదని, ఇప్పుడైనా అందుకు అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. శాసనసభా సమావేశాల ముగింపు సమయంలో సీఎం కిరణ్‌కువూర్‌రెడ్డి సమైక్య తీర్మానం ప్రవేశపెడతారని వస్తున్న వార్తల గురించి విలేకరులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంత ప్రతినిధులు కూడా ఉన్నారు కనుక సమైక్య తీర్మానంఎలా సాధ్యం? ప్రభుత్వం తరఫున కాకపోవచ్చు. సీమాంధ్ర ప్రతినిధుల తరఫున వూత్రమే తీర్మానం పెట్టేందుకు వీలుంటుంది. అందుకు ఇప్పటికీ అవకాశం ఉంది’’ అని బొత్స వివరించారు.
కాంగ్రెస్ పార్టీనుంచి 30 వుంది వరకు ఎమ్మెల్యేలు బయుటకు వెళ్లిపోవచ్చని బొత్స పునరుద్ఘాటించారు. ఇతర పార్టీల వైపు చూస్తూ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అలాంటి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే, కొత్తవారిని నియమించుకొని పార్టీని ఆయూ నియోజకవర్గాల్లో పటిష్టం చేసుకోవడానికి వీలుంటుందని అభిప్రాయపడ్డారు. శ్రీధర్‌బాబు శాఖను ఎందుకు మార్చాల్సి వచ్చిందో తనకు తెలియదన్నారు. సీమాంధ్ర ఎంపీల సంకల్ప దీక్ష గురించి తనకు ముందుగా చెప్పారన్నారు. వారికి సంఘీభావం తెలుపుతున్నారా? అని అడిగితే మౌనం దాల్చారు.